అవధి లంఘించి ఆర్తులను ఆదుకున్న హనుమంతుల వారి ఆర్త రక్షణ లీల ఇదిగో!
>> Wednesday, April 10, 2013
జైశ్రీరాం
గత సంవత్సరం సింగపూర్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో ఒక సోదరి కంఠస్వరంలో ఆవేదన తొణికిసలాడుతుంది. దుర్గేశ్వర గారు, మీతో పది నిముషాలు మాట్లాడవచ్చా? అభ్యర్థన
పర్వాలేదమ్మా మాట్లాడండి అన్నాను.
ఆవిడ ఆత్మీయులకు చెప్పుకున్నట్లుగా తమ జీవితంలో ఎదుర్కోంటున్న తీవ్ర సమస్యలను, దుర్భర పరిస్థితులను వివరిస్తున్నారు. తనవాళ్ళు ఎవరూ సహాయం అందించలేని స్థితి. ఒక్కసారిగా ఉన్నత స్థానం నుంచి పాతాళానికి కూరుకుపోతున్న పరిస్థితి.
సముద్రాలు దాటి వీరిని ఆదుకోగలిగే వారు హనుమంతుల వారు ఒక్కరేనని నా నమ్మకం .దుఃఖంతో నిండిన,దిక్కుతోచని ఆతల్లికి చూపగలిగే త్రోవ భగవంతునికి శరణాగతి కావటమే .అదే మార్గం సూచించాను.(ఈ విషయమై అప్పట్లో ఒక పోస్టు వ్రాశాను కూడా.)ఆర్తితో ఆయనను ఆశ్రయించారు.ఒక్కోసాధనాకొనసాగిస్తూ సుందరాకాండ పారాయణం పూర్తయ్యేసరికి అద్భుతం జరిగిందట ఆతల్లిజీవితాన. ఇక్కడ ఉన్నబంధువులకు ఇది తనవిషయమేనని తెలియపరచటం ఇష్టంలేక కొంత క్లుప్తంగా ఆవిడ మెయిల్ లో స్వామికి కృతజ్ఞతలను తెలుపుకుంటూన్నారిలా.....ఆవిడజీవితానుభవం లోంచి మనకూ కొన్ని పాఠాలు దొరకుతాయి.చదవండి.
---------------------------------------
"గత సంవత్సరం దసరా మరునాటి నుండీ ఏదో తెలీని గుబులు. దీపావళి రోజు ఇంట్లో సంతోషమే లేదు.ఎప్పుడూ ఇలా జరగలేదు. మా ఇద్దరి మనసుల్లో ఏదో తెలీని దిగులు.ఏమిటా ఇలా అనుకున్నాము.
మరునాడు విన్న వార్త మమ్మల్ని నీరసపరిచింది. అది మా ఆర్ధిక పరిస్థితిని తలకుందులుచేసే వార్త.
ఏమి చెయ్యాలో తోచలేదు.ఎవ్వరికీ చెప్పకుండా మేమే ఎలాగో రోజులు నెడుతున్నాము.ఇంతలో దుర్గేశ్వర గారు గుర్తొచ్చారు. ఆయన నాకు బ్లాగు రచయిత గా తెలుసు అంతే.కనీసం ఎప్పుడూ మాట్లాడలేదు మెయిల్ చెయ్యలేదు కూడా.
అయినా ధైర్యం గా ఫోను చేసి నా బాధ చెప్పేసాను.అమ్మా బాధ పడకండి, అన్నీ సర్దుకుంటాయి ఆ భగవంతుడిని నమ్మండి, నా మాట నిజం ఆయనని శరణాగతి చేసి ఆర్తితో పిలిస్తే జరగని పనులు లేవు అన్నారు.ఏదో అలా అన్య మనస్కం గా దేవుడీకి దణ్ణం పెడ్తున్నాను, మా పరిస్థితి ఇలా చేసావేమిటి అని ఆయనని నిలదీస్తూ.
అసలు ఇలా నేను మరలా దుర్గేశ్వర గారికి మెయిల్ చేస్తాను అనుకోలేదు. గత సంవత్సరం దీపావళి మరునాడు తలక్రిందులవ్వడం మొదలైన పరిస్థితులు అలా ఇంకా ఇంకా తలకిందులవుతూ మధ్యలో కాస్త ఊరించి బాగు పడ్డట్లే ఆశపెట్టి ఎంత దిగజారిపోయాయి అంటే అసలు మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిండిపోయే వరకూ వెళ్ళిపోయింది.
దేవుడి పుస్తకాలు శ్లోకాలు చదువుతున్నాను అయినా పరిస్థితులు చక్కబడవేమి అనుకునేదానిని. దేవుడి మీద నమ్మకం సడలిపోయింది ఒక దశలో.
అలాంటి సమయంలో రామాయణ కధా శ్రవణం మొదలుపెట్టాను.మొదలుపెట్టగానే పరిస్థితులు మంత్రం వేసినట్లుగా ఒక్కసారి మారిపోయాయి అని చెప్పను. పరిస్థుతులకంటే ముందు నా మనసు మారింది. ఇంతకముందు వరకూ దేవుడు అంటే భయం తో మాత్రమే, అవును కేవలం భయం తో మాత్రమే దణ్ణం పెట్టిన నేను ఆయనకి శరణాగతి చెయ్యడం అంటే ఏమిటో కొంచం తెలుసుకున్నాను. ఆర్తి గా నా బాధ చెప్పుకోవడం నేర్చుకున్నాను.మెల్లిగా మనసు కుదుట పడటం ప్రారంభించింది. ఇక్కడ ఒకటి గమనించండి ఇంకా పరిస్థుతులు బాగుపడలేదు, నా మనసు బాగుపడటం మొదలుపెట్టింది.
కాస్త మనోధైర్యం చిక్కింది.ఆలోచన మొదలయ్యింది ఏమి చెయ్యాలి అని.ఆ వైపుగా ప్రయత్నాలు మొదలుపెట్టాము, మెల్లిగా చాలా మెల్లిగా కారుమబ్బులు విడివడటం మొదలయ్యింది. భగవంతుడిని నమ్మితే ఆయన మనకి శంఖు చక్రాలతోనో, భుజానికి ధనుర్బాణాలు ధరించో ప్రత్యక్షమవ్వడు కానీ మన కార్యం ఎవరిని కలిస్తే జరుగుతుందో వారిని కలుసుకునేటట్లు చేస్తాడు అన్నది నేను తెలుసుకున్న మొదటి సత్యం.
నా మనసు కాస్త చక్కబడింది ,ఆలోచనలు ఒక రూపు దాలుస్తున్నాయి ప్రయత్నాలు మొదలుపెట్టాను, ప్రయత్నం ముమ్మరం చేసాను.. మళ్ళీ మధ్యలో నిరాశ.ఏదీ ఫలితాన్ని ఇచ్చేది కాదు ఎంత ప్రయత్నించినా కానీ.కాకపోతే ఈసారి మరింత ఆత్రిగా ఆయనకి చెప్పుకుని అవసరమయినప్పుడు బాత్రూం లోకి వెళ్ళి ఏడిచి మరలా సీట్లోకి వచ్చి పనిచేసుకున్న రోజులున్నాయి.
నా మొర ఆలకించాడా అన్నట్లు పోయిన వారమే ఒక శుభవార్త వచ్చింది. ఒక అంకం పూర్తి అయ్యింది. పెద్దది మరియు ముఖ్యమైన ఇంకొక అంకం మిగిలి ఉంది.చూద్దం అది ఆ స్వామి ఎప్పుడు నెరవేరుస్తాడో.కానీ ఆయన చేస్తాడు అన్న నమ్మకం మాత్రం ధ్రుడం గా ఉంది.
మనము ఆయనని నమ్ముకుంటే మన భక్తి ఆయనని కరిగించినప్పుడు అవసరమయితే అధ్భుతాలు చేస్తాడు అన్నది నేను అనుభవించాను. స్థూలం గా చెప్పాలి అంటే రూల్స్ కి కట్టుబడి పబి చేసే పెద్ద పెద్ద కంపెనీలలో అసలు అలా అవుతుంది అని మనము ఊహించనుకూడా ఊహించలేని సంఘటన జరిగింది నా విషయం లో.
వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత ఆశ్చర్యం గాఉందో ఆరు నెలలు మమ్మల్ని ఎలా కాపాడావు తండ్రీ కంటికి రెప్ప లాగ అని.
మీకు నమ్మకం ఉంతే కింద ఇచ్చిన జయమంత్రం పఠిస్తూ ఉండండి వీలయినప్పుడల్లా...
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
అలాగే కింద ఇచ్చిన శని మంత్రం నిజానికి ఇది ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన. శని ప్రభావం పట్టి కుదిపేస్తున్నప్పుడు వీలయినప్పుడల్లా శివుడి గుడికి వెళ్ళి ఈ కీర్తన జపిస్తూ ఉండండి. మీరు దానాలు జపాలు మీ నమ్మకం ప్రకారం చేస్తూ ఉన్నా కానీ దీనిని నిత్యం జపించడం వల్ల కానీ ఈ క్రుతి ఇంటిలో నిత్యం మోగుతూ ఉన్నా కానీ చాలా మంచిదిట.
దివాకర తనూజం శనైశ్చరం
ధీరతరం సంతతం చింతయేహం
భవాంబు నిధౌ నిమగ్న జానానాం భయంకరం
అతి క్రూర ఫలదం
భవానీశ కటాక్ష పాత్ర భూత భక్తిమతాం అతిశయ శుభ ఫలదం
కాలాంజన కాంతియుక్తదేహం కాలసహోదరం కాక వాహం
నీలాం శుక పుష్ప మాలా వ్రుతం నీలరత్న భుషాలంక్రుతం
మాలినీ వినుత గురుగుహ ముదితం మకర కుంభ రాశి నాధం
తిల తైల మిశ్రితాన్న దీప ప్రియం
దయా సుధా సాగరం నిర్భయం
కాల దండ పరిపీడిత జానుం కామితార్ధ ఫలద కామధేనుం
కాల చక్ర భేద చిత్ర భానుం కల్పిత ఛాయాదేవి సూనుం
దివాకర తనూజం శనైశ్చరం
కాస్త మన్సుకి సాంత్వన చిక్కాకా ఆదిత్య హ్రుదయం నేర్చుకోవడం మొదలుపెట్టాను.ఎవరో వెనక పడినట్లే మూడంటే మూడే రూజులలో నేర్చుకోగలిగాను. ఇదేదో నా గొప్ప అనుకోను. ఆయన కరుణ మీమీద ఉంటే ఇది సాధ్యమే అని నమ్మకం కలిగింది.
యూ ట్యూబ్ లో ఈ కింది లింక్ ద్వారా ఉచ్చారణ నేర్చుకున్నాను. కావాలంటే మీరూ ప్రత్నించండి.
http://www.youtube.com/watch?v=zY0rNicETyA
కేవలం జయ మంత్రము వలనో,శని కీర్తన వల్లనో లేదా ఆదిత్య హ్రుదయం వల్ల చదివితేనో మన పరిస్థితులు బాగుపడిపోతాయి అనుకోకుండా మీరు ఆయనని మనస్పూర్తిగా నమ్మి ఇవి కానీ లేదా మీకు ఇష్టమైన ఇతర దైవిక పుస్తక పఠనమో శ్లోకాలో చదువుకుంటూ ఉంటే తప్పక, అవును తప్పక మీ మనసు కుదుట పడుతుంది.
భగవంతుడిని నమ్మండి మనస్పూర్తిగ నమ్మండి.ఇదే నేను అందరికీ చెప్పేది.

0 వ్యాఖ్యలు:
Post a Comment