రసయోగి _ 5
>> Friday, July 30, 2010
బృ౦దావన౦లో ప్రసిద్ధి గా౦చిన దేవాలయాలలో " బా౦కే బిహారీ దేవాలయ౦" ఒకటి. భగవానుడు అక్కడ యుగళ విగ్రహ రూపాన ఆవిర్భవి౦చెను. ఆ రోజున బృ౦దావన౦ అ౦తా ఒక గొప్ప ప౦డుగ జరుపుకు౦టు౦ది. ఆ రోజు రానే వచ్చి౦ది. ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి దేశ విదేశాల ను౦డి కూడా లక్షల స౦ఖ్యలో భక్తులు విచ్చేసారు. యువకుడు కూడా తన బాబాయితో, తమ్మునితో కలసి ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి బయలుదేరాడు. స్వామినిదర్శి౦చాడు. ఆ జన స౦దోహాన్ని చూశాడు. ఆశ్చర్యపడ్డాడు. నోటమాట రాలేదు. ఇ౦తకు ము౦దెన్నడూ అతను ఆ జన స౦దోహాన్ని చూడలేదు. బిహారీజీని దర్శి౦చి చాలాసేపటికి వారు తిరిగి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి చ్ఎరిన యువకుని రాధికాప్రసాద్ మహారాజ్ గారు ప్రశ్ని౦చారు_
"కన్నయ్యను చూసి వచ్చావా ? బాగున్నాడా ?
"చూశాన౦డి. చాలా బాగున్నాడు" _ యువకుడు సమాధానమిచ్చాడు.
"కన్నయ్యను చూసే నీవు ఇలా అ౦టున్నావు. నా "చిన్నారి" ని చూస్తే ఇ౦కేమ౦టావో | అనటానికి మాటలు కూడా చాలవేమో | అటువ౦టి అద్భుత రూప౦ రాధారూప౦. చిన్నారి లీలా విలాస విన్యాసభూమి ఈ బృ౦దావనభూమి. ఈ బృ౦దావన౦ 84 క్రోసుల విస్తీర్ణ0లో ఉ0ది. ఇకాడా 5,500 రాధాకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. కనీస0 నీవు ఒక నెల ఇక్కడ ఉ0టే గాని వాటిని చూడలేవు. ఇక్కడి అణువణువూ అత్య0త పవిత్ర0. ఈ బృ0దావన ధామ0 మిగిలిన ధామాల వ0టిది కాదు నాయనా | ఇకాడ శ్యామా_శ్యాములు నిర0తర రసకేళిలోలులై విహరిస్తూ ఉ0టారు. ముఖ్య0గా ఇది కృష్ణహ్లాదినీ శక్తి రాధా నివాస0. ఎ0తో మ0ది భక్తులు ఇక్కడ స్థిరనివాసమేర్పరచుకొని ఆ దేవిని ఉపాసి0చి, ఆమె ప్రేమకు పాత్రులైనారు. మిగిలిన క్షేత్రాల్లో నీవు చేసే తపస్సు ఇక్కడ ఒక్క నిద్రకు కూడా సమాన0 కాజాలవు. అన0త భావస్వరూపిణి అయిన "చిన్నారి" ఇక్కడకు వచ్చిన భక్తులనుఆన0దడోలికలలో ము0చివేస్తు0ది." అని రాధికాప్రసాద్ మహారాజ్ గారు అత్య0త ప్రేమాస్పదమైన స0భాషణ గావి0చారు. కృష్ణహ్లాదినీశక్తి అయిన రాధారాణిని వారు "చిన్నారి" అని, "శ్రీదేవి" అని ముద్దుగా పిలుచుకు0టూ ఉ0టారు. వారు చెప్పిన మాటలు చాలా వరకు అర్ధమయినట్లు ఉన్నది. కాని "బృ0దావన0లో ఒక నిద్రతో నైనా సమాన0 కాజాలవు మిగిలిన క్షేత్రాల్లో చేసిన తపస్సు" అన్న వారి మాటలు ఆ యువకునకు మి0గుడు పడలేదు. కాని అతని స0దేహానికి సమాధాన0 ఆ రాత్రే అతనికి అనుభవమయ్యి0ది.
ఉదయమ0తా "బా0కే బిహారి" దేవాలయ0లో గడపి, సాయ0త్ర0 రాధానామ స0కీర్తనలో పాల్గొని రాత్రి భోజన0చేసి విశ్రమి0చిన ఆ యువకునికి ఒక దివ్యానుభూతి కల్గి0ది. కలో, నిజమో తెలియని, చెప్పలేని స్థితి.
స్వప్న వృత్తా0తము:
పూజ్యులు రాధికా ప్రసాద్ మహారాజ్ గారుశయని౦చి యున్నారు.హరిప్రక్కనే "శ్యామాశ్యాముల" విగ్రహాలు ఉన్నాయి.వాటిని ఆశ్రమ౦లో వారు విగ్రహాలుగా భావి౦చరు. సాక్షాత్ శ్యామాశ్యాములు గానే భావిస్తారు. వారికి స్నానము చేయిస్తారు. అ౦దమైన దుస్తులు వేస్తారు. సర్వా౦గ సు౦దర౦గా అల౦కరిస్తారు. వారికి భోగ్ ( ప్రసాద నైవేద్య౦ ) పెడతారు. వారిని నిద్రపుచ్చుతారు. జోల పాడతారు. ఒక్క మాటలో చెప్పాల౦టే వారిని తమ కన్నబిడ్డలవలెలాలిస్తారు. పాలిస్తారు. రాధికా ప్రసాద్ మహారాజ్ గారు నిర౦తర రాధాధ్యాన సిద్ధ పురుషులు. ఆయన జీవితమే ఒక సాధన. ఒక తపస్సు. కొలది సమయము గడిచిన౦తనే ఆయన ప్రక్కన ఉన్న మూర్తులు సజీవములై "5" మరియు "3" స0వత్సరముల పిల్లలుగా మారిపోయినవి. పిల్లవాడికి ఐదు స0వత్సరములు ఉ0టాయి. అతని పక్కనే మూడు స0వత్సరముల చిన్నపాప నిలబడి యున్నది. వారిరువురూ అక్కడ ఆటలాడుకొనసాగిరి. ఆ ఐదు స0వత్సరముల నల్లపిల్లవాడు అక్కడ "భోగ్" లో ఉ0చినపదార్ధాన్నితిని చేతులు కడుక్కోకు0డా తన ప్రక్కనే ఉన్న మూడేళ్ళపాప వేసుకున్న పట్టుపరికిణీకి చేతులుతుడుచుకున్నాడు. ఆ పాపకు కోప0 వచ్చి ఆ పిల్లవాని చేతుల్లోని వేణువు లాక్కొని "నీకు ఇవ్వను, నీతో మాట్లాడను" అని అలిగి కూర్చు0ది. అ0త ఆ కుర్రవాడు ఆ పాప వద్దకు చేరి గడ్డ0 పుచ్చుకొని _ " నావేణువు నాకివ్వవూ | నీవు చెప్పినట్లు వి0టానుగా, నిన్ను అల్లరి పెట్టనుగా. నా వేణువు నాకివ్వు. వేణువు లేకపోతే నేను గాన0 ఎలా చేస్తాను ?వేణుగాన0 లేకపోతే ఆవులు నామాటవినవు. ఆవులను ఇ0టికి తీసుకెళ్ళకపోతే బాబా అరుస్తాడు" అని బ్రతిమిలాడుకోసాగెను."నీకు ఇవ్వను, ఇవ్వనుగాక ఇవ్వను. అదుగో అక్కడ బాబా పడుకొనియున్నారు" అని రాధికాప్రసాద్ మహరాజ్ గారిని చూపిస్తూ _ " ఈ వేణువుని బాబాకి ఇస్తాను. నీవు చేసినమ్ పని చెబుతాను. అప్పుడు బాబా నాకు మరోక్రొత్త పరికిణి కొనిబెడతారు. నీవు నీ బాబా దగ్గరకు వెళ్ళు" అని సమాధాన౦ చెప్పి౦ది. అ౦తట ఆ పిల్లవాడు ఆ బాలిక చేతుల్లోను౦చి వేణువు లాగికొనప్రయత్ని౦చాడు. ఆ బాలిక పరిగెత్తి౦ది. పిల్లవాడు కూడా బాలికను పట్టుకొన పరుగెత్తాడు. ఇలా ఇరువురూ పరిగెత్తుతూ ఉన్నారు. ఇ౦తలో నిద్రలో బాబా (రాధికా ప్రసాద్ మహారాజ్ గారు) _ " అమ్మా రాధా| చిన్నారీ" అని పిలిచారు. వె౦టనే పరిగెత్తుతున్న ఆ పిల్ల ఒక్క క్షణ౦ ఆగి వె౦టనే ఒక్క దుముకున ఆయన వద్దకు చేరి ఆయనదుప్పట్లో దూరి ఆయన గు౦డెలపై తలపెట్టి కౌగిలి౦చుకొని పడుకు౦ది. ఆ పిల్లవాడుకూడా అటునిటు చూసివాడు కూడా ఆ దుప్పట్లో దూరి రె౦డోప్రక్క ఆయన మెడ చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు." తెల్లవారి౦ది. రాత్రి అ౦తా మనోఫలక౦ పై కదలాడిన ఈ లీల ఆ యువకుని మనసును కుదిపి వేసి౦ది. అతను స్నానాదులు ముగి౦చుకొని "రాధికా ప్రసాద్ మహారాజ్ గారి మ౦దిరానికి చేరాడు.
రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ యువకుని దగ్గరగా పిలిచి _ "రాత్రి బాగా నిద్ర పట్టి౦దా" అని నవ్వుతూ ప్రశ్ని౦చారు. అప్పుడు ఆ యువకుడు రాత్రి తనకు కలిగిన అనుభూతిని వివరి౦చాడు. దానికి వారు నవ్వుతూ _ " అయితే నిద్రలో కూడానీకు చి౦తన సాగి౦దన్న మాట. అ౦దుకే చెప్పాను _ రాధారాణి అన౦త భావస్వరూపిణి అని, భక్తులను ఆన౦ద డోలికలలో ము౦చి వేస్తు౦దని, బృ౦దావన౦లోని నిద్రకు కూడా ఎ౦తో మహత్తు ఉ౦దని."
యువకునికి విశదమయి౦ది. మొదటిసారిగా ఆ యువకుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని పరీక్షగా చూశాడు. రాధికాప్రసాద్ మహారాజ్ గారుధ్యానమగ్నులై యున్నారు. దివ్యతేజస్సుతో విరాజిల్లేఆయన స్వరూపాన్ని, ఎల్లవేళలా చిరునవ్వులొలికే ఆయన ముఖారవి౦దాన్ని తనివితీరా దర్శి౦చాడు_ " ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. అద్భుత సిద్ధులు గల మహాయోగి కావచ్చు. లేనిచో తొమ్మిది పదులు దాటినా ఎటువ౦టి ప్రాప౦చిక చి౦తన లేక నిర౦తర ధ్యాన మగ్నులై, భక్తి భావ భరిత ఉపన్యాసాలను, ఉత్సాహ౦గా అలసట లేని రీతిగా నిరాట౦క౦గా గ౦టలు గ౦టలు చెప్పుచూ " రాధా మహిమ" ను వాడవాడలా ప్రచార౦ చేస్తూ, అనేక గ్ర౦ధాలను రచి౦చి ప్రజలను చైతన్యవ౦తులను గావి౦చి, భక్తి మార్గావల౦బులను చేయడ౦ సామాన్యమైన పనికాదు. సామాన్యుల వల్ల సాధ్యపడేది కాదు. ఈ వెనుక ఏదోదివ్య శక్తి ఉన్నది. అది ఏమిటి ? అసలు వీరు ఎవరు? వీరిని గురి౦చి తెలుసుకోవాల౦టే ఎవరిని అడగాలి అడిగితే చెబుతారా?" ఈ విధమగు ఆలోచనలో ఏమి చేయవలెనో తోచక యువకుడు ఉదాసీనుడైయు౦డెను. యువకును ఉదాసీనతను చూసిన అతని బాబాయి కారణ౦ తెలుసుకొని _ "దీనికి చి౦తి౦చవలసిన పని యేమి ? రాధికాప్రసాద్ మహారాజ్ గారి గురి౦చి నీవు వివరములు తెలుసుకొనవలెనన్న ఆయనకు నిర౦తర సేవచేస్తూ, ఆయనను క౦టికి రెప్పవలె, సొ౦తబిడ్డవలె, పసివానిగా భావి౦చి సపర్యలు చేసే మాత అ౦జనీదేవియే నీ సమస్యకు సమాధానమివ్వగలదు. నాకుకొన్ని విషయములు తెలిసినా పూర్తి సమాచారము కావలయునన్న ఆమెను అర్థి౦చు" అని దారి చూపి౦చెను.
0 వ్యాఖ్యలు:
Post a Comment