అహా ! ఇక ఈలాంటి గొప్ప తీర్పులను వినే అదృష్టం కూడా పట్టనుందామనకు !
>> Wednesday, March 24, 2010
చిన్నప్పుడు పెద్దవాల్లు రచ్చబండమీద కూర్చుని చెప్పుకునే పిట్టకథల్లో బుడ్డవాల్లం ఆడుకుంటూ విన్నవి కొన్ని ఇంకా గుర్తున్నాయినాకు. వాటిలో ఒక కథ .
ఒక మోసకారి సన్యాసి నీతినియమాలుగల ధర్మప్రభువని పేరు పొందిన ఒక రాజుగారిని ధర్మసంబంధమైన ఇరకాటం లో పెట్టి ఆయన రాజ్యాన్ని కాజేసాడు. సరే రాజుగారు ఇచ్చినమాటకు కట్టుబడి తనప్రజలందరినీ కూడా ఆ సన్యాసి రాజుగారు చెప్పినట్లేవినాలని తనపై అభిమానంగల తనరాజ్య ప్రజలందరినీ ఒప్పించి రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు . ఇక కొత్తగా సింహాసనమీద కూర్చున్న ఆమోసకారి సన్యాసి తనబుద్ది ననుసరించి పరిపాలన చేస్తున్నాడు. ఆరోజులలో రాజే సర్వోన్నత న్యాయమూర్తి గనుక తీర్పులుకూడా తన మేధస్సును మధించి అద్భుతమైన తీర్పులు చెప్పేవాడు .అలాంటి తీర్పులలో ఒకటి ఇది.
ఆ రాజ్యంలో గల రంగయ్య ,గంగయ్య అనెఇద్దరు చాకలి వాల్ల గొడవ గ్రామ న్యాయస్థానం నుంచి పరిష్కారంగాక ఆపై న్యాయస్థానాలను దాటుతూ చివరకు మన సన్నాసి రాజుగారి సమక్షానికొచ్చినది . ఇక అక్కడ రాజుగారు విచారణ మొదలెట్టారు.
ఏమిటి ? తగాదా ? రాజుగారు ప్రశ్నించారు .
మంత్రిగారు లేచి " ప్రభూ ! రంగయ్య , తనజీవనాధారమైన గాడిద కాలు ఈ గంగయ్య విరగ్గొట్టాడని అభియోగం మోపుతున్నాడు.
ఈ గంగయ్యేమో , రంగయ్యే ఐదోనెల గర్భవతి ఉన్న తనభార్యను కాలితో తన్నటం తో తన భార్య గర్భం పోయిందని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తమరు విచారించి న్యాయం చేయాలి .క్రింది న్యాయస్థానాల తీర్పుకు ఇద్దరు అంగీకరించటం లేదు . వివరించాడు.
రాజు రంగయ్యతో " ఏరా ! ఏమిటి నీ అభియోగం ?
రంగయ్య " ప్రభూ ! ఈ గంగయ్య రాయి తోకొట్టటం తో నా గాడిద కాలు విరిగింది . నాజీవనధారమైన గాడిద లేక నాకు చాలా నష్టం కలిగింది.
రాజు " ఏరా !గంగయ్యా వీడు చెప్పేది నిజమేనా ?
గంగయ్య " లేదు ప్రభూ ! వాని గాడిద నేను ఆరవేసిన గుడ్డలు తొక్కుతుంటే ఏయ్ కాల్లిరగ్గొడతా హాయ్, అని ఊరికే బెదిరించాను , అంతే కాలు విరిగింది . నేను విరగ్గొట్టలేదు .కానీ ప్రభూ వీడు అలా నాపై కోపంతో ఇంటికివచ్చి నేను ఇంటలేకపోవటం తో ఆకోపం తో నాభార్యను తన్నాడు .దానితో నాభార్యకు గర్భస్రావమైపోయిందిది .ఇటువంటి కౄరున్ని మీరు శిక్షించాలి .
రాజుగారు ఆగ్రహం తో ఏరా ! అది నిజమేనా ? అని గద్దించాడు
వెంటనే రంగయ్య "లేదు మహారాజా కోపంలో, ఏమే ! ఎక్కడే నీమొగుడు ? నాగాడిద కాలిరగ్గొడతాడా ? ఒక్కతన్ను తంతా , ఏమనుకున్నారో అని కాలెత్తాను ,అంతే ! దానికి కడుపు పోయింది .ఇందులోనాతప్పేమీలేదు . ఏప్రమాణం చేయమంటే ఆప్రమాణం చేస్తా ! వాడే గాడిద కాలిరగ్గొట్టాడని ఫిర్యాదు చేసానని ఈ ప్రమాదానికి నేనే కారణమని అబద్దాలాడుతున్నాడు అని లబలబలాడాడు.
రాజు గారు ఎంత ప్రశ్నించినా ఇద్దరూ తమ కథనాలను అలాగే వినిపిస్తున్నారు. ఏప్రమాణం చేయటానికైనా సిద్ధమంటున్నారు. పోనీ సాక్ష్యం అడుగుదామంటే రెండు సన్నివేశాలలో ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు. అయినాసరే తన మేధస్సుపై అపార నమ్మకం గల రాజుగారికి ఎవరికీ అన్యాయం చేయకుండా తీర్పునివ్వగల నేర్పు తనకుందని గొప్ప నమ్మకం .సభ రాజుగారి తీర్పెలా ఉంటుందా అని ఉత్కంఠం గా ఎదురు చూస్తున్నది. ఆయన తన మేధస్సునంతా మధించి ఇలాతీర్పునిచ్చారు.
ఒరే ! మీ మూర్ఖత్వం వల్ల వల్ల ఇద్దరు నష్టపోయారు విలువైన మాసమయం వృధాచేశారు . కనుక జరిగిన నష్టానికి ఇద్దరు బాధ్యత వహించవలసినదే ! కనుక మీలో గాడిద కాల్లిరగ్గొట్టిన వాడు ఆగాడిదను తీసుకెళ్ళి దాని కాలు నయమై బాగా నడిచేదాకా వైద్యం చేయించి తిరిగి దాని యజమాని కప్పజెప్పాలి. ఇక రెండో వాడు కాలితో తన్ని గర్భస్రావం జరిగేందుకు కారణమవటం క్షమించరాని నేరం . మానవునికి సంతానం కన్నా గొప్పసంపద లేదు . కాబట్టి కాలెత్తి తన్నినవాడు ఆ స్త్రీని తన ఇంటికి తీసుకెళ్ళి మరలా ఆమెకు ఐదోనెల గర్భం వచ్చినదాకా సంరక్షించి అప్పుడు భర్తకు భద్రంగా అప్పజెప్పాలి. ఇది మాధర్మనిర్ణయం .ఎవరేది కోల్పోతే దానినితిరిగి పొందాలి. ఈమాత్రం చెప్పటానికి క్రింది న్యాయస్థానాలో వారికి చేతకాలేదా ? గంభీరంగా ప్రకటించారు తీర్పును రాజుగారు.
అంతే సభ దద్దరిల్లి పోయింది..........................లతో .
{సభ అన్నాక అన్ని రకాలవాల్లుంటారు కనుక ,మీరు కూడా ఆసభలో ఉండి తీర్పును వింటే ఆసభను ఎలా దద్దరిల్లజేసి ఉంటారో చెప్పండి .........తెలుసుకోవాలని ఉంది .]
5 వ్యాఖ్యలు:
ఇప్పుడు వింటున్నాం కదా ... ముందు ముందు కూడా వింటాం.....
మన సర్వోన్నత న్యాయస్థానాలు కూడా వీటికే౦ తీసిపోవట౦ లేదు.
సర్వోత్తమ న్యాయస్థానమంటున్న దానిపై అంతో ఇంతో నమ్మకముండేది,ఇప్పుడు అది కూడా తుడిచిపెట్టుకుని పోయింది.
బాగా వ్రాసారు. అదో చెత్త కేస్ కింద కొట్టి పడేయక బోడి తీర్పొకటి. ఉన్నవి చాలదన్నట్టు మళ్ళే ఇదో రచ్చ. అది సర్వోన్నతమా లేక సర్వధమ న్యాయస్థానమా?
న్యాయస్థానమైతే సర్వోన్నతమైనదే.ఐనంతలో అక్కడ కూర్చున్న న్యాయమూర్తి సర్వోన్నతుడవడం అంటే ఆస్థానం కొట్టేసినంత సులభం కాదు కదా! ఇంతకంటే గొప్ప తీర్పులెలాగొస్తాయింక?
ఏం చెప్పుతున్నారో; ఏం మాటాదుతున్నారో; ఆత్మ పరిశీలన చేసుకొంటూ సభ్యసమాజానికి గల గత చరిత్రను గుర్తెఱిగి తీర్పులు చెప్పాలి.
ఐనా న్యాయమూర్తులు నాయ దేవత చెవులు మాత్రమే కలవారు. వాదించే లాయరుదే రాజ్యం.
తీర్పు వాదించే లాయరు నైపుణ్యం మీదే అధార పడుతుంది తప్ప న్యాయమూర్తి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధార పడదు.
Post a Comment