శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగ స్వామి చరిత్ర -47, 48

>> Wednesday, June 20, 2012

కాల్చిన గింజను పాతిపెడితే అది మొక్క మొలవదు కదా! అలాగే బీజాక్షరాలను సరిగ్గా చూడక దీక్షనివ్వరాదు. బీజాక్షరాలను సరిగ్గా చూసే శక్తి సద్గురువుకు తప్ప ఎవరికీ ఉండదు. సద్గురువు సామాన్యంగా లభించడు. అట్లాగే దీక్ష తీసుకోవటం కూడా సామాన్యమైన విషయం కాదు.
కనుక అన్నీ చక్కగా కుదిరినప్పుడే దీక్ష తీసుకోవడం మంచిది. యోగ్యుడైన గురువు లభించకపోవటంవలన ఇలాంటి దుర్దశలలు కలుగుతున్నది. కొన్ని సందర్భాలలో చిన్న వయసు బాలురు, లేదా కొందరు స్ర్తిలు కూడా దీక్ష ఇస్తున్నారు. దీక్ష ఇవ్వటం ఎంత కష్టమో వీరిలో ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఇలాంటి గురువుల వద్ద దీక్ష తీసుకొనే వారికి దీక్ష ఎందుకోసం తీసుకోవాలో కూడా తెలియదు. పూర్వకాలంలో యోగ్యులైన శిష్యులు చాలామంది లభించేవారు; అందువలన సద్గురువులు కూడా లభించేవారు. భగవంతునిలో ఐక్యం చెందాలని ప్రాణి నిజంగా వ్యాకులపడి రోదిస్తే, భగవంతుడే స్వయంగా సహాయపడి సద్గురువుతో కలుపుతాడు
సద్గురువు బజారులోనో, త్రోవోనో, ఘాట్‌లలోనో, లేదా దగ్గరలోనే దొరకడు. భగవంతుని కలవటానికి ఎవరు పిచ్చివాళ్లయిపోతారో, ఆయనను పొందటానికి ఎవరు విరహవేదన పడతారో, ఆయన దర్శనానికి ఎవరిలో ఎక్కువ బలం ఉంటుందో, ఆ భగవంతుడు లభించకపోతే ఏదీ చక్కగా అనిపించదో- అప్పుడు ఆ భగవంతుని దయవలననే సద్గురు దర్శనమవుతుంది. సత్-శిష్యుడు కాకపోతే సద్గురువు దొరకడు. ఎలాంటి శిష్యునికి అలాంటి గురువు లభిస్తాడు. ఒకవేళ శిష్యుడు గురువు పట్ల ఎక్కువ శ్రద్ధాళువు అయినప్పుడు, ఆ దీక్ష తీసుకొన్న మంత్రం మీదను భగవంతుని మీదను భక్తి విశ్వాసములతో ఉంటే, అప్పుడు అతని గురువు పరిపక్వతలేని వాడైనప్పటికీ, శిష్యుడు దీక్షకు అధికారి కాగలుగుతాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు.
పైన చెప్పిన లక్షణాలు కల శిష్యుడు జాగ్రత్తగా పరిశీలించి యోగ్యుడైన వ్యక్తిని గురువుగా ఎన్నుకొన్నట్లే, గురువు కూడా శిష్యుని స్వభావాన్ని తెలుసుకోకుండా అతనిని శిష్యుడుగా స్వీకరించరాదు. శిష్యుడు పుణ్యాత్ముడు, ధార్మికుడు, విశుద్ధాంతఃకరణుడు, గురుభక్తి పరాయణుడు, జితేంద్రియుడు, దాన ధ్యాన పరాయణుడు, ధీర స్వభావుడు కాకపోతే గురువు అతనికి దీక్షనివ్వకూడదు.
సోమరి, మలిన వేషధారి, డాంభికుడు, కృపణుడు, దరిద్రుడు అంటే డబ్బును ఉచిత రీతిని ఖర్చుపెట్టనివాడు, రోగి, అసంతుష్ట చిత్తుడు, కోపి, లోభి, పరుషవాక్కుగలవాడు, అన్యాయంగా ధనార్జన చేసి ధనవంతుడైనవాడు, పరస్ర్తిలోలుడు, ఆచార భ్రష్టుడు, ఇతరులకు నష్టం కలిగించేవాడు, తిండిపోతు దురాత్ముడు, గురునింద చేసేవాడు, గురునింద వినేవాడు- అయిన పాపిష్టి నరాధములను ఎప్పుడూ శిష్యునిగా స్వీకరించరాదు. మంత్రి చేసిన పాపము రాజును, స్ర్తి చేసిన పాపము భర్తను, శిష్యుడు చేసిన పాపము గురువును తప్పక చుట్టుకుంటుంది.
గురువు శిష్యుని ఇంటికి వచ్చినపుడు, శిష్యుడు ముందు నడిచి ఆయనను తన ఇంటికి తేవాలి. ఆయన వెళ్లిపోయేటప్పడు కొంచెం దూరం ఆయన వెనుక వెళ్లాలి. ఆయన అనుమతి లేనిదే ఆయన ముందు ఏ ఆసనం మీద కూర్చోరాదు. ఆయన ముందు శాస్త్ర వ్యాఖ్య చెయ్యకూడదు. తన గొప్పతనం ప్రదర్శించుకోగూడదు. గురుశిష్యులిద్దరూ ఒకే ప్రాంతం వారైతే, త్రికాలములలోనూ గురువుకూ నమస్కరించాలి. గురుధామము రెండు మైళ్ల దూరంలో ఉంటే ప్రతి నెలలో నాలుగుసార్లు, ఎనిమిది మైళ్లులేదా అంతకన్నా ఎక్కువ దూరంలో ఉంటే నాలుగు నెలలకుఒకసారి వెళ్లి తప్పక నమస్కారం చెయ్యాలి.
గురువుగారి ఆజ్ఞను తప్పక పాటించాలి. అట్లా చెయ్యకపోతే ధర్మము, కర్మము, జపము, పూజ మొదలైనవన్నీ విఫలమై అధఃపతనం చెందుతాడు. గురువుగారివద్ద ఎప్పుడూ అప్పు తీసుకోవటం కాని, క్రయ- విక్రయాలు కాని చె
భక్తి పూర్వకంగా గురు ప్రసాదాన్ని స్వీకరించేవాడి పాపాలన్నీ నశించిపోతాయి.
దీక్ష తీసుకొనే కోరిక ఉంటే ఈ క్రింది విషయాలను హృదయపూర్వకంగా పాటించాలి.
1.అసత్యమును పలుకరాదు.
2.ఎవరినీ ఎప్పుడూ హింసించరాదు.
3.అన్నిజీవులపట్ల సమానమైన దయను కలిగి ఉండాలి.
4.సాధ్యమైనంత వరకూ పరోపకారం చెయ్యాలి.
5.కామాదులను అణచివెయ్యాలి. అంటే తన వశంలో ఉంచుకోవాలి.
6.ఇతరుల వైభవాన్ని చూసి ఈర్ష్యపడరాదు. పైగా ఆనందించాలి.
7.తెలిసి తెలిసి అన్యాయపు పనులు చెయ్యరాదు.
8.వ్యర్థంగాను, అతిగాను మాట్లాడకూడదు.
9.లోభమును, వాసనలను త్యజించాలి.
10.కోరికలను త్యజించి ఉపాసన చెయ్యాలి.
11.సత్ఫురుషులతో స్నేహం చెయ్యాలి.
12.ఏ ధర్మముపట్ల అశ్రద్ధ చూపరాదు. అన్ని ధర్మములు సమానము. ఎవరికి ఏ ధర్మంమీద విశ్వాసంటుందో వారికి ఆ ధర్మంవల్లనే ముక్తి లభిస్తుంది. పొరపాటున కూడా ఎప్పుడూ మరొకరి విశ్వాసాన్ని భంగపరిచే పనులు చెయ్యరాదు.
హిందూ ధర్మము యొక్క సారము చిత్తశుద్ధి, హిందూ ధర్మముపట్ల అనురాగము కలవారు, హిందూ ధర్మ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవలెనన్న కోరిక గలవారు, ఈ తత్త్వం పట్ల అత్యంత భక్తిశ్రద్ధలను చూపాలి. సాకారపూజ లేదా నిరాకారపూజ, ఈశ్వరవాదము, బహుదేవతా భక్తివాదము, ద్వైతావాదము లేదా అద్వైతావాదము, జ్ఞానవాదము లేదా కర్మవాదము అన్నీ దీనిముందు తీసికట్టే
చిత్తశుద్ధి ఉంటే అన్ని మతాలు పవిత్రమైనవే! అది లేకపోతే అన్నీ అపవిత్రములే. చిత్తశుద్ధి లేనివారికి ఏ ధర్మమూ లేదు. పవిత్రమైన చిత్తము కలవారికి క్రియారూప ధర్మముయొక్క ఆవశ్యకత లేదు. చిత్తశుద్ధి కేవలము హిందూ ధర్మముయొక్క సారమే కాదు; అది సర్వ ధర్మముల సారముకూడా. ఎవరి చిత్తము పవిత్రమైనదో, అతడు శ్రేష్టుడైన హిందువు; అతడు శ్రేష్ఠుడైన మహమ్మదీయుడు; శ్రేష్ఠుడైన బౌద్ధుడు. అట్లాగే మిగిలిన ధర్మములవారుకూడా. ఎవరికి చిత్తశుద్ధి లేదో, వారు ఏ ధర్మావలంబులైనా గణనీయులు కారు. కనుక చిత్తశుద్ధి అంటేనే ధర్మము. దాని గొప్పతనమంతా హిందూ ధర్మంలోనే ఉన్నది. కనుక చిత్తశుద్ధి లేనివారిని హిందువులని పిలవరాదు.
చిత్తశుద్ధి అంటే ఏమిటి? ఇది అనేక లక్షణములను బట్టియు, పనులను బట్టియు తెలుస్తుంది. చిత్తశుద్ధి యొక్క మొదటి లక్షణము ఇంద్రియ సంయమనము. ఇంద్రియ సంయమనమంటే ఇంద్రియ ఛేదమో, ఇంద్రియ నాశమో కాదు. ఇంద్రియములను మన వశంలో ఉంచుకోవటం. అంతేకాని మనము ఇంద్రియముల అధీనంలో ఉండటం కాదు. అదే ఇంద్రియ సంయమనమంటే! అతిగా భుజించటం ఒక రకమైన ఇంద్రియవశత.
అయితే దానిని వశపరచుకోవటమంటే అసలు భోజనం చేయకపోవటం కాదు. లేదా వాయు భక్షణమో లేదా అర్థాశనమో లేదా ఏదో కొద్దిగా తిని దినములు గడపటమో కాదు. శరీరము దాని ఆరోగ్య పరిరక్షణకోసం ఏ ప్రకారమైన ఆహారం ఎంత పరిమాణంలో తీసుకోవాలో అంత తప్పక తీసుకోవాలి. దానివలన ఇంద్రియ సంయమనానికి భంగం కలగదు. ఇంద్రియ నిగ్రహము అంత కఠినమైన పని కాదు. ఏ ఇంద్రియానికీ లోబడక, దానిని మన వశంలో ఉంచుకోవాలి. అందువలన ఉత్తమ ఆహారం తీసుకోవటం అనుచితం కాదు. అయితే దానిపట్ల ఆసక్తి ఉండరాదు.
స్థూలంగా చెప్పాలంటే ఇంద్రియములపట్ల ఆసక్తి చూపకపోవటమే ఇంద్రియ సంయమనము. ఆత్మరక్షణకు, లేదా ధర్మ రక్షణకు ఇంద్రియముల ఉపయోగము ఎంత అవసరమో, అంతకుమించిన ఇంద్రియములను తృప్తిపరచాలని కోరుకోటమే ఇంద్రియ సంయమనం లేకపోవటము. ఆ విధంగా చెయ్యనివాడు ఇంద్రియ నిగ్రహం లేనివాడే!
- ఇంకాఉంది
య్యరాదు. గురు ప్రసాదాన్ని స్వీకరించనివాడికి అడుగడుగునా ఆపదలు వస్తాయి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP