శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇది పూజ చేసే పద్దతేనా ?? కొద్దిగా ఆలోచించి చూడండి ఎంత అపచారమో!

>> Wednesday, March 27, 2013

భగవంతున్ని సాకారంగా అర్చించటం మనకున్న విశేషసాంప్రదాయం. భగవన్మూర్తి అంటే సాక్షాత్తూ భగవంతుడే . ఆలయంలో భగవస్సాన్నిధ్యంలో అత్యంత జాగురూకులమై ,వినయవిధేయతలతో మెలగాలి. భగవంతుని ముందు మర్యాదలన్నీ తుచాతప్పక పాటించాలి . అప్పుడు మాత్రమే మనం ఆయన సాకారరూపాన్ని సంపూర్ణంగా విశ్వశించినట్లు. అలాకాక  మనం అక్కడ అమర్యాదకరంగా ప్రవర్తిస్తే  మనకు  నిజంగా నమ్మకమున్నదని అనలేము.

గతంలో  పీఠానికి హైదరాబాద్ నుండి ఈఊర్లలో చుట్టరికం ఉన్న ఒకకుటుంబం వాల్లు వచ్చారు. మనపీఠానికి అమ్మవారి దర్శనార్ధం వచ్చారు. ఆవిడ కాస్త స్థూలకాయురాలు పూజసమయంలో ఒక కుర్చీ తెప్పించమని కోరారావిడ . అక్కడ ఉన్న మాతమ్ముడు  పీఠంలో ఎవరూ కుర్చీలలోనో  భగవన్మూర్తులకన్నా ఎత్తైన ఆసనాలలో కూర్చోవటం అంగీకరించము అని చెప్పాడు. అదేమిటండీ  మాకు హైదరాబాద్ లో సాయిబాబా ఆలయంలో అయ్యగారు కుర్చీలలో కూర్చోబెట్టి పూజచేపిస్తారు !  అని మొహమాటంగా మాట్లాడారు. ఇక్కడ పీఠానికి  ఆర్ధికంగా కూడా సహాయపడదామని పూజచేయాలని వస్తే ఇలా మాట్లాడతారు ?  అని వాదనలా మాట్ళాడారు.
మాతమ్ముడు ఇంట్లో ఉన్న నాదగ్గరకొచ్చి విషయం చెప్పారు. శరీరం సహకరించకపోతే  నమస్కారం చేసుకుని బయటకు రమ్మనండి. పూజ మనముచేద్దాం   అలా ఇష్టం లేకుంటే నిరభ్యరంతరంగా వారు వెళ్లిపోవచ్చు ,వారి సహాయం కంటే అమ్మవారి పట్ల చూపాల్సిన మర్యాదమాత్రమే మనకు ముఖ్యం అని చెప్పి పంపాను .
 ఆమధ్య కర్నూలులో ఓ కార్యక్రమానికి వెళితే  అక్కడ శ్రీవారి చిత్తరువును పూలతో భూమిపై అద్భుతంగా ఏర్పాటుచేశారు. చాలాచక్కగా కార్యక్రమం జరుగుతున్నది ,కానీ ఆహాలులోనే చాలామంది కుర్చీలలో కూర్చుని విష్ణుసహస్రనామాదులను పారాయణం చేస్తున్నారు.  కార్యక్రమ నిర్వహకులైన తిరుమలనుంచివచ్చిన ఆచార్యుల దగ్గరకు వెళ్ళి, అయ్యా ! ఇది అనాచారం. మీలాంటివాళ్లు ఇది తప్పు అనిచెప్పండి .లేకుంటే ఇదికూడా ఒక ఆచారమై కూర్చుంటుంది రాబోయే రోజులలో  అని విన్నవించుకుంటే  ,,,మాస్టారూ ! మనం చెప్పినా ఎవరు వింటారండీ? ఎవడి భేషజాలు వారివి అయ్యాయి ఈ కార్యక్రమాలలో అని నిరాశక్తత వ్యక్తం చేశారు .
ఇక ఈమధ్య  భద్రాచలం లోఅంబాసత్రం లో  సీతారామకళ్యాణ కార్యక్రమం  జరుగుతున్నప్పుడు హాలులో బాగా వృధ్ధులైన వారికోసం కొన్ని కుర్చీలు వేశారు . కార్యక్రమం మధ్యలో చూస్తే వృధ్ధులతోపాటు ఓ యువతి కూడా కూర్చుని వీక్షిస్తున్నది . నాకేమో  ఇలాంటి అపచారం జరుగుతుంటే మనసు ఉండబట్టదు.  దగ్గరకెళ్ళి అమ్మా! భగవంతుని ముందు ఇలా ఉన్నతాసనాలలో కూర్చొనటం అపచారం. దానివలన లేనిపోని కష్టాలు కలుగుతాయని చిలక్కు చెప్పినట్లు చెప్పాను . ఆ అమ్మాయి" వీడెవడొ పిచ్చిపంతులు" అన్నట్లు చూసి మాకుతెలుసులే అని తలపక్కకు తిప్పుకుంది గాని కుర్చీలోంచి లేవలేదు. ఇక్క అక్కడ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. ఇక చెప్పకపోతే నాతప్పు అనుకుని వచ్చేశాను.
ఇక ఆరోజు సాయంత్రం   మాఘపౌర్ణమి . అంబాసత్రంలో సాయంకాలం సువాసినులచే అమ్మవారికి కుంకుమార్చన సామూహికంగా అనిచెప్పారు. పౌర్ణమి పూజసమయానికి వెళ్లాను. దివ్యకాంతులు ఒలుకుతున్న అమ్మ మూర్తి ఓవైపు . ఎదురుగా ఏమాత్రం భయం లేకుండా కుర్చీలలో కూర్చుని కుంకుమార్చన  చేస్తున్నకొందరు భక్తురాండ్రు.
ఇక ఊరకుండటం నావల్లకాలేదు. అర్చకులవారిదగ్గరకెళ్ళి  ఏమిస్వామీ ! మనకు ఈదౌర్భాగ్యం . భగవంతునికి ఎదురుగా కుర్చీలలో కూర్చుని పూజచేయటం శాస్త్రసమ్మతమా ? దీనివలన ఎంత కీడుజరుగుతుంది? చెప్పవలసిన వాల్లం చెప్పకుంటే ఆపాపం ఎవరిది ? అని ఆవేదన వ్యక్తం చేశాను.. ఎక్కడండి! నలభై ఏళ్ళుదాటితే మోకాళ్లనొప్పులు వస్తున్నాయి ఈరోజులలో,  అందువలన కిందకూర్చోలేకపోతున్నారు అని సమర్ధించబోయాడాయన . శరీరం సహకరించినవరకు ఇలాంటిసేవలు చేయాలి .లేదంటే పూజాద్రవ్యాలను అర్చకులకిచ్చి పూజజరిపించుకోవాలి అంతేకాని భేషజానికి ఇలా పూజలుచేయటం పాపము. మిమ్మల్నిచూసి మీపిల్లలు కూడా ఇదేపద్దతని అనుకుంటారు . ఆదోషానికి కర్తలం కూడామనమే అని చెప్పటంతో  వాల్లు కుర్చీలు ఎదురువైపునుంచి ఓ పక్కకు మార్చుకున్నారు ,కొందరు దిగి కిందకూర్చున్నారు. ఆతరువాత ఇంటికొచ్చాక అంబాసత్రం ధర్మాధికారి వారికి ఫోన్ లో ఈవిషయం చెప్పాను .ఆయనకూడా ఆలయ ఆవరణలో అసలు కుర్చీలే లేకుండాచూస్తానని చెప్పారు.
ఆమధ్య ఓటీవీలో చుశాను ప్రముఖనటుని పెళ్ళి. ఇది మరీఘోరం. పెళ్లికొడుకూ,పెళ్లికూతురుకు ఎత్తైన పీటలు వేశారు సుమారు కుర్చీ ఎత్తులో . వాళ్ళ పాదాలదగ్గర  గణపతి పూజ. ఏమిటీ అనాచారం. వాళ్లిచ్చే బోడి దక్షిణలకోసం పురోహితులు ఇలా జరపాలా ? ముందు ఇదితప్పు అనిచెప్పాలి కదా? ఆతరువాత వాల్ల ఖర్మ అనుకోవచ్చు.

నేను విన్నవించుకునే  దొకటే. మీరెవ్వరూ భగవంతుని ముందు,గురువులముందు ఉన్నతాసనాలలో కూర్చోకండి అది మన పుణ్యరాశిని కొట్టివేస్తుంది. శరీరం సహకరించినమేరనే ఆలయంలో ఉండండి. ఇబ్బందిగాఉంటే అర్చకులను పూజచేయమని చెప్పి బయట కువచ్చి కూర్చుని ధ్యానం చేసుకోండి .  మనకోసం ఆచారాలను మార్చవద్దు. అపచారంతో లేనిపోని పాపం తలకెత్తుకోవద్దు.

4 వ్యాఖ్యలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी March 27, 2013 at 6:23 PM  

నిజమే. ఆ పెళ్ళి సంగతి వార్తల్లో చూసినపుడు తెల్లబోయాను. చిన్నవయసు వాళ్ళు కూడా ఇట్లా కుర్చీల్లో కూర్చుని చేస్తున్నారంటే మీరన్నట్టు క్రమేపీ ఇది కూడా ఒక ఆచారంగా స్థిరపడే ప్రమాదం ఉన్నది.

శ్యామలీయం March 28, 2013 at 5:52 AM  

అనాచారాలు ప్రబలుతున్నాయి. వైదిక కార్యక్రమాలు కేవలం తంతులే యీరోజుల్లో వాళ్ళకు. అంతా కలిప్రభావం. ఈ రోజుల్లో భగవద్భక్తిని కూడా ఒక ఫార్సుగా మార్చేసారు జననాయకులూ జనమూ. మనప్రబుధ్ధులు దేవుడి పూజల్నే కాదు అవసరానుగుణంగా దేవుళ్ళనీ‌ మార్చేస్తున్నారు. ఇళ్ళలో బళ్ళలో గుళ్ళలో అన్నీచోట్లా అనాచారాలే. అనాచారాలు ఆచారాలుగానూ‌ చక్కగా స్థిరపడుతున్నాయి క్రమంగా.

satya March 30, 2013 at 3:19 AM  

chala correct ga chepparu

chandra vykanti April 3, 2013 at 10:23 AM  

అయ్యా
దయయుంచి ఇటువంటి అనాచారములు ప్రబలకుండా ఏదైనా కార్యక్రమము మొదలుపెదతారని ప్రార్ధన.
టీవీ లలో ఈ మహత్తరమైన కార్యక్రమము, దానికి సరియైన వివరణ ఇవ్వలి. మీకు తెలసే వున్తున్ది. ఇంగ్లీష్ బాష విద్యలయాలు. అందులో ఏది మంచిదో ప్రొబొదించరు. దీనికి మన యువత కారణము కాదండి . కారణమూ అంటే తల్లి తండ్రులు. ప్రొద్దున లేస్తే వాళ్ళు టీవీ చుట్టూ తెరుగుతూ పాశ్చ్యాత్య అలవాట్లకు ఆకర్షితులు అవుతూ వుంటే మన పిల్లలకు మన సంస్కృతి ఎలా తెలుస్తున్ది. ఏ సినిమా చూసిన, ప్రోగ్రాం చూసిన, ఎవరిని చూసిన మన సంస్కృతి పాటిస్తూ కనిపించుతలెదు. చాలామందికి ఇది తప్పు అని తెలయదు.
శ్రీరామాయణము బాగా ప్రచారము చెయాలి. ఇంకా ఎన్నో ...................... మహానుభావులు దుర్గేస్వరరావుగారకి అన్నీ తెలుసు. మీరు చేస్తున్న సనాతనధర్మ ప్రచారము అత్యద్భుథము. ప్రశన్సనీయులు. దయయుంచి మీఫోన్ నెంబర్ vykanti@gmail.com పంపించగలరు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP