చెప్పలేదంటనకపొయ్యేరు ......... బుధులార మీరు....
>> Saturday, May 29, 2010
మనం సంవత్సరం మొదట్లోనే చెప్పుకున్నాం . ఇది వికృతి నామ సంవత్సరం . భూమ్మీద సంభవిమ్చనున్న పరిణామాలను ,దుర్ఘటనలను గూర్చి పంచాంగ కర్తలు ,శాస్త్రకారులు చేసిన హెచ్చరికలను చెప్పుకున్నాం .
ఇక వరుసగా మొదలైన దుర్ఘటనలను మనం గమనిస్తూనే ఉన్నాం . ఇక రాబోయే మూడు నెలలో మరింత ప్రమాదకరమైన స్థితులను చూడబోతున్నాము. ఈ పరిస్థితులను మనం ఎదిరించలేము, తప్పించలేము . ఒకరకంగా చెప్పాలంటే మన బంధువర్గం,డబ్బు కీర్తి,హోదాలు,మేధస్సు కూడా ఎదురైన ప్రమాదాన్నుంచి తప్పించలేక పోవచ్చు ్,ఒక్క భగవన్నామం తప్ప.
సూర్యుడు విపరీతంగా మండుతున్న ఈ వేసవి లో నైనా మన ప్రయాణాలు తప్పవు. మనం ఎలాగూ సూర్యప్రతాపాన్ని ఆపలేము . కానీ గొడుగు పెట్టుకుని మనం ఆ సూర్యప్రతాపాన్నుంచి తప్పించుకోవచ్చు. అలాగే భగవంతునుకి శరణాగతులమైతే అనివార్యమైన ఆపదలనుండైనా ఉద్దరింపబడవచ్చు.
మనం ఈ సత్యాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జరిగేయి జరుగుతాయి మనకళ్లముందే .
ఈ సమయంలో హనుమంతుని ఆశ్రయించి ఆయనరక్షనలో ఉండటం సర్వత్రాశ్రేయస్కరమని పెద్దలమాట .భక్తజన రక్షకుడు అగు హనుమంతుని ఆశ్రయించి లోకాన సర్వులూ సకల శుభాలు పొందాలని వేడుకుంటున్నాను...సర్వే జనా సుఖినభవంతు .
2 వ్యాఖ్యలు:
నమస్తే దుర్గేశ్వర గారు...
నిజమే విపత్తులను చూస్తే ..భయమేస్తొంది. అటు నీటి కటకట ఇటు భీభత్సాలు. ప్రపంచమంతా మండు గుండు చప్పుల్లే ... ఆ పరమేశ్వరుడే కాపాడాలి మరి. జై శ్రీ రాం !
నమస్కార్ములు నిజమె రాబోయె విపత్తు నుంచి కొంచ మైన రక్షణ పొంద గలగాలంటె ఆ విధయం గా నైనా భగవంతుని పూజించ గలిగితె అదృష్ట వంతులం బాగుంది ధన్య వాదములు.
Post a Comment