శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నరసింహునితో ఆటలా కొండా ! ఒల్లు దగ్గరపెట్టుకోవాలి .

>> Thursday, August 30, 2012

అనగనగా ఓ త్రిలింగ దేశం . దైవభక్తి ఎక్కువే  అక్కడ జనానికి, రాజులకు . అయితే కాలంతోపాటు జనానికి భక్తిస్థానంలో భయం వచ్చి ఏదో భయం కొద్దీ ఆలయాలకెల్లటం  ఎక్కువైంది. అందువల్ల గుడికొచ్చి వాల్లకొబ్బరికాయలు కర్పూరాలు వెలిగించుకోవడాలేగాని   భగవంతునికి అవమానం జరిగినా పెద్దగా పట్టించుకునే ఓపిక లేని తరాలు తయారయ్యాయి . ఇక  యథాప్రజా ....తథారాజా గా సూక్తి తిరగబడ్డకాలంకదా ఇది. అందువల్ల   రాజరికాన్ని చేపట్టిన నాయకులకు కళ్ళు ఓ నాలుగంచెలు పైకి చేరాయి. దృష్టి వికృతంగా మారింది. దేవుడంటే మనశాసనం ప్రకారం నడుచుకోవలసినవాడు. మనఇష్టమై ఇస్తే నే గుల్లో గోపురాల్లో నైవేద్యాలు. లేకపోతే అయన పస్తుపనుకోవల్సిందే  .అటువంటప్పుడు ఆయన మనపట్ల ఎంత .వినయంగా ఉండాలి అని రివర్స్ లో సిద్ధాంతీకరించే  స్థితికి చేరుకున్నారు. అందువల్లనే వీల్లెల్లినసమయానికి రడీ గాఉండి దేవుడుకూడా దర్శనమివ్వాలనేది వీల్లరూలు,''

ఏడ్చార్లే ! కుంకలు  .ఏదో పోనీ అని  ఆయన కూడా చూసీ చూడనట్లు పోతున్నాడు.
 ఇంకే అది  భగవంతుని చేతగానితనంగా కనిపించసాగింది   రాజులకు వారి పాలెగాల్లకు కూడా

 ఈ సమయంలో  ఓ సారి ఒక పాలెగానికి ఆగ్రహం వచ్చింది . ఇంట్లో పెల్లాం పచ్చడి నూరకపోయినా   వీధిలోకొచ్చి వీరంగం తొక్కి బందుచేయగల  వీరులాయె జనం.  మరటువంటి వారి నాయకుడెలా ఉంటాడు.
ఆయనకు  కోపమొచ్చింది . ఎదురుగా ఓ గుడి కనపడింది అంతే   .గుడికి తాళం వెసి తన తడాఖా చూపించి శరభ శరభా ...అశ్శరభ...శరభా అంటూ వీరంగం తొక్కారు.
హమ్మో హమ్మో ఎంతటి వీరుడు..ఎంతటి   శూరుడు.  దేవుడు గీవుడు జాన్తానై. అసలు దేవుడకంటే మా రాజుగారే ఎక్కువ అని  బోల్డు సంతోష పడిపోయారు   అనుచరగణం   .తమ ప్రత్యక్షదైవాలయిన నాయకులకు జయజయధ్వానాలు చేయటం అలవాటుగానూ మారింది కనుక కోలాహలం చెప్పక్కరలేదు.

అయితే ఖర్మ కాలి  అది ఉగ్రత్వానికి ప్రతీక అయిన నృసింహుని నివాసం . కొన్నిచోట్ల  శాంతం పనికిరాదనుకున్నప్పుడు ఏంచేయాలో చూపిన రూపం. ఆయనకు కొద్దిగా కోపం వచ్చినట్లుంది

  మనోడి  చేయి విరిగి   ఆరు కుట్లు పడ్డాయి హెచ్చరికగా . ప్రస్తుతానికి . . ఆ  పై ఏమవనుందో బ్రతికి బాగుంటే మనమూ ఆయనా కలసి చూద్దాం  జీవిత నౌక సినిమా లో

2 వ్యాఖ్యలు:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు August 31, 2012 at 12:46 PM  

వీడికి శిక్ష విధించడానికి దేవదేవుడు పూనుకోవాలా? రావణుడు, నరకాసురుడూ, శిశుపాలుడు అంతటి స్థాయా వీడిది. రేపు ఎన్నికలలో మనలాంటి మానవమాత్రులము చాలమా శిక్ష విధించడానికి.

చిలమకూరు విజయమోహన్ September 1, 2012 at 5:25 PM  

ప్రస్థుతం శిశుపాల,నరకాసుర,రావణ భక్తులెక్కువయ్యారు.కలికాలం,పోయేకాలం నీకు తెలియందా కృష్ణా!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP