శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ శక్తి "రక్ష"ల రూపంలో ఓభక్తురాలి జీవితాన శుభాలు కురిపించింది

>> Friday, March 1, 2013

మొన్న భద్రాచలంలో ఉండగా
మిత్రులు  సుభాష్ గారి నుండి ఫోన్ వచ్చింది.[వీరు రాష్ట్రవ్యాపితంగా పలుఆథ్యాత్మిక సంస్థలలో క్రియాశీలకపాత్రపోషిస్తుంటారు]ఐదవ ఆవృతి పూర్తయినదికదా మీరింకా హనుమద్రక్షలు  అందరికీ పంపలేదా ? అని అడిగారాయన.  అందరికీ పంపలేకపోతున్నామండీ! ప్రతులు పంపిన వారందరూ వ్యక్తిగతంగా పంపారు. ఇంతమందికి పోస్టల్,కొరియర్ చార్జీలు భరించి పంపే ఆర్ధిక స్తోమత పీఠానికి లేదు.  గతసంవత్సరంలో నైతే ఎక్కువచోట్లనుండి  మొత్తంగా ఒకేకవర్లో పంపారు. అందులో  ఉన్నప్రతులప్రకారం   కొందరికి వారుపంపిన డబ్బుతోనూ మరికొందరికిస్వంతఖర్చులు భరించికూడా ఒకే అడ్రెస్ కు ప్రతులు పంపాము. అక్కడనుండి వారు పంపిణీ చేశారు.  ఈసారి  ఒక్కొక్కరు ఒక్కో కవర్లో పంపారు. సామూహికంగా పంపినవారు తక్కువ అనిచెప్పాను.అందువలన ఇంకాపంపలేకపోయాము అన్నాను.

మాస్టారూ ! మనం పంపుతున్న స్వామి రక్షలు ఎందరి జీవితాలలో శుభాలను కలుగజేస్తాయో మనకు తెలియదు కదా !  ఆయన అనుగ్రహం ఎంతమందికి చేరాలని సంకల్పించారో మీద్వారా హనుమద్రాక్షాయాగ రూపంలో కార్యక్రమం జరిపించి ఇలావారి ప్రసాదం అందజేసేలా ప్రేరేపిస్తున్నారు. నాకు మొన్న  హైదరాబాద్ లో ఓ భక్తురాలి జీవితంలో జరిగిన లీల తెలిసి ఆశ్చర్యపోయాను.  నాలుగవ ఆవృతిలో పూర్ణాహుతి కాగానే మీరు పంపిన హనుమద్రక్షలు  జియ్యర్ స్వామివారి గోష్ఠిలో భక్తులందరికీ అందజేయమని నిర్వాహుకురాలైన వారికి ఇచ్చాను. ఆవిడ ఆ రక్షలను అందరికీ అందజేస్తూ  ఇక్కడ  సుజాత అనే మరాఠీ భక్తురాలికొకరికి ఇచ్చారు.  ఆవిడ భర్తకు అన్ని దుర్గుణాలు వున్నాయి. తాగుడునుండి వ్యభిచారం వరకు. ఇక రోజూ ఇంటిలో భార్యను హింసించటం కూడా అతని దినచర్యలో ఒకభాగం. భగవంతునిపై భారం వేసి దుఃఖిస్తూనే సంసారం లాక్కొస్తుంది.  ఇక ఈవిడ గోష్టిలో ఇచ్చిన  హనుమద్రక్షలను  తీసుకువెళ్ళి భర్త చేతికి రక్షలుగా కట్టింది. ఏ మానాన ఉన్నాడో మహానుభావుడు బుధ్ధిగా కట్టించుకున్నాడు . చిత్రంగా  నమ్మలేనివిధంగా మరుసటి రోజునుండి అతనిప్రవర్తనే మారిపోయిందట.
ఏదో అద్భుతశక్తి అతన్నిశాశిస్తున్నట్లుగా  చెడు అలవాట్లకు దూరమయ్యాడట .  ఎండకు నెర్రెలువారిన భూమిపై వర్షం కురిసి పచ్చికమొలకెత్తినట్లు జీవితంలో ఆనందఘడియలు మొదలయ్యాయి. మొన్న  నేను  వెళ్లినప్పుడు ఆ గోష్ఠి నిర్వాహకురాలు  ఆవిడదగ్గరకు తీసుకువెళ్ళి ఈవిషయం చెప్పించినది. ఆవిద నన్నుచూడగనే చేతులెత్తి నమస్కరించినది. స్వామీ ! హనుమంతుడు ఈ రక్షలరూపంలో నాకాపురాన్ని కాపాడాడు. మరికొన్ని రక్షలు ఉంటే ఇవ్వగలరా ! అని వేడుకొన్నది. 

  ఇలా ఎంతమంది జీవితాలలో శుభాలు కలిగాయో మనకు తెలియదు కదా ! అందుకని నాకుకొన్ని రక్షలు పంపండి . నాకు కాంటాక్ట్ లోఉన్నవారందరికీ పంపుతాను అని ఆయన కోరారు.

నిజమే ! హనుమంతుని దయకు అంతేమున్నది. ఎక్కడో సంకల్పించి మరెక్కడో భక్తులబాధలను దూరంచేసేలా లీలలను జరుపుతున్నాడు..


జయతు అంజనిపుత్రధీవర  జ్ఞానరత్నసుధాకరా ! జయత్రిలోక వికాశభాసుర చారురూప కపీశ్వరా !
జయ! మహాభజరంగి విక్రమ సద్గుణాకరశేఖరా!
పవనసుత! హనుమంత! రాఘవభక్తమాం పరిపాలయా !


2 వ్యాఖ్యలు:

Sandeep P March 1, 2013 at 3:17 PM  

సాక్షాత్ రాఘవుడికే హనుమంతుడి తోడు అవసరమైంది. ఇక మనలాంటి వాళ్ళమెంత, దుర్గేశ్వర గారు. హనుమంతుడిని ఆశ్రయించినవాళ్ళకు అంతా శుభం కలుగుతుంది. మీ చేతుల మీదగా ఈ పవిత్రమైన యాగం కొన్ని వందల సార్లు జరగాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్తే!

రాజేశ్వరి నేదునూరి March 1, 2013 at 4:36 PM  

నిజమే మాకు చాలా నమ్మకం. ఏదైనా పని తలపెట్టి నప్పుడు రోజుకి 41 చొప్పున 41 రొజులు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కార్యం దిగ్విజయంగా నెరవేరు తుంది. చాలా సంతోష కరమైన విషయం చెప్పారు .ధన్య వాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP