దత్తానుగ్రహ సాధన
>> Friday, April 2, 2010
శ్రీ గురుచరిత్రను భక్తితో పారాయణం చేసి ఇహపరాలను సులభంగా సాధించుకోవచ్చు . దత్తప్రభువు అనుగ్రహ ముంటే లభించనిది ఏమున్నది ? చొట్టచేతులతో పుట్టిన కార్తవీర్యునకు వేయిబాహువులను అఖండ సిద్ధులను ,సమస్తరాజ్యభోగాలను ప్రసాదించిన కరుణాంతరంగుడాయన . కేవలం భౌతిక సుఖాలనే కాదు ఆథ్యాత్మిక శిఖరాలపై భక్తులను కూర్చోబెట్టి పరమపదవిని ప్రసాదించగలదు సద్గురు కృప . ఇక గురునాథుడైన దత్తానుగ్రహానికి తిరుగేమున్నది ? . ఈ కలియుగాన ఆయన అనుగ్రహాన్ని శీఘ్రంగా ,సులభంగా ప్రసాదించగల మార్గం శ్రీగురుచరిత్ర పారాయణం . ఈ గ్రంథ పారాయణాన్ని చేస్తూ . సకల శుభాలను సాధించుకోవచ్చు . భక్తిపూరిత సాధన మీది ,అనుగ్రహ కృపావర్షం దత్తప్రభువుది . ప్రారంభించండి .ఏటి ఒడ్డున నిలబడి అలా దాటాలా ? ఇలా దాటాలా ? అని మీనమేషాలు లెక్కించేబదులు దిగి చూడండి ఏదో ఒక ప్రయత్నానికి .అది దత్తప్రభువు అనుగ్రహానికి కారణమై మనలను తప్పనిసరిగా తరింపజేస్తుంది. శ్రీ గురుచరిత్ర పారాయణం తోబాటు క్రింది శ్లోకాల జపం తప్పనిసరిగా ఆయా ఫలితాలనిస్తుంది మీ జీవితాన ప్రయోగించి నిరూపించుకుని చూడండి .
జై గురుదత్తా .
అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:
స్మర్తృగామీ స్వభక్తానాముద్ధర్తా భవసంకటాత్
[ యథా శక్తి ఈస్తోత్రం జపం చేస్తే కష్టాలు తొలగుతాయి]
జీవయామాన భర్తారం మృతం సత్యాహి మృత్యుహా
మృత్యుంజయ స్స యోగీంద్ర: సౌభాగ్యం మే ప్రయచ్ఛతు .
{ ఈశ్లోకాన్ని జపిస్తే సౌభాగ్యం వృద్ధి అవుతుంది.]
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్
యో౭భూదభీష్ట: పాతు స న: సంతాన వృద్దికృత్
సంతానాన్ని ప్రసాదిమ్చగల శ్లోకజపమిది]
దరిద్ర విప్ర గేహే య: శాకం భుక్త్వోత్తమ
శ్రియం దదౌ శ్రీదత్త దేవ: దారిద్ర్యాత్ శ్రీప్రదో౭వతు
[ఈశ్లోకజపం దారిద్ర్యాన్ని దూరం చేసి సంపదను ప్రసాదిస్తుంది]
1 వ్యాఖ్యలు:
sri swami varu ippudu kudaa avatarinchi vunnaru.srisrisri ganapati sachchidananda swamiji variga.nijam .nammandi.nenu 10 samvatsaraluga telisi vunnanu,enno mahimalu,divyaanubhutula nirupana.
Post a Comment