ముద్దుల కృష్ణయ్య
>> Monday, June 11, 2012
సాక్షాత్తూ అవతార స్వరూపుడైన శ్రీకృష్ణూడు చిన్నతనంలో
సాధా రణ మానవ మాత్రుడి మాదిరిగా తల్లిని సతారుుంచాడు. గోపికలతో చిలిపి
చేష్టలు చేశాడు. బలరాముడితో కలసి అల్లరి చేశాడు. పాల కోసం మారాం చేశాడు.
ఒకో్క రోజు ఒకో్క విధమైన అల్లరి. నిజంగా యశోదమ్మ ధన్యురాలు. ముల్లోకాలను
భరించి పోషించు ప్రభువే ఆమె ముందు వెన్న కొరకు చేరుుచాచి మంకు పట్టు
పడుతున్నాడు. ఆమె వంటి అదృష్టవంతురాలు ఇంెకవరుం టారు? యశోదను చిన్ని
కృష్ణూడు ఏ విధంగా సతారుుంచాడో చూస్తే మనింట్లో చిన్నపిల్లలు చేసే అల్లరి
గుర్తుకొస్తుంది.
చందమామ రావే, జాబిల్లి రావే!
కొండెక్కి రావే, గోగుపూలు తేవే!
బండిమీద రావే, బంతిపూలు తేవే!
అన్నిటినీ తెచ్చి అబ్బాయికియ్యవే!!
గభాల్న ఉయ్యాలలో లేచి కూర్చుని, ‘అమ్మా! ఇందాకట్నుంచి చందమామ... చందమామ అంటున్నావు కదా! నాకు ఆ చంద మామ కావాలి’ అని ముద్దుముద్దు మాటలతో అడిగాడు. అప్పుడే అటుగా వచ్చిన గోపికలు, కన్నయ్య మాటలను విని, ‘భలేవాడి వయ్యా! అదేమన్నా వెన్నముద్ద అనుకున్నావా ఏమిటి? అదొక రాజహంస. ఆకాశంలో అలా తిరుగుతూనే ఉంటుంది’ అని అన్నారు. గోపికల మాటలను విన్న ముద్దుల కృష్ణయ్య, ‘నాకు అదే కావాలి. ఆకాశం నుంచి అది పారిపోకముందే, దానిని పట్టుకొచ్చి నాకివ్వండి’ అని గారాం చేయసాగాడు.
అప్పుడు కల్పించుకున్న యశోద, ‘నా ముద్దులకన్నయ్యా! అది చందమామా కాదు, రాజహంసా కాదు. అదొక వెన్నముద్ద. దాంట్లో నల్లని మచ్చలున్నాయి కదా! అది విషమన్న మాట. అందుకే దాన్ని ఎవరూ తినరు’ అని చెప్పింది.
‘అమ్మా! ఆకాశంలోనున్న దాంట్లోకి విషం ఎలా వచ్చి ఉంటుం ది?’ కన్నయ్య ప్రశ్న.
‘కన్నా! ఇది వరకు ఓ పాలసముద్రం ఉండేది’
‘పాలసముద్రమా. అదెలా ఉంటుంది?’
‘నువ్వు ఆవుపాలను చూసావు కదా! ఆ ఆవుపాలతో ఏర్పడిందే పాల సముద్రమన్నమాట’
‘ఎన్ని ఆవు పాలతో అంత పెద్ద పాలసముద్రం ఏర్పడుతుం దమ్మా?’ అమాయకంగా అడిగాడు కృష్ణయ్య.‘అవన్నీ అవుపాలే కాదయ్యా’‘అబద్ధాలాడుతున్నావమ్మా, ఆవులు లేకుండా పాలు ఎలా వస్తా యి?’యశోదకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ‘ఆవులను సృష్టించిన భగవంతుడే, ఆవులు లేకుండానే పాల సముద్రాన్ని ఏర్పాటు చేసాడన్నమాట!’ ఎలాగోలా కృష్ణునికి అర్థమయ్యేట్లు చెప్పాననుకుంది.
‘ఆ విషాన్ని శంకరుడు తాగుతున్నప్పుడు, కొన్ని విషపు చుక్కలు కింద పడుతుండగా, వాటిని పాములు తాగాయి. అందుకే పాముల్లో కూడ విషం ఉంది’.
యశోద, కన్నయ్యకు చంద్రుని చూపుతూ, ‘ఆకాశంలో ఉన్న ఈ వెన్నముద్ద కూడా ఆ పాల నుం డే వచ్చింది. కాబట్టి అందులో కూడా కాస్తంత విషం ఉండబట్టే అందులో మచ్చలున్నాయి. కాబట్టి నువ్వు ఆవెన్నముద్దను అడగొద్దు’ అని బుజ్జగించింది. ఆ రోజుకు కన్నయ్యను ఎలాగోలా సమాధానపరిచిన యశోద, మరుసటిరోజు కూడ కన్నయ్య చిలిపి చేష్టలను చూస్తూ పరవశించిపోయింది. ఒకసారి చిన్నారి కృష్ణుడు రత్నాలు పొదిగిన నేలపై మోకాళ్ళతో దోగాడుతుండగా, కమలంవలె మెరుస్తోన్న కన్యయ్య ముఖం ఆ నేలపై ప్రతి ఫలించసాగింది. ఆ బింబం తను ఏది చేస్తే, అది చేస్తోంది. తను నవ్వితే ఆ ప్రతిబింబం కూడా నవ్వుతోంది. తాను దోగాడుతుంటే అది కూడా దోగాడుతోంది.
తనకొక మిత్రుడు దొరికాడనుకున్న కృష్ణుడు మురిసిపోతూ, ఆ ప్రతిబింబంతో, ‘సోదరా! నువ్వెక్కడుంటావు. ఈరోజు నుంచి మనం మిత్రులం. నేను వెన్న, పాలు తాగుతాను కదా! అవి నీకు కూడ ఇస్తాను. మా అన్న బలరాముడు నాతో ఎప్పుడూ తగవులు పడుతుంటాడు. నువ్వు కూడా అలా ఏమి చేయవుకదా! మా ఇంట్లో అన్నీ వస్తువులున్నాయి. నీకేం కావాల న్నా మా అమ్మనడిగి ఇప్పిస్తాను. పాలు, వెన్న, కలకండ... ఏమి కావాలన్నా నన్ను అడుగు’ అని ఆ ప్రతిబింబాన్ని పట్టుకునేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు. తను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ ప్రతిబింబం మాత్రం తనకు చిక్కడం లేదు. ఎంతగా ప్రయ త్నించినా, అంతగా దూరంగా జరుగుతుందే తప్ప ఆ ప్రతి బింబం కృష్ణయ్య చేతులకు చిక్కడం లేదు.
ఇక, ఏమి చేయలేకపోయిన కన్నయ్య ఏడుపు ముఖం పెట్టాడు. ఆ చిట్టి కృష్ణయ్య కళ్ళ నిండా నీళ్ళు నిండిపోయాయి. ఉబి కొస్తున్న ఏడుపువెక్కిళ్ళతో బయటపడుతోంది. అంతలో అటుగా వచ్చిన యశోదాదేవి తన గారాలపట్టి కళ్ళల్లో నీళ్ళు చూసి, నొచ్చుకుని, ‘అడెడెడె... ఏమైంది కన్నా! ఎందుకేడుస్తున్నావు?’ అని బుజ్జగించింది. అమ్మను చూడగానే కృష్ణుడు మాట మార్చా డు. ఎలాగైనా అమ్మ దగ్గర్నుంచి వెన్నముద్ద తీసుకుని తినాలన్నది కన్నయ్య ఆలోచన. ‘అమ్మా! వీడు చూడవే, మనింట్లో వెన్నను దొంగిలించడానికి వచ్చినట్లున్నాడు. నేను ఆపినా ఆగడం లేదు. నేను తిడితేవాడు నన్ను తిడుతున్నాడు. నేను కొడవామంటే నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఇట్రామ్మా. ఇద్దరం వీడిని బయటకు తరుముదాం.
లేకపోతే వీడు మన వెన్నంతా తినేస్తాడు’ అని కృష్ణుడు ఏడుస్తూ చెప్పడంతో మురిసిపోయిన యశోద, తన కన్నయ్యను లాలిస్తూ వెన్నముద్దలతో కృష్ణుడి నోటిని నింపేసింది. ఇలా కృష్ణుని అల్లరి సందడి సందడిగా ఉంది.ఒకనాడు యశోద పెరుగు చిలుకుచు వెన్న తీస్తోంది. తల్లిని సంతోషపెట్టడానికి బలరామకృష్ణులు అక్కడికి వచ్చారు. కన్న య్య తల్లి జడను పట్టుకున్నాడు. బలరాముడు ఆమె మెడలోని ముత్యాలహారాన్ని పట్టుకున్నాడు. ఆ ఇద్దరూ ఆమెను తమ వైపునకు లాగుకొనుటకు ప్రయాజపడసాగారు. ‘అమ్మా! నామా ట విను, నామాట విను’ అని అరవసాగారు. ‘అమ్మా! నాకు చాలా ఆకలివేస్తోంది. ఇప్పుడే నాకు వెన్న, రొట్టె కావలె, ఈరోజు ఆడి ఆడి ఎంతో అలసిపోయాను. రొట్టె వెన్న తిని నిద్రపోతను’.
తల్లి యశోద ‘నాయనా! పాలు తాగు. లేకపోతే మన ఇంట్లో తిను బండారాలకు ఏలోటూ లేదు - వాటిని నీ ఇష్టం వచ్చినట్లు తిను’ అని చెప్పింది. కన్నయ్య మాత్రం ‘నాకు అవేమి వద్దు, వెన్నే కావ లె. నీవు వెన్నను పెట్టనంతవరకు నిన్ను వదలన’ని అన్నాడు. అప్పుడు తల్లి ‘కన్నయ్యా! నీవు వెన్న తింటే నీజుట్టు పెరుగనే పెరు గదు. అది పొట్టిగానే ఉంటుంది’ అని పలికింది. అప్పుడు కన్న య్య ‘అమ్మా! అన్నయ్యకేమో నువ్వు అడ్డుచెప్పవు. ఆయన అడిగి నప్పుడు వెంటనే రొట్టె, వెన్న ఇస్తావు. మరి నాకెందుకు ఇయ్య వు?’ అని బుంగమూతితో అడిగాడు.
అప్పుడు యశోద, ‘చూడు కన్నయ్యా! అన్నయ్యకు కూడ ఇంతకు ముందు వెన్న, రొట్టె ఇవ్వలేదు. తినుబండారాలే తిని, పాలు తాగెడివాడు. అందుకే తన జుట్టు పొడవుగా, ఏపుగా పెరిగినది. నీవును పాలు తాగినచో నీ జుట్టు కూడ అలాగే పెరుగుతుంది రా! ఆవుపాలు సిద్ధంగా ఉన్నవి వచ్చి తాగు’. చిన్ని కృష్ణుడు ‘నీవు చెబుతున్నవన్నీ అబద్ధాలే. నేను రోజూ పాలనే తాగుతున్నా. అయినా నా జుట్టు పొట్టిగానే ఉంది. ఈ రోజు నాదగ్గర నీ పప్పు లు ఉడకవు. నాకు వెన్న, రొట్టె ఇవ్వవలసిందే.
ఇంక నీ మాటల ను నేన నినదలచుకొనలేదు. నాకు వెన్న, రొట్టె ఇస్తావా లేదా? చెప్పు. ఇవ్వకుంటే నేను నీతో మాట్లాడను, నీ దగ్గరకు రాను. అన్నయ్యే నీ కొడుకు, ఇంతకూ నేను నీకు ఏమౌతాను?’ అని అనగానే యశోద ‘కన్నయ్యా! నా మనస్సు, ప్రాణాలూ అన్నీ నీవే. నిన్ను విడిచి నేను ఎట్లుండగలను? నా తండ్రీ! ఒక్క నిముషం ఆగు. వెన్న తీస్తున్నానుగదా! నీకు చలా ఆకలివేసినట్లుంది. కావలసినంత తిందువుగాని, ఇప్పుడు నీకు సంతోషమయ్యిం దా?’ అని అంది. ఈ విధంగా యశోద పూర్తిగా పుత్ర వాత్సల్యం లో మునిగిపోయింది. ఆమె కన్నులలో ఆనందాశ్రువులు పొం గిపొర్లేయి. నిజంగా యశోదమ్మ ధన్యురాలు. ముల్లోకాలను భరించి పోషించు ప్రభువే ఆమె ముందు వెన్న కొరకు చేయిచాచి మంకుపట్టు పడుతున్నాడు. ఆమె వంటి అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు?
మెల్లగా యశోద ఒడిలోకి చేరిన కన్నయ్య గభాల్న, ‘అమ్మా! నాకు ఆకలిగా ఉంది. పాలివ్వు’ అని మారాం చేయసాగాడు. ‘ఇప్పుడేమీ లేవురా’ అన్న తల్లితో ‘మరెప్పుడుంటాయి?’!! అని ఎదురు ప్రశ్నించాడు కన్నయ్య.రాత్రిపూట దొరుకుతాయి’‘రాత్రి అంటే ఏమిటమ్మా?’ ఏమీ తెలియని అమాయకునిలా అడిగాడు కృష్ణయ్య. తన గారాలపట్టి ప్రశ్నలకు మురిసిపోయిన యశోద తన బిడ్డడి చెక్కిలిపై ముద్దిడి, ‘రాత్రి అంటే అంతా చీకటిగా ఉంటుంది’ అని చెప్పింది. వెంటనే తన కళ్లను గట్టిగా మూసుకున్న అల్లరి కృష్ణయ్య, తన తల్లితో, ‘అంతా చీకటిగా ఉంది. రాత్రి వచ్చేసింది. పాలు...’ అని అడగడంతో మురిసిపోయిన యశోద గారాల కన్నయ్యను ముద్దులతో ముంచెత్తింది.
ఆలా చంద్రకళ

1 వ్యాఖ్యలు:
అబ్బా..... చాలా చాలా చాలా బాగుంది..
చిన్ని కృష్ణయ్య చిలిపి చేష్టలు, లీలలు ఎన్ని విన్నా ఇంకా వినాలనే ఉంటుంది..
అన్నింటినీ సృష్టించి , పాలించే ఆయనే అమాయకంగా భలే అడుగుతున్నాడు కదా....
Post a Comment