శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గురువు ఒక మార్గదర్శి

>> Friday, March 8, 2013



మీరిప్పుడు కేదార్‌నాథ్ వెళుతున్నారు అనుకుందాం. మీ వాహనాన్ని ఎవరో నడుపుతున్నారు. రోడ్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కాని మీరు ఒంటరిగా వస్తే రోడ్లపై మైలురాళ్లు, దారిగుర్తులు లేకపోతే కష్టం. కనీసం చిత్రపటము(మ్యాప్) అన్నా ఉంటే బాగుండు అని మీరు అనుకుంటారా, లేదా? ఒక విధంగా చెప్పాలంటే గురువు కూడా చిత్రపటము లాంటి వారే. ఉత్త మ్యాప్ కాదు, సజీవ్(లైవ్) మ్యాప్ లాంటి వారు. ఆయన సాయంతో మీరు మీ గమ్యాన్ని తేలిగ్గా చేరుకోవచ్చు. గురువే మీకోసం ఒక డ్రైవర్‌గా కూడా మారగలరు.

మీరు వాహనంలో కూర్చుని హాయిగా కునుకు తీస్తుంటే ఆయన మిమ్మల్ని నేరుగా కేదార్‌నాథ్‌కు చేర్చగలరు. అయితే ఈ ప్రయాణాన్ని మీరు ఆస్వాదించాలన్నా, వాహనంలో కూర్చొని నిశ్చింతగా కునుకు తీయాలన్నా మీకు డ్రైవర్‌పై పూర్తి నమ్మకం ఉండాలి. కొండచరియల్లో వాహనం వెళ్తున్నప్పుడు ప్రతిక్షణం, మలుపు మలుపునకూ మీరు భయపడిపోతూ..."ఈ డ్రైవర్ నన్ను క్షేమంగా గమ్యానికి చేరుస్తాడా? లేక ఈ లోయల్లో పడేసి చంపేస్తాడా?'' అని ఆలోచిస్తూ కూర్చుంటే మీకు పిచ్చి పట్టక తప్పడు. అందుకే తగినంత నమ్మకం అవసరం. మీ నమ్మకం గురువుకు అవసరం లేదు కానీ...గురువుపై మీకు నమ్మకం లేకపోతే, మీరు పిచ్చివాళ్లు అయిపోతారు.

నమ్మకం అనేది వాహనంలో కూర్చుని యాత్రలకు వెళ్లడమే కాదు. ఈ భూమి మీద బ్రతకాలన్నా నమ్మకం చాలా అవసరం. ప్రస్తుతం మీ నమ్మకం ఎఱుకలో లేదు. ఉదాహరణకు మీరు ఒక బస్సులో కూర్చున్నారు అనుకుందాం. బస్సు అంటే ఏమిటి? ఇనుప రేకులూ, నట్లు, బోల్లులు, రబ్బరూ, వైర్లూ అంతే కదా! మీకు తెలియకుండానే మీరు ఈ ఇనుప పరికరాలను నమ్మేసి అందులో కూర్చుంటున్నారు. మీ జీవితాన్ని దాని చేతిలో పెడుతున్నారు. ఇదే నమ్మకం ఎరుకతో కలిగితే మీలో అద్భుతాలు జరుగుతాయి. మనం నమ్మకం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు నమ్మకం అనేది మనకు క్రొత్త కాదు అని గుర్తించాలి.
ఈ భూమి మీద బ్రతకడానికి, అంతెందుకు మీరు తీసుకునే ప్రతి శ్వాసకూ నమ్మకం అవసరం, అవునా? అయితే ఈ నమ్మకం ప్రస్తుతం మీ స్మృతిలో లేదు అంతే. మీకు 'ఎఱుక లేకుండా' మీలో ఉన్న నమ్మకాన్ని కాస్త 'ఎఱుక'లోకి తెచ్చుకోమని అడుగుతున్నాను అంతే. దానిపై కొంత అవగాహన పెంచుకోమని కోరుతున్నాను. జీవితమే నమ్మకం, నమ్మకమే జీవితం, అదే లేకపోతే ఎవరూ ఇక్కడ బతకలేరు.

మీ దారి మీరే చూసుకోగలిగితే, మీ వాహనాన్ని మీరే నడుపుకోగలిగితే మంచిదే. కాని కొత్త చోటుకు ఎటువంటి మార్గదర్శి లేకుండా వెళితే గమ్యాన్ని చేరడానికి కొన్ని జన్మలే పట్టవచ్చు. అదే మీరు ఒక మ్యాప్(గురువు)తో వెళితే తేలికగా చేరుకోవచ్చు. అంతే తేడా. అంటే మీ అంతట మమీరు చేరుకోలేరని కాదు, తప్పక చేరుకోగలరు. కానీ ఎంత కాలం పడుతుందో చెప్పలేము. -సద్గురు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP