శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హరహర మహా దేవా ! ఏమిటీ అనర్ధం !?

>> Wednesday, May 26, 2010

మరొక అనర్ధం సంభవించింది. శ్రీ కాళహస్తీ శ్వరుని గాలి గోపురం కుప్పకూలింది . దేశానికి చుట్టుకో బోతున్న మహోపద్రవానికి సూచనకాదుకదా !? అని భక్తజనం తల్లడిల్లుతున్నారు . భౌతిక అభివృద్ధి చూసుకుని మిడిసిపడుతున్న మనకు నైతిక విలువలు నెర్రెలిచ్చి కుప్పకూలనున్నామని హెచ్చరిక కాదుకదా ? లయకారకుడగు పరమేశ్వరుని సన్నిధిన జరిగిన ఈ అనర్ధం లోకోపద్రవకారకం కాకుండా కాపాడాలని ఆమృత్యుంజయునే శరణు వేడుదాము ......హరహర మహాదేవ .

14 వ్యాఖ్యలు:

హర సేవకుడు May 26, 2010 at 10:27 AM  

బహుషా మితిమీరిన హరిసేవను చూసి హరునికి వళ్ళుమండి ఉంటుంది!!

పక్కనున్న తిరుపతికి వెర్రి జనాలు విపరీతంగా వస్తున్నారు, హుండీలో లెక్కలేకుండా డబ్బులు వేస్తున్నారు, ఆ గుడినిండా బంగారుతాపడాలు చేస్తున్నారు, కానీ పక్కనే ఉన్న తన గుడిని మాత్రం ఆదరించడంలేదని ఆయన తన కోపాన్ని అలా వెళ్ళగ్రక్కరేమోనని నా అనుమానం. మీరేమంటారు?

అదేంటో గానీ దేవుళ్ళలో కూడా లక్ష్మి ఎవరిదగ్గర ఉంటే వారి చుట్టే జనం తిరుగుతారు!!

durgeswara May 26, 2010 at 10:54 AM  

మీకు నవ్వులాటగాఉంది స్వామీ !
ఈ నవ్వులు మనజీవితాన వాడిపోకుండా ఉండాలని కోరుకందాం .

హర సేవకుడు May 26, 2010 at 11:18 AM  

నవ్వులాట కాదు, పచ్చి నిజం సుమండీ. ఒకసారి తిరుపతి నుంచి కాళహస్తికి వెల్లి అక్కడి ఆలయ పరిస్తితిని చూసి అనుకున్నాను: ఏమిటీ మనుషుల వివక్ష? సాటి మనుషులపైన వివక్ష చూపిస్తారు సరే, కనీసం దేవుళ్ళదగ్గర కూడా వివక్షేనంటారా?

Anonymous May 26, 2010 at 3:56 PM  

అనర్ధం కాదండీ..దానర్ధం, ఇటుక సున్నం తో కట్టిన కట్టడం పైన పిడుగు పడి పగుళ్లు వచ్చి దాంట్లో నీరు చెరితే....అది పరమేశ్వరుని పక్కనున్న గోపురం అయినా, పని వాడి పంచన ఉన్న గోడ అయినా కూలి పొక తప్పదు అని.....

Rao S Lakkaraju May 26, 2010 at 4:51 PM  

అసలు ప్రశ్న పిడుగు అక్కడే ఎందుకు పడాలి అని.

Anonymous May 26, 2010 at 8:10 PM  

@ harasevakudu,
So, you mean to say Harudu is jealous of the attention/devotion that Hari is getting?
Devudu/Devullu (Hari and Harudu) maree intha sankuchitanga aalochinchasthaara? Aalochisthey vaallu Devullena?

durgeswara May 27, 2010 at 12:07 AM  

గాలిగోపురం పగుల్లివ్వటం .కూలిపోవటం లో వాడినవస్తువులగూర్చి పిడుగుపాటులగూర్చి కాదు ఆలోచించవలసినది మామూలుగా ఆగమ శాస్త్రప్రకారం శిథిలావస్తకు చేరుకున్నవాటిని తొలగించటానికైనా మరమ్మత్తులకైనా కొన్ని పద్దతులుంటాయి ఇక్కడ గాలిగోపురం హఠాత్తుగా కూలినదాకా నిర్లక్ష్యం వహించినవారు అలా కూలటం వలన కొన్ని దోషాలు వస్తాయని గమనించటం లేదు. దేవాలయానికి సంబంధించిన విషయాలు మామూలు కట్టుబడుల వంటివి కావు. ఆఫలితాలు మామూలుగా కూలిన ఒక బిల్డింగ్ లేక కట్టడం తో పోల్చి చూడరాదు. ఇది ఖచ్చితంగా అనర్ధమే . కాలప్రవాహంలో మాత్రమే వీతికి సమాధానాలు చూడగలం .

Kiran Teja Avvaru May 27, 2010 at 12:33 AM  

చాల బాగ రాశారు మీరు..వీలైతే నాపోస్ట్ ని ఓ సారి చదవండి.. చదివించండి ..!

http://creativekiranteja.blogspot.com/2010/05/blog-post_9772.html

Anonymous May 27, 2010 at 1:14 AM  

మట్టితో కట్టిన కట్టడం ఐదు వందల ఏళ్ళు నిలబడటమే గొప్ప! పాత బడిన కట్టడాలేవైనా సరే ఎప్పటికైనా కూలవా? కాల గతిలో కలిసిపోవా? ఇక్కడ మాట్లాడాల్సిన విషయం అధికారుల నిర్లక్ష్యం గురించే తప్ప అనర్ధాల గురించి కాదు. ఎవరికీ దీనివల్ల ఏ అనర్థాలూ రావు.

ఇది ఖచ్చితంగా అనర్థమే అని ఎందుకు అనుకుంటారు?

ఇహ దీన్ని అడ్డం పెట్టుకుని పూజలూ శాంతులూ అని గుళ్లలో ఎన్ని వ్యాపారాలు సాగుతాయో!

శివుడు May 27, 2010 at 1:18 AM  

ఎంతో బాధాకరమైన విషయం! ఆ గోపురం దాటి గుడిలోకి వెళ్లడం ఎంతో చక్కని అనుభూతినిస్తుంది. ఇప్పుడక్కడ అది లేదంటే ఎంత బోసిగా ఉంటుందో!

మళ్ళీ దాన్ని పునర్నిర్మించినా రాయలు నిర్మించిన గోపురం అవుతుందా? చిత్తశుద్ధి లేకుండా పోయింది అధికారుల్లో! ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం!

durgeswara May 27, 2010 at 1:27 AM  

దేవాలయ నిర్వహణలో దొడ్డిదారినదూరి భగవత్ సేవలను వ్యాపారం చేసిన వారిగూర్చి ఒక్కమాట మాట్లాడని వారు కనీసం వాస్తవాన్ని గుర్తెరగాలి. శాంతులు పూజలు పరిహారాలని తెలుసుకోవాలంటే ఆ సబ్జక్ట్ తెలిసుండాలి.ఎమీ తెలియకపోయినా అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఎలాగూ లేకపోయినా ఆచారాలను హేళనచేసే మనోరుగ్మతను మాత్రం స్వంతం చేసుకుంటున్నారు కొందరు. ఇదే ఈధర్మానికి నేడు పట్టుకున్న దౌర్భాగ్యం

Anonymous May 27, 2010 at 4:33 AM  

పాతకట్టడాలు కూలడం మామూలు విషయమే. ఐతే అనర్థాలు కూలినా కూలకున్నా జరుగుతాయి. ఏ అవినీతి గూండా రాజకీయనాయకుడో దారుణంగా చంపబడితే అనర్థం కన్నా లోకకల్యాణం జరుగుతుంది.
జగ్గు, ముక్కు చంద్రన , బొత్స, దొంగబాబు లలో ఎవరికి నూకల్ చెల్లాయో!

Anonymous May 27, 2010 at 8:46 AM  

మన దేశం లో నిత్యం జరిగే అనర్ధాలలో మరో అనర్ధం .. మనిషిలో మానవత్వం క్షీణించి దానవత్వం పెరిగిపోతున్న ఈ కలియుగములో అనర్ధాలు జరగక మరేమి జరుగుతాయి..వీటి గురించి ఆందోళన చెందటం లో అర్ధం లేదు. జరిగే ప్రతి అర్ధానికి , అనర్ధానికి మనం కేవలం ద్రష్టలం మాత్రమే ..అన్ని ఆ శివునాజ్ఞ ప్రకారమే జరుగుతాయనుకుంటే ఏ బాధా లేదు..

ఆమ్రపాలి

రాజేశ్వరి నేదునూరి May 27, 2010 at 4:00 PM  

బాగుంది చర్చ అంతా మనమనుకున్నట్టుగా జరిగితె ఇక దేముడెందుకు ? ఎన్ని మెట్లెక్కినా మనకి ఒక మెట్టు పైన మిగులుతూనే ఉంటుంది అన్ని మెట్లు ఎక్క గలిగితె భగవంతుడే అవుతాడు మనం నిమిత్త మాత్రులం కాదంటారా ?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP