శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కబీరు అమృత వాక్కులు

>> Saturday, June 23, 2012

కబీరు అమృత వాక్కులు
కబీరు నోటిన ఉండి అమృత వాక్కులా వెలువడిన దోహాలు.
దోహా సారుూ! ఇల్నాదీజియే! జామై కుటుమ్‌ సమాయ్‌
మైభీ భూఖానా రహుసాధూ భూఖా - నజాయ్‌


guru‘ఓ జగన్మాతా! శక్తి స్వరూపిణి, నాకుటుంబ పోషణకు సరిపడా ధనం మాత్రమే ప్రసాదించు అంతకు మించి ఎక్కువ యివ్వవద్దు. అది నాలో అహాన్ని తెచ్చి దెైవానికి దూరం చేస్తుంది. అంతకంటే తక్కువ యిచ్చావో - మరల ఈ దారిద్య్రం అనేక సమస్యలు తెచ్చి ఆ సమస్యల చికాకులు కూడా నన్ను దూరం చేస్తాయి.నా యింటికి వచ్చే సాధువులు ఆకలితో తిరిగి వెళ్ళ కూడదు. నాకుటుంబం, నేను ఆకలితో మాడకూడదు, అంతమాత్రమే ఇవ్వు’ ఆనిశీధి సమయంలో తన దారిద్య్రం పట్ల కలిగిన బాధలో తన భార్య ఈ దుస్థితికి కారణమైన నిస్సహాయ స్థితిలో, అప్పుడు కూడా చెక్కు చెదరని తన సాధుసేవలో, దెైవం పట్ల విశ్వాసంతో, తన కర్తవ్యాన్ని, నిష్కల్మష, నిర్మోహ, నిశ్చల హృదయంతో నిర్వర్తించ బూనుకున్న ఆ మహాత్ముడు కబీరు. ఆ దోహా ఎంతటి జీవిత సత్యాలను, ఆధ్యాత్మిక ఔన్నత్యాలను, క్రమశిక్షణను చాటుతోందో పరిశీలించండి


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP