హనుమంతుని జన్మస్థల మెక్కడ ?
>> Saturday, April 17, 2010
శ్రీరామపాదసేవకుడు ,భక్తరక్షకుడైన హనుమంతులవారి జన్మస్థలం గూర్చి తెలుసుకుందాం . స్వామి తిరుమల కొండలపైన పుట్టాడు. అంజనాదేవి తపస్సుచేసి హనుమంతుని కనుటవలనే అది అంజనాద్రి గా పిలవబడుతున్నది. పురాణ ప్రమాణాలతో పరిశోధించి ఈవిషయం నిరూపించారు పరిశోధకులు . ఆప్రాంతంలోనే జాబాలి మహర్షి తపస్సుచేసి స్వామి బాల్యరూప దర్శనం కోరగా స్వామి "స్వయంభూ"గావెలసాడు ఈచోట . చుట్టూ ఎత్తైనకొండలతో నింగినంటే వృక్షాలతో ,కొండవాగులతో ప్రకృతి రమణీయమై అలరారే ఈక్షేత్రం తప్పనిసరిగా దర్శించవలసినది.
వరాహ స్వామి ఆలయానికి వాయువ్యంగా అడవి బాటలో వెళ్లవచ్చు .లేదా పాపనాశనం వెళ్ళేదారిలో జాపాలిక్షేత్రానికి దారి చూపే బోర్డ్ ఉంటుంది .అక్కడదిగి ఒక కిలోమీటర్ నడచి జాపాలి క్షేత్రం చేరుకోవచ్చు. దారిపొడవునా జనం ఉంటారుకనుక ఎవరూ భయపడనవసరం లేదు. తిరుమల వెళ్ళే యాత్రికులంతా తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడ క్షేత్రనిర్వహణ మొత్తం హాతీరాంబావాజీ మఠం వాళ్లది.అర్చనాదికాలు ఉత్తరభారత సాంప్రదాయరీతిలో ఉంటాయి.
స్వామి ఇక్కడేజన్మించారని చెప్పటానికి మరొక ఆధారం ఉంది. శ్రీవారి ఆలయానికి కెదురుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. అక్కడ హనుమంతుని చేతులకు బేడీలు వేసి నట్లుగా అలంకరణ చేస్తారు. అంజనీదేవి జప,ధ్యానాదులుచేసుకునేప్పడు బాలహనుమంతుడు పర్వతాలు ,అరణ్యాలు గెంతులువేస్తూ చుట్టివస్తూ దూరంవెళ్లిపోతుండటంవలన, మరలా ఆయననను వెతుక్కోవటం ఆతల్లికి భారమైపోతుండేది. అందుకే ఇలా ఆయనను కట్టివేసి ఉంచేదని చెబుతారు .దానిమూలంగానే స్వామివారికి బేడి ఆంజనేయస్వామి అనిపేరు వచ్చింది.
2 వ్యాఖ్యలు:
ఒక కొత్త విషయాన్ని చెప్పారు గురువు గారూ. ఈ సారి తిరుపతి వెళ్ళినప్పుడు జాబాలి క్షేత్రానికి వెళ్ళాలి.
జై శ్రీరాం.
జై హనుమాన్.
ఈ శనివారం గుడికి వెళ్ళి వచ్చినంత తృప్తి కలిగింది మీ పోస్ట్ చదివాక....
Post a Comment