శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రామనామం పలికేచోట ప్రేమభావం వెల్లివిరుస్తుంది. ఇదిగో ఉదాహరణ

>> Friday, April 19, 2013

రాముడంటేనే ప్రేమస్వరూపం . ఆయన  చరిత్రమొత్తం ప్రేమభావనే. అందుకనే రామచరితం రామాయణం  ఎక్కడ పారాయనం జరిగినా ఆనామం ఎక్కదపలుకుతున్నా అక్కడ ద్వేషాలు నశిస్తాయి. పరస్పరం జనులు ప్రేమపూరితులై ప్రవర్తిస్తారు . వారి హృదయం కరుణారసంతో నిండిపోతుంది. లోకక్షేమాన్ని కాంక్షించాలంటే  రామనామజపం జరుపవలెనని పెద్దలు  చెబుతారు.

ఉగాదినుంచి  కోటి శ్రీరామనామ నామజపములు ఇరవై నాలుగు  గ్రామాలలో ప్రారంభించాము. అందులో మా స్వంత ఊరు రవ్వవరం కూడా ఒకటి. ఇక ఇక్కడోవిషయం చెప్పాలి. ప్రస్తుతం మావూరు మూడుముక్కలయిఉంది. వర్గాలు కులబేధాలు పెరిగి   వినాయకచవితి ఉత్సవాలుకూడా వేరువేరుగా జరుపుకుంటూ ఊరిలోని రాములవారి మేడలో దీపం లేకుండా చేశారు .   మొన్న ఉగాదినుంచి  గ్రామమంతా రామనామాన్ని లిఖిస్తున్నారు.  మరి ఆతరంగాలు హృదయాలలో ద్వేషాలను నిలువనిస్తాయా ?  గ్రామంలో కుర్రవాళ్లంతా కలసి నవమి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించుకున్నారు. మేడపైకి మైక్ సెట్ కొనటంనుండి కావలసిన సరంజామా అంతా కలసి సమకూర్చారు. ఇప్పటిదాకా గ్రామాలలో రామాలయాలలో  కార్యక్రమాలను పరిశీలుస్తూ ఇప్పుడే మావూర్లోకి కూడా [పీఠం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది] వెళ్లి వచ్చాను
 పిల్లలంతా  ఎంతో చక్కగా సంకీర్తచేస్తున్నారు. ఊరు కళకళలాడిపోతున్నది. రాముడంటే అంతే .రాముడుంటే శాంతిసౌభాగ్యం
    లోకానికంతటికీ   "శ్రీరామరక్ష సర్వజగద్రక్ష"
మీకు మీకుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు .

2 వ్యాఖ్యలు:

Zilebi April 20, 2013 at 6:17 AM  


శ్రీ రాములవారు ప్రేమ స్వరూపులు ఎప్పుడయ్యే రండీ !
మీరు మరీ విచిత్రం గా చెబ్తున్నారు! రాముల వారు కర్తవ్య పరాయణులు మాత్రమే !

వారి తరువాయి వచ్చిన శ్రీ కృష్ణుల వారె కదా ప్రేమ తత్వాన్ని తీసుకొచ్చి మనకంతా ఇంత తంటా పెట్టింది !

శ్రీ రామ నవమి శుభాకాంక్షల తో

జిలేబి.

durgeswara April 20, 2013 at 9:31 AM  

తండ్రిపట్ల,సోదరులపట్ల,భార్యపట్ల,స్నేహితులపట్ల,ఆశ్రితులపట్ల,తనచే పాలింపబడుతున్న ప్రజలపట్ల ఆయన ఎల్లప్పుడు ప్రేమభావాన్నే కలిగియున్నారు. ఆప్రేమే ప్రపమ్చాన్ని రామునివైపు మల్లించినది, మల్లిస్తున్నది కూడా

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP