శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మోడీగారు డ్రామాలాడుతున్నారా?అంతా నటనా?

>> Wednesday, May 22, 2019

దయచేసి నా విన్నపం నేను ఏ పార్టీ చెందిన వాడిని కాను ఓ హిందువుడిగా పోస్ట్ చేసా

■◆■◆■

*నిన్న మన ప్రియతమ #ప్రధాని మోడీజీ  #కేదార్_నాథ్ వెళ్ళటం , అక్కడ గుహలో ధ్యానం చేసుకోవడం ప్రతీ హిందువు గర్వించదగిన విషయం. దానిని కూడా వేళాకోళం చేసి ఏదో పబ్లిసిటీ కోసం పోజులిస్తున్నట్లుగా కొంతమంది విదేశీ సంస్కృతి టొట్టు గాళ్ళు  కేదార్ నాథ్ లోని ప్రధాని తీర్థయాత్ర పై కామెంట్లు చేయడం తెలుగు , హిందీ , ఇంగ్లీషు భాషలలోని కొన్ని పోస్ట్లు చూసి వాళ్ళను చదివి జాలివేసి ఇలా నా అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను.*

అసలు వీళ్ళు ఎవరైనా , ఎప్పుడైనా కేదారనాథ్ వెళ్ళి ఏడిసారా? అక్కడ కనీసం ఒక రాత్రి అయినా స్టే చేసారా? అక్కడి ఆక్సిజన్ లెవెల్స్ గురించిగానీ , అనుక్షణం మారుతూ ఉండే అక్కడి వాతావరణం గురించి గానీ అవగాహన కలిగి ఉన్నారా? ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు. అవగాహన ఉన్నవాడెవడూకూడా అలా కూయరు.

మన ప్రధాని కేదారయాత్రని గర్వంగా తీసుకోకుండా , ధర్మద్రోహులైన హిందువుల వలలో పడుతూ హైందవాభిమానులు కూడా పిచ్చి పోస్టులు పెట్టడం అత్యంత బాధాకరం. నిన్నటి కేదారనాథ్ విషయం పట్ల హిందూవ్యతిరేకశక్తులకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి.

మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందునుండే తన జీవితాన్ని హిమాలయాలలోని గుహలలో గడిపారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు జపతపాదులలో వెళ్ళబుచ్చారు. నిస్వార్థమైన కర్మయోగిగా 5 ఏళ్ళు ప్రధానిగా రాజ్యపరిపాలన
చేసి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసిన పాలకుడాయన.

👉 మోడీ డ్రామాలాడుతున్నాడా? అంతా నటనా?

ఇటీవలే అక్షయకుమార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీయే స్వయంగా చెప్పటం జరిగింది తాను దీపావళి పండుగప్పుడు కేవల జలాహారం తో 5 రోజులపాటు అడవులలో , గుహలలో ఒంటరిగా ధ్యానంలో గడుపుతానని. ఆ పండుగనాడు ఎవడైనా కుటుంబంతో గడపాలి అనుకుంటాడు , కానీ వసుధైకకుటుంబమనే భావన ఉన్న ఒకయోగి మాత్రమే ఆత్మానందంలో రమిస్తాడు. పుండుమీది చీముచుట్టూ వాలే ఈగలకి పానకంలోని రుచి తెలుస్తుందా? తెలియదంతే.

అదే ఇంటర్వ్యూలో మోడీని - మీరు జలుబు చేసినపుడు ఏంచేస్తారు? అని అడిగితే , తగ్గేవరకూ కేవలం వేడినీళ్ళు మాత్రమే తీసుకుంటానని సమాధానమిచ్చారు మన ప్రధాని. రోజుకి 3 1/2 గంటలు మాత్రమే పడుకుంటాను అని కూడా ఆయన చెప్పటం జరిగింది. యోగసాధన బాగా అలవాటైనవారికి నిద్ర తగ్గిపోతుంది. ఇదికూడా తెలియని విదేశీసంస్కృతికి అలవాటుపడి జాము తెల్లవారాక నిద్రలేచే బడుద్ధాయిలు కూడా మోడీని విమర్శించడమేనా? మనసులో తమోగుణం అధికంగా ఉన్నవారికి నిద్ర ఎక్కువసేపు అవసరం గానీ, యోగధ్యానాదులవలన చిత్తాన్ని శుద్ధిపరచుకున్న వారికి నిద్రావశ్యకత అల్పమే కదా !

నిన్న కేదారనాథ్ లోని కనిష్ట ఉష్ణోగ్రత 3℃. అందుకనే దానికి అనువుగా పహాడీ ( కొండప్రాంతపు) దుస్తులు ధరించి ఆయన వెళ్ళారు. నేటి రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత -5℃ ఉంటుంది అని AccuWeather వాడి forecast.

70 ఏళ్ళ వయసులో నువ్వు అసలు కేదారనాథ్ నుండి రుద్రగుహ కు 2కిమీ దూరం నడువగలవా? నడవగలవేమో గానీ , తర్వాత మాత్రం నలుగురు కలిసి కిందకు దింపాల్సి వస్తుంది. ఈరోజు Lt.Gen.DP Sehgal ట్వీట్ చేస్తూ - " మోడీజీ! 12వేల అడుగుల ఎత్తులో 2 కిమీ ట్రెక్కింగ్ ని 70ఏళ్ళ వయసున్న మీరు చేసారంటే అది నిజంగా శివానుగ్రహమే" అని ఊరకనే అన్నారా?

2013 లో కేదారనాథ్ లోని వరదలని ప్రతీ ఛానల్ వాడూ పదే పదే చూపించాడు. తర్వాత అక్కడ మార్పులనూ , సౌకర్యాలనూ మాత్రం స్పెషల్ ప్రోగ్రామ్ గా ఏఛానల్ అయినా చూపించిందా? లేదే. హిందువులను వారి సంస్కృతి కి దూరం చేయమంటే ప్రతీ ఛానల్ సిద్ధమే , అదే విధంగా హిందువులను వారి సంస్కృతి వైపుగా నడపడానికిమాత్రం దరిద్రపు ఛానళ్ళు ముందుకు రావు. అందుకనే మోడీజీ ఆపనిని మీద వేసుకున్నారు. ఈరోజున కేదారనాథ్ వైపు ప్రతీ భారతీయుడీ దృష్టి మళ్ళింది. యువత కూడా గమనిస్తున్నారు. మోడీజీ కూడా ఉదయం కేదారనాథ్ లో మీడియా వారితో మాట్లాడుతూ - "మనవాళ్ళు విదేశాలకు వెళ్ళటం కాదు. భారత్ లో ఎన్నో చూడవలసిన ప్రదేశాలున్నాయి. చూడండి" అని పిలుపునిచ్చారు.

భారత్ మాతా కీ జై!
జై కేదార్ 🚩 , జయహో మోడీజీ ! 🇮🇳
మోదీ కోసం పంపలేదు.. చానెళ్ళు వేసే వేషాలు + హిందూ ధర్మం పరిస్థితి అవగాహన కోసం పంపాను.. గమనించగలరు.

2 వ్యాఖ్యలు:

అన్యగామి May 23, 2019 at 11:26 AM  

సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకొన్న భారతప్రజకి జేజేలు, అభినందనలు.

అన్యగామి May 23, 2019 at 11:26 AM  

సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకొన్న భారతప్రజకి జేజేలు, అభినందనలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP