తాగుడును ప్రోత్సహిస్తూ తదుపరి పరిణామాల గూర్చి ఆందోళన చెందుతున్న సమాజం
>> Tuesday, April 23, 2013
ప్రస్తుతం సమాజంలో అనేక అనర్ధాలకు తాగుడే కారణమవుతున్నది . కలియుగ లక్షణాలలో ఇదీ ఒకటి. ఇది తాగేవాళ్లనేకాదు చుట్టుపక్కలవాళ్లనూ నాశనం చేయటాకి కారణమవుతుందని తెలిసినా అనేక అనర్ధాలకు,ప్రమాదాలకు కారణమని తెలిసినా ప్రస్తుతం ఎక్కువమంది ఈ దురాచారాన్ని వ్యతిరేకించకపోవటం చిత్రం. ఇక జనంలో వ్యతిరేకత లేదు కనుక ప్రభుత్వాలుకూడా ప్లూటుగా తాగించి ఖజానాలు నింపుకుంటూ ప్రజలసంక్షేమం కోసం కృషి చేస్తున్నామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాయి.
ఇక తాగినవాడి వలన జరుగుతున్న దుర్మార్గాలపట్ల మాత్రం తీవ్రంగాస్పందిస్తున్నది సమాజం తాత్కాలికంగా నైనా.
దేశంలో జరుగుతున్న ప్రమాదాలుకానీయండి, దుర్మార్గాలుకానీయండి వాటికారకులు మద్యం మత్తులో ఉన్నప్పుడే జరుగుతున్నాయనేది ఎక్కువకేసులలో స్పష్టం అవుతున్నది. మరెందుకు సమాజం మద్యం మహమ్మారిగూర్చి దీనిని శాశ్వతంగా సమాధిచేయాలనే ఆలోచనలు చేయటం లేదు ?
ఖురాన్ లో ఉన్న ఓకథ గూర్చి చెబుతారు .
ఓసారి సైతాన్ ఓ మనిషిని దుర్మార్గం చేయాల్సినదేనని నిర్భందించినదట.
దానిలో భాగంగా ఒకటి మద్యం తాగాలి లేదా ఓ కన్యను మానభంగం చేయాలి,లేదా ఓ పసిబిడ్డను చంపాలి అనే మూడు అవకాశాలు ఇచ్చినదట. ఇందులో ఏదో ఒకటి చేసినా చాలని అవకాశం కల్పించినది.
అప్పుడు ఆమనిషి ఆలోచించాడు. పసిబిడ్దను చంపటం,స్త్రీనిచెరచటం పరమదుర్మార్గములు కనుక మద్యపానం వలన తనఒక్కనికే నష్టం కనుక ఎటుచూసినా ఇదే మేలని ఎంచి,మద్యం తాగాడు.
ఇంకేముంది మత్తు తలకెక్కాక ,అక్కడున్న స్త్రీని చెరచి,పసిబిడ్దనుకూడా చంపాడట,.
ఇన్ని అనర్ధాలకు మూలమైన మద్యపానంగూర్చి అలసత్వం వహిస్తున్న సమాజం అటుపైన జరుగుతున్న అనర్ధాలపట్ల ఆందోళన చెందటం తో ఫలితమేముంటుంది ?????

1 వ్యాఖ్యలు:
నిజాన్ని చెప్పారు. టీవి చర్చల్లో కూడా అన్నీ చర్చిస్తారు కాని, యిది ఒక విషయమే కానట్టు , ఈ విషయం గురించి
మాట్లాడరు. ప్రతీ సినీమాలోను హాస్యం వంక పెట్టి తాగుడును మామూలు విషయం గా చూపిస్తున్నారు.
మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించి, రహదారుల్లో పెట్టిన షాపులన్నీ మూసేయాలి .
Post a Comment