శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సాగుతున్న హనుమత్ రక్షాయాగం సంరంభాలు.

>> Thursday, April 8, 2010




మొదలవబోతున్న ఆథ్యాత్మిక ప్రయోగం "హనుమత్ రక్షాయాగం" రెండవ ఆవృతికొరకు సంరంభాలు స్వామి ఆజ్ఞానుసారం సాగుతున్నాయి. క్రితం సంవత్సరం ఈ సాధనలో పాల్గొన్న సాధకులకు లభించిన ఫలితాలు చూసి ఆప్రేరణతో మరింతమందికి ఈ కార్యక్రమాన్ని అందించాలనే సంకల్పంతో అదీ హనుమత్ ప్రభువు తానే నడిపిస్తాడనే నమ్మకం తోఈ కార్యక్రమానికి సాహసిస్తున్నాము. క్రితం సంవత్సరం కూడా ,కార్యక్రమం స్వామి ఆదేశంగా భావించి ప్రారంభించగనే పూజాద్రవ్యాలు.యజ్ఞద్రవ్యాలు, అన్నదానమునకు కావలసిన వనరులు మేము సమకూరుస్తామంటూ స్వామి భక్తులు ముందుకొచ్చారు .ఎవరో నిర్ణయించి ఉంచిన ప్రణాళికవలె కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా అద్భుతమైన ఫలితాలతో ముగిసింది. అలానే ఈసంవత్సరం కూడ కార్యక్రమం చేపట్టాలని సంకల్పించగనే స్వామి అనుగ్రహం మొదలైంది. తణుకు ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు హనుమదుపాసకులు వెంకట్రామయ్యగారు, సంసిద్ధులయ్యారు. తాడేపల్లి గూడెంలో ఉన్న మన బ్లాగర్ ,అక్కడి ప్రింటింగ్ సంస్థ యజమాని జగదీష్ రెడ్డిగారు కార్యక్రమంలో పాల్గొనే సాధకులకు అందజేసేందుకు కావలసిన హనుమాన్ చాలీసాలు,సంపుటీకరణ మంత్రాలు ముద్రించిన కార్డులను తాము తయారుచేసి ఇస్తామని చెప్పారు. ప్రముఖ హనుమత్ తత్వప్రచారకులు అన్నదానం చిదంబర శాస్త్రిగారు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ తమ శిష్యవర్గానికి అందజేస్తున్నారు.చెన్నైనుండి " ఇండియాటుడే "లో పనిచేస్తున్న ఒక హనుమద్ భక్తుడు తాము సుందరాకాండను గేయరూపంలో గానంచేస్తామని .రాష్ట్రంలో ఎక్కడైనా ఈకార్యక్రమంలో వచ్చి పారాయణం చేయమంటే సిద్దమని తెలిపారు. అలాగే గాయత్రీపరివార్ కు చెందిన సాధకులు కొందరు ఎక్కడైనాయజ్ఞనిర్వహణ మేము సహకరిస్తామని మాటిచ్చారు .ఇలా అన్నీ స్వామే సమకూరుస్తున్నారు కనుక ఇది స్వామి అనుగ్రహాన సాగుతున్న యాగంగా భావించి స్వామిసేవలో ముందుకు సాగుతున్నాము. రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలచుకుంటే వారికి మావంతు సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నాము . త్వరలో ఇందులో పాల్గొనే విధానం ,సాధన తెలియజేస్తాము.
జైశ్రీరాం .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP