మనలను మనం మూర్ఖులనుకునే దినమట .. సంతోషిద్దామా ! ఏమిటీ ఖర్మ?
>> Thursday, April 1, 2010
మనం ఇతరులను ఎగతాళికైనా మూర్ఖులు అని సంబోధించడానికి సందేహిస్తాము . కారణం ఇతరులను అవమానించటం అనేది కూడా పాపమని మన నమ్మిక . మనకు క్షమించే ఔదార్యాన్ని నేర్పినది మన సంస్కృతి. అవమానించే గుణం ఒక అవలక్షణంగా భావింపబడుతుంది మనలో .
కానీ ఎవరినైనా ముఖ్యంగా వారి పద్దతిని అనుసరిమ్చని ఎవరినైనా మూర్ఖులుగా జమకట్టి అవమానించటం తెల్లవాని దురహంకారం . అందుకే ప్రపంచ చరిత్రలోవాని అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకోవటానికి ఇతరులు ఏమీ తెలియని మూర్ఖులుగా ప్రచారం సాగించిన నైచ్యం అడుగడుగునా కనపడుతుంది . దానిలో భాగమే ఈ ఏప్రిల్ ఫూల్ ఆచారం . ప్రామాణికమైన కాలగణనం లేని పాశ్చాత్యులు కొత్త సంవత్సర ప్రారంభాన్ని అనేకసార్లు మార్చుకున్నారు. అప్పటిదాకా ఏప్రిల్ ఒకటిన జరుపుకుంటున్న కొత్తసంవత్సరం వేడుకలను జనవరి ఒకటికి మార్చుకుని ,ఈమార్పుని అంగీకరించక పాతపద్దతినే ఆచరించే వారిని ఏప్రిల్ ఫూల్స్ అంటూ హేళనచెసి దానితో సంతోషాన్ని పొందటమేకాక తమకు బానిసలయ్యేవారందరి మెదల్లలోకి తమకు తాముగా ఏమీతెలియని మూర్ఖులమనే భావజాలాన్ని విజయవంతంగా చొప్పించగలిగారు. ఈవరుసలోనే తెల్లవాడు తమ సంస్కృతిని నరాల్లోకి ఇంజక్షన్ లా ఎక్కించి మరీ మనదేశాన భావబానిసత్వం పెంచగలిగాడు కొంతవరకు .అందుకే ఈ ఫూల్స్ దినాలు ,ప్రేమికుల దినాలు రకరకాల దినాలు మన జీవితంలోకొచ్చేస్తున్నాయి . రేపోమాపో లేచిపోయే దినాలు ,లేవదీసుకుపోయే దినాలు కూడా వస్తాయేమో ! ఖర్మ.
ఈ ఏప్రిల్ ఫూల్ ఆచారమూలాలను పరిశీలించండి ఒకసారి.
చరిత్ర
ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. [1]అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటినుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టపడక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యదావిధిగా ఏప్రిల్ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటపట్టించేవారు. అంతేకాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్ ఫిష్ అంటూ అల్లరి పెట్టేవారు.
ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్ ఫూల్స్ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమెరికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచమంతా ప్రాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రాన్రానూ ప్రాక్టికల్ జోక్స్ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్ జోక్స్ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. [వికీపీడియా నుండి]
5 వ్యాఖ్యలు:
ఎంతైనా పాశ్చాత్యులని గుడ్డిగా అనుసరించే గొర్రెలం కదా.
mee Asakti , anurakti mudaavahamu. SOchaneeyam. mee vyaasam dvaaraa paaSchaatyula saampradaayaalaku praachuryam kalipinchaaru. mee dRshTini Akarshinchindi anaDamlO sandEham lEdu.
మీ ఆసక్తి , అనురక్తి ముదావహము. శోచనీయం. మీ వ్యాసం ద్వారా పాశ్చాత్యుల సాంప్రదాయాలకు ప్రాచుర్యం కలిపించారు. మీ దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు.
అయ్యా
అజ్ఞాత గారూ మీరు వ్రాసినది అర్ధంకావటం లేదు.
మా విద్యార్థులు ఒకరినొకరు ఏప్రిల్ఫూల్స్ అని ఎగాతాళిచేసుకుంటుంటే అర్ధం పర్ధం లేని ఈ అలవాట్లగూర్చి వాల్లకు వివరించి ,పనిలోపనిగా ఇది వ్రాసాను.
ఏదోలెండి సరదాకి పోనీండి. ఇలా చెప్పుకుంటూ పొతే అమ్మ "దినం" నాన్న "దినం", స్నేహితుల "దినం" అలాగే ఇదొక పిచ్చాళ్ళ "దినం". ఇలా ఒక్కొక్కళ్ళకి పేరు పేరున దినాలు జరుపునే సంస్కృతి ప్రవేశింది దీన్నే కలి ప్రభావం అనుకోవాచ్చునేమో!!
Post a Comment