వీళ్ళు ! తల్లిపాలే బలవర్ధకమైనప్పుడు తల్లిమాంసం కూడాఇంకా బలవర్ధకం తినాలనే నినాదాలివ్వగలరు.
>> Wednesday, April 18, 2012
ఈ మధ్య వార్తాపత్రికలలో బ్లాగులలో ఓ కౄర,మైన వాదనలను చదువుతున్నాము. ఈదేశంలో ఉన్నవాళ్ళు ఆవును పవిత్రంగా చూస్తారు. కన్నతల్లితో సమానంగా గౌరవిస్తారు. అనాదినుండి తన పాలతోనూ,తనసంతైతో మానవుణ్ణి పోషిస్తున్నదన్న కృతజ్ఞతాభావం. అలాగే దాని కున్న దైవీయ గుణాలు . సాధుమనస్తత్వం ఇవన్నీ గోమాతకు గౌరవాన్ని కల్పిమ్చాయి. శాస్త్రీయంగా గో ఉత్పత్తులకు గల ఓషధీయ గుణాలు కూడా గొప్పవి.
ఇక ఆవుమాసం తినాలనే కోరిక కలగటమో కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీయటంమాత్రమేగాక , సంస్కృతిపరంగా ఉన్న ఐక్యతను విచ్చిన్నం చేయాలనుకునే విదేశీ ప్రేరిత శక్తులు ఈ వాదనను పెద్దవిచేస్తున్నాయి. ఇక ఆవుగొప్పతనం ,పవిత్రత విషయాలపై చర్చలకంటే ముందు వీళ్లవాదనలలో ఉన్న రాక్షసత్వం ఘోరంగా ఉంది.
మొన్నొకాయన ఆంధ్రజ్యోతిలో ,ఆవు పంచితం,ఆవుపాలు పవిత్రమైనప్పుడు ఆవుమాంసం ఎందుకు పవిత్రం కాదు అని.వ్రాశాడు. పాలే అంత బలమైతే ఆవు మాంసం ఇంకెంతబలమని ? అంటాడు.
ఇలా ప్రశ్నిస్తున్న వాళ్ళు తల్లిపాలు బలవర్ధకమైన ఆహారం కదా అలాంటిది తల్లిమాంసం ఎందుకు బలవర్ధకమైన ఆహారం కాదు? కాబట్టి తల్లిమాంసం లో ఉన్న పోషకవిలువలరీత్యా తల్లి మాంసం కూడా తినాలి అనికూడా అనగలరు
చిత్రంగా ఉంది . హిందుమతం లోంచి బౌధ్ధమతంలోకి మారాలి అని నినాదాలిస్తున్నవారు మరి బౌధ్ధమతంలో ప్రముఖమైన అహింసా సిధ్ధాంతాన్ని గూర్చి గాని ఇటువంటి రాక్షసమనస్తత్వాన్ని గూర్చి వ్యతిరేకంగా మాట్ళాడకుండా దీనికి కులాల కంపు తగిలిస్తున్నారు,
కలి యుగాన ఏమి పాపకర్మలు జరుగనున్నాయో వేదవ్యాసులవారు భాగవత,భవిష్యపురాణాదులలో చెసిన హెచ్చరికలన్నీ ఒక్కొక్కటిగా మనతరంలోనే చూడాల్సివస్తున్నది, ఐతే ఈ సామూహిక పాపాల ఫలితంగా మానవజాతి ఎదుర్కోబోతున్న మాహాఘోర సంకటాలు కూడా తెలుసుకోవాలి ఇప్పుడుమనం కనీసం .
10 వ్యాఖ్యలు:
బాగా గడ్డి పెట్టారు.
వీళ్ళకి ఈ గడ్డి సరిపోదు. ఇంకా పెట్టాలి
:) True!
Nothing will be spared, particularly when it is freeeee. ;)
తల్లిని గౌరవించేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని తెలిసికూడా మాటి మాటికీ ఒక గొడ్డుని తల్లితో సమానంగా అభివర్ణించే వాళ్ళవి రెచ్చగొట్టే పనులు కావా ?
ఈ రోజు "మేము గోమాంసభక్షకులం" అని ఱొమ్ములు విఱుచుకుంటున్నారు.
వాడుకోవడం.... వాడుకోవడం... వాడుకునీ, వాడుకునీ అవతల పారేయడం - ఇది పాశ్చాత్య పదార్థవాద సంస్కృతి. అందుకే "గోవు తల్లితో సమానం" అంటే వాళ్ళు నవ్వుతారు.
ఉపయోగపడ్డ ప్రతిదాంట్లోనూ దైవాన్ని చూడ్డం, అనుబంధాన్ని పెంచుకోవడం భారతీయసంస్కృతి. ఇది మూఢవిశ్వాసం అనేవాళ్ళ యొక్క మానవతా ఆదర్శాల అసలుస్వరూపాన్ని నేను శంకిస్తాను.
ఎల్బీఎస్
పైవాఖ్య
బాలసుబ్రహ్మణ్యం గారిది.చిన్న సాంకేతికలోపం వలన ఇలా పేస్ట్ చేశాను
ఇక వ్యాఖ్యాత గారూ మీ ఉద్దేశ్యం అర్ధమవుతున్నది.చీలికలుతేవటానికి కావలసిన వాదనలలో ధిట్తలు మీరు. కనుక మాభావాలు మీరెలానూ అంగీకరించరు. మీ ప్రయత్నాలిక్కడ ఉపయోగపడవేమో!
Duregeswara గారు,
అసలు విషయం లోకి వస్తే ఎవరి మనోభావాలనైనా అనవసరంగా గాయపరచడాన్ని నేనూ వ్యతిరేకిస్తాను. వితండ వాదాలని ఖండించడంలో నేనూ మిమ్మల్ని సమర్ధిస్తున్నాను. కాకపోతే నాకు రెండు వైపులా వితండ వాదం కనిపిస్తుంది మరి. అలా చూడగలగటం చీలికలు తేవడం అని మీరనుకుంటే అది మీ అభిప్రాయం. నేను దాన్ని సమర్ధించలేను.
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది.
పాలుతాగి మనిషి విషమౌతాడు అని ఒక కవి పాటలో రాశాడు. విషయమవ్వటమే కాదు పాలుతాగి ఆ ఆవునే తినేసే రకాలు.
ఒక గొడ్డుని తల్లితో పోల్చడం రెచ్చగొట్టడమా..?
తల్లికి మల్లే, పాలిచ్చి మానవ జాతి పోషిస్తోందని ఏ పూర్వపు మహర్షో, అందులో తన తల్లిని దర్శించి "గోమాత"అని అభివర్ణించాడు. దాన్ని సమాజం మొత్తం దర్శించింది. (దర్శించడం అంటే చూడడం అనుకునేరు. కానే కాదు). ఇప్పటికీ గోవులో తల్లిని దర్శించుకుంటున్నవారు ఎందరో..! ఈ పోలిక ఇప్పటిది కాదు. ఎఫ్ఫటినుండో ఉంది.
పోతే, ఈ మొత్తం తతంగం వెనుక రాజకీయ నాయకుల దురుద్దేశ్యం ఉందని నా అనుమానం.
Post a Comment