అమ్మ పరీక్షలు ఒక్కోసారి కఠినంగానే కనిపిస్తాయి కానీ వాటి వెనుక అపార దయ దాగిఉంటుంది .
>> Sunday, June 20, 2010
అమ్మ అనుగ్రహస్వరూపిణి. దయాంబుధి . తన నాశ్రయించిన బిడ్డల యోగక్షేమాలు ఆతల్లికే తెలుసు . కంటికి రెప్పలా బిడ్డలను కాపాడుకోవటం మాతృమూర్తిస్వభావం . బిడ్డ ఎదిగే ప్పుడు చేయి పట్టుకుని నడుపుతూనే ప్రమాదమప్పుడు అమాంతం ఎత్తుకుని గుండెల్లో దాచుకుంటుంది. అలానే ఆ జగన్మాత భక్తుల పాలన కొనసాగిస్తుంది . పిల్లవాడెప్పుడూ ఆటపాటలతో గడపాలని ప్రయత్నిస్తాడు. అమ్మేమో బడి కెళ్ళు నాన్నా ! అని బుజ్జగిస్తుంది . మంచి మిఠాయికూడా పెడుతుంది . వీడు మాత్రం మాటవినడు .అప్పుడు కోపం నటిస్తుంది ,కర్రుచ్చుకుని కొడతానని బెదిరిస్తుంది.
ఇంకా వీడు బొమ్మలతో ఆటలే ఆడతానని మారాం చేస్తే బొమ్మలను దాచి పెడుతుంది ,అవసరమైతే నాలుగు దెబ్బలు వేసి ఈడ్చుకెళ్ళి బల్లో వేసి వస్తుంది. మరి వీడేమో .... అమ్మ కొట్టింది ..మంచిది కాదు ...అమ్మకు నాకు పచ్చీ.. నేనమ్మతో మాట్లాడను ఫో అంటాడు . [అయితే అలా అంటాడేగాని చీకటిపడగానే భయం తో వణికిపోయి అమ్మ ఒళ్ళో బజ్జోవాలని పరిగెడతాడు ] కానీ ఆచర్య వెనుక కారణం అర్ధం చేసుకోలేడు . అర్ధం చేసుకోగల వయస్సుకాదు వీడిది . అందుకే అమ్మ అన్నీ మాటలతో చెప్పదు , కొన్ని లీలలద్వారా చేతలలో చూపిస్తుంది. వీడిలా మాటవినడు అనుకున్నప్పుడు కాస్త కఠినంగానే ఉంటాయి ఆ జగన్మాత లీలలు .
చిన్నతనం లో అమ్మ ఉగ్గు పెడుతుంది . పరమ వెగటు ,కారం గా ఉంటుందది. ఆముదం తో చేస్తారు . పిల్లవాడు నోట్లోపోస్తే మింగడు .అందుకని ముక్కు మూస్తుంది .లేదా తొడగిల్లుతుంది .వాడు ఏడుస్తూ గాలి పీల్చేప్పుడు ఈ ఉగ్గుకూడా మింగుతాడు . గర్భశుద్ధి జరిగి పిల్లవానికి ఆరోగ్యం చేకూరుతుంది . మా అమ్మ గిల్లింది ,ఆముదం తాపింది అనిపిల్లవాడు బాధపడితే ఎలా ? బిడ్డకేది క్షేమమో తల్లికి మాత్రమే తెలుసు . అమ్మలగన్నయమ్మ దుర్గమాయమ్మ ను నమ్ముకుని ,"అమ్మ బిక్ష నా జీవనయానం" అనే పెద్దమాటలు మాట్లాడి ,ఇప్పుడీ పరీక్షలకు తల్లడిల్లితే ఎలా ? ఏ తొడపాశం ఎందుకు పెడుతుదో ,ఆదిగురువైన అమ్మ దయకు చిహ్నమే అని గ్రహించాలికదా ! నేచదివా ... నేచదివా...అని ఎగరటమెందుకూ ? అలాగా ఏదీ ! చదివితే పరీక్షరాయరా ! అని ప్రశ్నాపత్రం ఇస్తే బెంబేలెత్తటం ఎందుకు .. ... ?
శ్రీ మాత్రేన్నమ:
7 వ్యాఖ్యలు:
Durga ji,
Meeru cheppinadi aksharala nijam
Durga ji,
Meeku Amma peette pareekshalo vijayam kalagalani korukuntunnanu
aa talle vijayeshwari malli ammme vijayanni estundi
అవును మీరు ధైర్యం గా ఆ తల్లినే నమ్ముకుంటే తప్పక విజయం లభిస్తుంది.అమ్మ ఎప్పుడు పిల్లల క్షేమాన్నే కోరుతుంది త్వరలోనే అన్ని సమస్యలను ఆ దేవి పరిష్కరించ గలదు అందుకు ముందు మనో బలం కావాలి అది మీ చేతిలోనే ఉంది.
అవునండి , అమ్మ దయామయి . మీ సమస్యకు తప్పక దారి చూప గలదు .
ఆ దేవత కరుణ చూపి మీ సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఆర్యా! నమస్తే.
మీచంచలత్వము వీడి నిశ్చలానంద మార్గగమనం నాకెంతో ఆనందం కలిగించింది. దైవానుగ్రహ ప్రాప్తి మీకే తప్పక దక్కుతుంది.
అమ్మల గన్నయమ్మ పరమామృత రూపిణి మీదు సేవలన్
కమ్మగ పొందగోరినది.గౌరవ భావము తోడ మిమ్ము తా
నెమ్మి దయార్ద్ర చిత్త యయి నిత్యము గావగనెంచి చేసె నా
యమ్మకుముద్దుబిడ్డవనిహాయియొసంగు్నిజంబు నమ్ముడీ!
మీ పోస్ట్ బాగుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాని ఆ దయ పొందడమే కష్టసాధ్యం. నిశ్చల భక్తే మార్గం మనందరికీ.
Post a Comment