కుండలను కుమ్మరి చేస్తాడు . కానీ కుండలే కుమ్మరిని చేస్తే !
>> Friday, July 9, 2010
కుమ్మరి కుండలను చెస్తాడు అ అనేది మనం చుసినది విన్నది ,చదివిన విషయం . అది అర్ధమవటం పెద్దకష్టం ఏమీ కాదు.
కానీ కుండే కుమ్మరిని చేసిందంటే మహా విడ్డూరంగా ఉంటుంది. అది వాస్తవమైతే అంతా తల్లక్రిందులౌతుంది .
భగవంతుడు సర్వాన్ని సృష్టించాడని ,మానవుణ్ణి కూడా సృష్టించాడనీ ,అన్ని మతాలు,మహాత్ములు చెప్తారు . నిజానికి ఇంతటి అద్భుతమైన,విచిత్రమైన,సంకీర్ణమైన,సృష్టిని చేయగలగటమంటే అది భగవంతునికే సాధ్యం . అందులోనూ మహామేధస్సు కలిగిన మానవజాతి ఉద్భవించాలంటే అది తప్పక భగవత్సంకల్పం వల్లనే జరిగి ఉండాలి .
కానీ ఈ రోజుల్లో అన్నింటీలాగే ఈ విషయం కూడా తారు మారైంది . భగవంతుడు అలా ఉంటాడని ఒకరు ,కాదు అలా ఉంటాడని ఒకరు,వాదించుకుని కమిటీలు వేసి ,పార్టీలు కట్టి ,ఓట్లు వేసుకుని అధ్యక్షుణ్ణి ఎన్నుకుని ,అట్టి అధ్యక్షుని,అభిప్రాయాన్ని బట్టి తమకు తోచిన "భగవంతుని" సృష్టించుకుని తికమక పడుతున్నాడు మనిషి .కల్లు తాగిన పిచ్చికోతికి ఆకలసి గంతులేస్తుంటే కాళ్ళో ముళ్ళు గుచ్చుకుందట. ఇక దాని గోలకి అంతుంటుందా ? అలాగే అసలే తికమక పడుతున్న మనిషికి ప్రాంతీయ అభిమానం ,దేశాభిమానం తోడై " తమవాడు" అనుకున్న లోకల్ నాయకుని అభిప్రాయాన్ని బలపరచుకునే యత్నం లో మతాల [అభిప్రాయాల ] మధ్య వైషమ్యాలేర్పరచుకుని కీచులాటలనుంచి యుద్ధాలదాకా అనేక రీతులైన గోలలు చేస్తున్నాడు మనిషి . ఈ గోల కొత్త ఫ్యాషన్ లను అనుసరించి " మాగురువు గొప్ప" అంటే " మాగురువు గొప్ప " ,మాగురువు చెప్పింది ఇది" అంటే కాదు "మాగురువు చెప్పింది అది" అనికొట్టుకుచస్తున్నాం . ఈ గోలలో ఇండిపెండెంట్ అభర్థుల్లాగా " మాకు తెల్సిన since ప్రకారం దేవుడే లేడ"నిబొబ్బలు పెడుతున్న కొత్త బృందం తయారైంది . కుమ్మరి కుండలను చెస్తే బాగుంతుంది కానీ కుండే కుమ్మరిని ఇట్లానే అంతా తల్లకిందులవుతుంది . భగవంతుడు కుమ్మరి అనుకుంటే ,మనుష్యులు కుండలనుకుంటే పై వాక్యం సరిగా అర్ధం చెసుకుంటే ఎన్నో చికాకులు వదులుతాయి . ప్రతి కుండా తలకొక కుమ్మరిని ఊహించుకోవటం కంటే అసలు కుమ్మరి ఎవరో తెలుసుకుంటే ఆయనే అన్నికుండలకు కుమ్మరి అని అర్ధమై సమస్యలు తీరుతాయని ఈ కుండ అభిప్రాయం . ఇది ఉపయోగకరమో లేక మరో కొత్త పార్టీయో కాల్మే నిర్ణయించాలి .లేదా ప్రతీ "కుండా"ప్రయత్నించి తెలుసుకోవాలి.
[ద్వారకా నాథ్ జ్ఞానేశ్వర్ " సాయి బాబా పత్రికనుండి ]
1 వ్యాఖ్యలు:
DUrGA ji,
naaku saibaba patrika address kavalandi
please phone number aina sare
thanks
Post a Comment