శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షా యాగమునకు మీ గోత్రనామాలు పంపండి

>> Saturday, April 12, 2025

భగవద్బంధూ ! ఈసంవత్సర కాలము భూమిపై పెక్కు ఉత్పాతములు గోచరిస్తున్నాయని శాస్త్రకారులు సూచించు చున్నారు .పలు ఉత్పాతముల,ు ప్రక్రుతి వైపరీత్యములు తోపాటు వ్యక్తిగతముగా కూడా అన్ని రాశులవారికి కూడా కొన్ని ఇబ్బందులు సూచించు చున్నారు. ఇక కలి పురుషుని ప్రభావం ఉండనే ఉన్నది. ఈసమయాన భగవంతుని ఆశ్రయించి ఉండటమే సరైన మార్గము. ఇటువంటి విపత్కర స్థితులలో భక్తజన రక్షణకై హనుమంతుని ఆశ్రయించు మార్గముగా హనుమత్ రక్షా యాగము పేరిట ఒక యజ్ఞ ము ను గత పదహారు సంవత్సరములుగా శ్రీ వెంకటేశ్వర జగన్మాత పీఠము లో నిర్వహించబడుచున్నది . ఈ యాగంలో పాల్గొన్న వేలాదిమంది భక్తులు వారి వారి eeti బాధలను తొలగించుకుని హనుమత్ కృపతో ఇష్టకామ్యములను సిద్ధింపజేసుకునుచున్నారు. అటు వంటి భక్తుల జీవితములలో స్వామి చూపిన లీలలను కొన్ని ఇక్కడ హరిసేవ బ్లాగులో తెలియజేస్తూనే ఉన్నాము. ఈ ఏడాది పదిహేడవ ఆవృతి గా ఉగాది నుండి ప్రారంభమైనది. మే 24 అనగా వైశాఖ బహుళ ద్వాదశి శనివారం నాడు పూర్ణాహుతి జరగనున్నది. ఎప్పటి వలెనే మీ గోత్రనామాదులు పంపి మీరు మీ నివాసమునుండి హనుమాన్ చాలీసా పారాయణము , శ్రీరామ నామ లేఖనము జరిపి ఆ సంఖ్యను మాకు తెలియ పరచ వలెను.మీ తరపున ఆహుతులు ఇవ్వబడతాయి.కోరినవారికి ప్రసాదములు పంపబడతాయి.ప్రత్యక్షముగా యాగములోపాల్గొన దలచిన వారు పూర్ణాహుతి ఇక్కడకు రావచ్చు. ఇందులో పాల్గొనుటకు కేవలం భక్తిగా ఆయన పాదాలను ఆశ్రయించి పారాయణము శ్రీరామ నామ లేఖనము మాత్రమే దక్షిణ గా మేము అడుగుతూ ఉంటున్నాము.సాధారణ నియమాలతో పాల్గొనవచ్చును.మీరు వెంటనే గోత్ర నామాలు పంపి మొదలు పెట్టగలరు. ఇక కొన్ని కఠినతరమైన సమస్యలను అధిగమించుటకు కష్టతరమైన కార్యములు సాధించుటకు కొన్నిప్రత్యేక నియమాలు పాటించుట వలన సాధన శీఘ్రఫలితాలనిస్తుంది.అటువంటి అవసరం ఉన్నవారు మమ్ము సంప్రదిస్తే అవసరమగు సలహాలను ఇచ్చుటకు మా శక్తిమేర ప్రయత్నిస్తాము. ఇది స్వామి వారి అనుగ్రహం మీ పై సంపూర్ణంగా కలగాలని కోరుతూ కలియుగములో సామూహిక సాధన విశేష ఫలితాలనిస్తుంది కనుక అందరము కలసి నడచు శుద్ధ భక్తిమార్గము . జై శ్రీరామ్ భక్తజనదాసుడు దుర్గేశ్వర durgeswara@gmail.com 9948235641 లలో మమ్ములను సంప్రదించవచ్చు. visit ....durgeswara. blogspot.in

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP