గురుపౌర్ణమిరోజు గురుమండల రూపిణిగా స్తుతించబడు జగన్మాత దివ్యార్చన .
>> Wednesday, July 21, 2010
గురుపౌర్ణమి దివ్యశక్తుల ప్రసారం భూమిపైన విశేషంగా ఉండేరోజు . అందుకే జ్ఞానరూపుడై ,సద్గురువై లోకానికి వెలుగుబాటచూపిన వ్యాసభగవానులవారి పేరున పండుగగా జరుపుకుంటాము . సద్గురుపరంపరయంతా ఒకటేననే సత్యాన్ని నమ్మి, వివిధసాంప్రదాయాలలో అథ్యాత్మిక మార్గం లో నడుస్తున్న ఈ పుణ్యభూమిలో సాధకులంతా ఈ పౌర్ణమిని విశేషపూజలతో వేడుకలు నిర్వహిస్తారు. ఆరోజు గురుమూర్తిని పూజించటం ,ఆయన అనుగ్రహాని పాత్రులవటానికి మనం ప్రయత్నించాలి . ఈ సంకల్పంతో గురుచరిత్రలను పారాయణం చేయటం ,వ్యాసపూజ చేయటం విశేషఫలప్రదం.
ఈసందర్భంగా శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం ఈనెల 25 ఆదివారం రోజున గురుపూజ నిర్వహిస్తున్నది . ఆరోజు పీఠంలో నివాసులైయున్న ఆదిగురువైన దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకములు ,గురుపాదుకాపూజ జరుగుతాయి . గురుమండలరూపిణ్యై నమోనమ: అని ప్రణతులందుకునే జగన్మాత దుర్గాదేవికి విశేష అర్చన ,గాయత్రీ హోమము నిర్వహించబడతాయి .
ముఖ్యంగా చంద్రోదయ సమయంలో శ్రీచక్రస్థితయైయుండే ఆ బంగారుతల్లికి హరిద్రా,గంధ,కుంకుమాది ద్రవ్యాలతోనూ ,భక్తులు సమర్పించే వివిధ పుష్పాలతోను మారేడు,తులసి పత్రాలతోనూ లలితాసహస్రనామార్చనవిధిలో అర్చన జరుపబడుతూంది. ఇలా చంద్రోదయ వేళ ఆమహాదేవిని జరిపిన ,జరిపించిన వారికపై ఆతల్లి అమృతదృష్టి ప్రసరించి సకలశుభాలను సంప్రాప్తింపజేస్తుందని శాస్త్రవచనం. ఈపౌర్ణమినుండి భక్తులకోరికపై పీఠంలో ప్రతిపౌర్ణమికి ఈపూజ జరిపించేందుకు నిర్ణయించటం జరిగింది.
ఈ అర్చనానంతరం మాఊరి సమీపంలో కూర్మగిరిపై వెలసిన స్వయందత్తావతారమైన కొండగురునాథుని క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం జరుగుతుంది .స్వయంగా పాల్గొనదలచిన సాధకులకు ఇదే మాహృదయపూర్వక ఆహ్వానం .
ఇక ఈపూజలలో స్వయంగా పాల్గొనలేనివారు ,ఎప్పటి వలెనే తమ గోత్రనామాలను పీఠమునకు పంపినచో వారి తరపున కూడా పూజదులు జరుపబడతాయి . ప్రత్యేకంగా తమతరపున అభిషేకములు ,అర్చన జరిపించదలచుకున్నవారు పుష్పములను సమర్పించ దలచుకున్నవారు తెలియజేస్తే వారి కొరకు ఒక పురోహితుని ఏర్పాటుచేసి వారి తరపున నిర్వహించుట జరుగుతుంది. ఆయితే వారారోజు ఇంటిలో గాని ఆలయంలో తమ ఇష్టదేవతలకు పూజ జరుపుకోవాలి .
జయజయగురుదత్తా .... జయముజయము గురుమండలికి .
durgeswara@gmail.com
9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment