దృఢమైన దైవ విశ్వాసం లేనిభక్తి, మానవతా వాదం కూడా అంధవిశ్వాసమవుతుంది
>> Saturday, March 27, 2010
మానవ చరిత్ర పొడవునా దేవుడున్నాడని విశ్వసించి జీవింపజూసేవారూ , అట్టి విశ్వాస మవసరం లేదనిధర్మంగా జీవిస్తే చాలని తలచేవారు ఉన్నారు.భగవంతుడు మనస్సుకు ఇంద్రియాలకు గోచరించడు గనుక ,సామాన్యులకెన్నడూ ఆయన ఉనికిని నిరూపించే అనుభవాలుండవు గనుక అట్టివిశ్వాసము ,భక్తిదృఢమవటం ఆస్తికులకు కష్టం . అట్టిది ప్రసాదించమనే అందరూ ఆయనను ప్రార్ధింపజూస్తారు. కానీ ప్రార్ధన విశ్వాసం పైన విశ్వాసం అనుభవంపైన ఆధారపడతాయి,గనుక అదికూడా సరిగా కుదరదు.
మరొక వంక దైవ విశ్వాసం అవసరం లేదని ,నీతిగల జీవితమే చాలనుకునేవారికి కూడా నీతిగా ఉండటం ఎందుకు సరియైనదో స్పష్టంగా తెలియదు. బలహీనమైన ప్రాణులనుతరిమివేసి హింసించి బలవంతమైన ప్రాణూలు జీవించటమే ప్రకృతియంతటా చూస్తాము. మానవ సమాజం లోనూ అదే కనపడుతున్నది. .అటువంటప్పుడు నిస్వార్ధమైన జీవితమెందుకు ప్రసస్థమైనదో సహేతుకంగా తెలుపలేము. జడపదార్ధానికి సుఖ దు:ఖాలు.దానధర్మాలు ఉండజాలవు. ఒక్కూక దేహానికి పరిమితమైన ఆత్మలుంటాయని తలచినా పై జెప్పిన ప్రాకృత జీవితమే సమంజసమవుతుంది. సర్వజీవులకు ఆత్మ ఒకటే అయితేమాత్రమే సాటివారిని తనవలె ప్రేమించడం _ అంటేనీతిగా బ్రతకడంహేతుబద్దము వాంఛనీయము అవుతుంది. అంటే శుద్ధమైన ఆథ్యాత్మికతను అంగీకరించక నైతిక జీవితము సహజము ,సమంజసము కాజాలదు .అందుకే దృఢమైన దైవ విశ్వాసం లేని మానవతా వాదం కూడా మానవులు కల్పించుకున్నస్వర్గ నరకాదులవలె అంధవిశ్వాసమవుతుంది. అందువలననే నీతిని వాచా ప్రవచిస్తూగూడా ఆచరణలో ఎక్కువమంది విఫలులవుతారు .
అయితే ఆస్తికులమనుకునేవారుగూడా ఆత్మసర్వగతమన్న అనుభవం లేకపోవడం చేత అట్టి దుస్థితిలోనే చిక్కుతారు. దృఢమైన దైవవిశ్వాసం కలగాలన్నది అనేకకోరికలలో ఒకటిగా మాత్రమే మిగులుతుంది. దీనినే ఆథ్యాత్మ పదజాలం లో ఇలా చెప్పవచ్చు. పరమాత్మ ఇంద్రియ మనస్సులకు ప్రత్యక్షంగా గోచరించడు. అందుకని సామాన్యంగా అనుభవం కాదు. దానివలననే దృఢమయిన విశ్వాసం కలగటం కష్టం . అనుభవముంటేగానివిశ్వాసం కుదరదు.దృఢమైన విశ్వాసం ఉంటేగాని అనుభవం కలగదు. అటువంటప్పుడు ఆస్తికులకు అథ్యాత్మిక జీవనము తదితరులకు నైతిక జీవితము ఎలా సంభవము ?
ఇందుకు సమాధానం మహనీయులజీవితం ,మతగ్రంథాలనుంచి లభిస్తుంది. మానవులకు తన ఉనికిని స్వల్పంగానైనా తెలిపి సన్మార్గానికి ఆకర్షించడానికి పరమాత్మయే ప్రేమతో బద్ధకంకణుడయ్యాడు. సృష్టి,స్థితిలయకారకులు,పరమ సత్యము తానే అయినపరమాత్మ యోగమూర్తియగు దత్తాత్రేయ స్వామిగా భూమిపై అవతరించారు .అంటే సృష్టి పరమాత్మ కల్పించిన కావ్యమనుకుంటే కల్పితమయిన ఒక ప్రధానపాత్రగా అందులో తనను గూడా కల్పించుకున్నాడన్నమాట. "గురు బ్రహ్మ ........." అనే శ్లోకం ఇదే చెబుతుంది. పూర్ణపురుషుల రూపం లో మానవులకెల్లప్పుడు భూమిపై లభ్యమయ్యేది ఈ అవతార తత్వమే . అంటే భగవంతుడు సర్వ మానవ కళ్యాణానికి దత్తమయ్యాడన్నమాట.ఆమ సమర్పన చేసుకున్నాడన్నమాట.
ఈ దత్తస్వామి ఈ యుగం లో ఈ పుణ్యభూమిపై మొదట గోదావరీ తీఓరం లో పిఠాపురం లో శ్రీపాదశ్రీ వల్లభులుగాను,తరువాత కరంజా అనే గ్రామం లో అవతరించి శ్రీనృసింహ సరస్వతి గా గాణ్గాపురం లోను ప్రసిద్దమయ్యారు. నైజాము నవాబులకాలం లో మాణిక్యనగర్ లో మాణిక్యప్రభువుగాను ,అటతర్వాత 1856 లో స్వామి సమర్ధులుగాను ,ఆపై శిరిడీసాయిబాబాగాను అవతరించారు. ఆమొదటి ఇద్దరి చరిత్రలు "శ్రీ సంహితాయన గురుద్విసాహస్రి " {గురుచరిత్ర] అనుగ్రంథం లో ప్రచురించడమైనది.వీరందరి చరిత్రలు శ్రద్ధాదీక్షలతోపారాయణం చేసి ముముక్షువులు పూర్ణగురుని అనుగ్రహనికి పాతృలుగావాలి. అదే దత్తసాంప్రదాయం.
_____________ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ గారి ప్రబోధములనుండి
2 వ్యాఖ్యలు:
అయ్యా!!
దైవ భక్తి వల్ల మనుషులు సన్మార్గంలో జీవిస్తారనుకుంతే మన దేశంలో అసలు మోసాలూ, దోపిడీలూ ఉండగూడదు. ఎందుకంటే నూటికి 95% దేవుని ఎడల భక్తి గలవారే కదా? రోజుకొక స్వామీజీ దేవుడి పేరు చెప్పుకొని దోచుకుంటూ దొరికిపోతున్నాడు. మర్డర్లు చేసే వాడు కూడా ముందు దేవుడికొకసారి మొక్కుకుని తనపని నిరాటంకంగా జరగాలని వేడుకుంటాడు.
ఇక పోటే, మీరు రాసిన టపా హెడ్డింగుకీ, టపాకి ఏమాత్రం సంబంధం లేదు. మీరు ఎక్కడ కూడానూ దృఢమైన దైవ విశ్వాసం లేని మానవతా వాదం కూడా అంధ విశ్వాసం ఎలా అవుతుందో సెలవీయలేదు మరి.
అయ్యా
మీరు భర్ద్వాజ్ మాస్టర్ గారి భావాన్ని మరొకసారి పరిశీలించండి. ధృఢమైన దైవ విశ్వాసం అన్నాడాయన .ఆ స్థితి లో ఉంటే ఇంకొకరి సొమ్ముకు ఆశపడే ప్రసక్తి లేదు. మీరు ఆయన రచనను మరొకసారి పరిశీలించగలరు. చెప్పటం మరచాను ఆయన రచనలో కొంతభాగం ఇక్కడుంచాను .
Post a Comment