నిజం తెలుసుకో ..............
>> Friday, April 16, 2010
వందకోట్లకు అధిపతివైనా _ ఒక్క నిముషం ఆయుష్షు కొనలేవని తెలుసుకో
కోటికోట్లకు వారసుడవైనా _ ఊపిరిపోగానే ఊరిబయట పారవేస్తారని తెలుసుకో
లక్షాధికారివైనా భిక్షాధికారివైనా _ స్మశానం లో ఇద్దరూ సమానమేనని తెలుసుకో
వందమంది డాక్టర్లు నీవెంటనున్నా _ నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో
ప్రపంచానికంతా అధిపతి వైననూ _ నీ ఆయుష్షుకు అధిపతివి కాలేవని తెలుసుకో
యావత్ ప్రపంచాన్ని జయించగలిగననూ _ మృత్యువును జయించలేవని తెలుసుకో
కాలం విలువైనది,రేపు అను దానికి రూపులేదు_మంచిపనులు వాయిదావేయరాదని తెలుసుకో
నీవు తిన్నది మట్టిపాలు _ ఇతరులకిచ్చినదే నీపాలని తెలుసుకో
నీవుదాచుకున్నది జారిపోతుంది _ ఇతరులకిచ్చి సహకరించినదే నీ ఖాతాలో జమవుతుందని తెలుసుకో
భోగాలకు ఖర్చు చెసి రోగాలు తెచ్చుకోక_ మంచిపనులకు ఖర్చుచేసి పుణ్యాన్ని పెంచుకో
ఆ పుణ్యమే నీరాతను నిర్ణయిస్తుందనే నిజం తెలుసుకో .
[ ఆథ్యాత్మిక గ్రంథాలనుండి]
3 వ్యాఖ్యలు:
ఎంత గడించినన్మనలకెంతటి యాస్తిని కూడఁ బెట్టినన్;
చెంతనువైద్యులున్నను; విచిత్రము నీ పయనమ్మునాపలే
వెంతటి వింతయిద్ది? మనమిచ్చిన దానమె మన్ననంబునై
యంతమునందువచ్చెడుమహాద్భుతమోక్షమునిచ్చెడున్ వినన్
మీరు క్రోడీకరించిన సూక్తులూ, చింతా వారి పద్యము ప్రతీ వారి మనసులో మెదులతుండ వలసినవి. రాజ సూక్తులు 101 అనే కోర్స్ ప్రారంభించి విశ్వవిద్యాలయాల్లో ప్రతీవాళ్ళు, రాజకీయ నాయకులు,ఉద్యోగస్తులు తప్పకుండా తీసుకోవాలి అని పెట్టాలి. పోస్ట్ వేసి నందుకు ధన్య వాదాలు.
సూక్తులు బాగున్నాయి. ఆచరణీయాలు. నేను ఇవి గతంలో ఎక్కడో చదివా కాని గుర్తులేదు.
Post a Comment