శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తామర పువ్వులా వికసించాలి

>> Saturday, April 20, 2013



యోగ పరిభాషలో, వివిధ అనుభూతి స్థాయిలకు వివిధ రకాలైన తామరలను ప్రతీకలుగా సూచిస్తారు. దేహంలోని ఏడు చక్రాలను ఏడు విధాలైన తామర పుష్పాలుగా చూపిస్తారు. తామరలు బురద చిక్కగా ఉన్న చోటే బాగా పెరుగుతాయి. ఎక్కడ నీరు బాగా మురికిగా ఉంటుందో అక్కడే అది బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. జీవిత విధానం కూడా ఇదే.

అందుకే తామరలను మనం ప్రతీకలుగా ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాము. ప్రపంచంలో నీవు ఎక్కడకు వెళ్లినా ఆఖరికి నీ మనసులో కూడా అన్నిరకాల మాలిన్యాలు ఉన్నాయి. ఎవరయితే తనలో మాలిన్యం లేదంటాడో వాడు తనని తాను బాగా పరిశీలించుకోలేదనాలి లేదా అతనిలో నిజాయితీ లేదని చెప్పాలి. ఎందుకంటే నిజానికి నీది కాని మనస్సు తనకు కనపడినవన్నీ గ్రహిస్తుంది. అలా గ్రహించినవాటిని ఉపయోగించుకోవాలా లేదా అన్నది నిర్ణయించేది మాత్రం నీవే.

అంతేకాని మీ మనసులో ఏముండాలి అనే దాని గురించి ఎవరూ నిర్ణయించలేరు. నీ మనస్సు లేదా బుద్ధిలోకి చేరిన విషయాలను ఏ పరిస్థితులలో ఎలా నిర్ణయించుకోవాలోనన్న విజ్ఞత మాత్రమే మీకుంది. ఈ ప్రపంచంలో ఉన్న అని రకాల మలినాలు సహజంగానే మన మనస్సులోకి ప్రవేశిస్తాయి. ప్రజలు ఒకసారి మాలిన్యం అంటే ఏమిటో తెలిశాక, కొందరికి వాటి పట్ల రోత కలుగుతుంది. వారికి ఈ మాలిన్యం ఇష్టం ఉండదు.

అందుకేవారు అన్ని బాహ్య విషయాల నుండి దూరంగా ఉంటారు. వాళ్లు 'పరిపూర్ణులు' అని తలచే ఏ ఇద్దరి, ముగ్గురితో మాత్రమే కలిసిమెలిసి ఉంటారు. వాళ్లతోనే తమ జీవితాలను గడిపేందుకు ప్రయత్నిస్తారు. చాలామంది ఈ పనే చేస్తున్నారు. ఈ ప్రపంచంలో సంభవిస్తున్న రకరకాల విపరీత ధోరణుల పట్ల, పనికిమాలిన వ్యవహారాల పట్ల వారికి రోత. అందుకే వీటన్నిటినీ అంటకుండా ఏకాంత జీవితం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి కొంతమంది "ఈ ప్రపంచం అంతా కలుషితమై ఉంది. ప్రపంచంతో పాటే నేనూ కనుక, నేనూ అలానే ఉంటాన''ని మాలిన్యంతో కలిసిపోతారు.

మలినమే ఎరుపు
మరో పద్ధతిలో కూడా జీవించడం సంభవమే. నీవు నీ చుట్టూ ఉన్న మాలిన్యాన్నే ఎరువుగా చేసుకుని నిన్ను నీవు అద్భుతమైన తామరపుష్పం వలె వికసింపచేసుకోగలవు. కమలం, కాలుష్య వాతావరణాన్ని కూడా అందంగా, సువాసనా భరితంగా మార్చివేస్తుంది. అలాగే నీవు కూడా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను స్పృశించకుండా తామరపూవు వలె ఉండాలి. చాలా అపరిశుభ్ర, అనైతిక వాతావరణంలో కూడా నీవు నీ వ్యక్తిగత సౌందర్యాన్ని, సహజత్వాన్ని నిభాయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. దీనిని ఎవరు సాధించగలుగుతారో వారు తామరాకు మీద నీటి బొట్టులాగా, జీవితాన్ని అంటకుండా దాటిపోగలుగుతారు. అలా లేని వారి అనేక విధాలుగా కబళిస్తున్నది. ప్రతి మానవుడు తామరపూవు వలె మారడానికి అవకాశం ఉన్నది. ఆ దిశగా మనలను మరల్చే ఒక శాస్త్రీయ విధానమే యోగా.

సద్గురు

2 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni April 20, 2013 at 5:39 PM  

chaalaa baavundi. Manasukekkinchukune prayatnam chesthunnaanu

కాయల నాగేంద్ర April 22, 2013 at 5:36 PM  

Chaalaa Baagaa Chepaaru.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP