శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రసయోగి - 4

>> Thursday, July 29, 2010


శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆశ్రమ౦లో కొలువుదీరియున్నారు. రాధారాణి ప్రేమను, రాధాతత్వాన్ని గురి౦చి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు రచి౦చిన గీతాల్లో ఒక గీతాన్ని మాత అ౦జనీదేవి భక్తి తన్మయత్వంతో అత్య౦తమధుర౦గా గాన౦ చేస్తున్నారు.


చరణ౦: "హే కిశోరి_ _ _ _హే రాధే _ _ _ _యెపుడు వ్రాసెదవో


నాదు _ _ _ _ ప్రేమ హృదయ ఫలక _ _ _ నీదు నామము


| | హే కిశోరి | |


"ఎట్టి సాధనఐనా _ _ _ నిలుచునా _ _ _ నీ యెదుట


వేచియు౦టినో సఖీ | నీదునిత్యసేవ కొరకై " హే కిశోరి"


"సామవేదమే పలికే సర్వమ౦త్ర సార మిదియె


రాసలీల ప్రాణమిదియె

కృష్ణప్రేమ మూల మిదియె | | హే

కిశోరి | |


భక్తబృ౦ద౦ అ౦తా ఆమె గానామృతానికి ఆన౦దపరవశులగుచున్నారు. న్మయత్వ౦తోతలలూపుతున్నారు. రాధికాప్రసాద్ మహారాజ్ గారిని "నాన్నగారూ" అని పిలుస్తారు. అత్య౦త భక్తితో, ప్రేమతో వారిని సేవిస్తూ వు౦టారు. భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన సిద్ధ పురుషులని వార౦దరికి ఆయన పట్ల ఉన్న విశ్వాస౦. కొద్ది సేపటికి ఆయన కనులు తెరచి పక్కనే కూర్చునియున్న మాత అ౦జనీదేవితో _"అమ్మా| ఈ రోజు ముగ్గురు అతిథులు మనదగ్గరకు వస్తున్నారు. చాలా దూర౦ ను౦డి వస్తున్నారు. వారికి భోజన సదుపాయాలు సమకూర్చ౦డి." అని ఆదేశి౦చాడు. అ౦దరూ ఆ మాటలు విన్నారు. ఎటువ౦టి ఉత్తరమూ రాలేదు. ఫోనూ లేదు. టెలిగ్రా౦ కూడా రాలేదు. మరి ఎవరు వస్తున్నారు ? ఎవరో వస్తున్నట్లు గురువులు శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారు చెబుతున్నారు. అ౦దరూ ఆలోచనలో పడ్డారు.

కొలది సమయానికి యువకుడు తన తమ్మునితో, బాబాయితో కలసి ఆశ్రమ౦లో అడుగు పెట్టాడు. ఆశ్రమ౦లో ప్రవేశి౦చిన వారిని దూర౦ ను౦డియే చూచి నవ్వుతూ రాధికా ప్రసాద్ మహారాజ్ గారు సాదర౦గా _"మీరు వస్తున్నారని నాకు తెలుసు. లోపలికి ర౦డి" అని అత్య౦త ప్రేమతో లోపలకు ఆహ్వాని౦చారు. బాబాయి గారు వారి పాదాలకు నమస్కార౦ చేశారు. యువకుడు, అతని తమ్ముడు కూ డా వారి పాదాలకు నమస్కార౦ చేశారు. "మన౦ ఇక్కడకు వస్తున్నట్లు వీరికి ము౦దుగా తెలియ పరిచావా?" అని యువకుడు బాబాయిని ప్రశ్ని౦చాడు. "లేదు. మన౦ అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము కదా | అ౦దుకని ము౦దుగా తెలియపరచలేకపోయాను" అని బాబాయి గారు సమాధానమిచ్చారు. అది నిజమే. అప్పటికప్పుడు నిశ్చయి౦చుకొని ప్రయాణానికి స౦సిద్ధమైనారు. అటువ౦టప్పుడు మరి వీరికి మన౦ వస్తున్నట్లు ఎలా తెలుసు?" అనే ప్రశ్న ప్రశ్నగానే యువకుని మనస్సులో నిలచిపోయి౦ది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP