శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"సన్యాసాశ్రమంలో ఉండి సాధనచేయటం కోటవెలుపలకొచ్చి పోరాడటం వంటిదైతే ,గృహస్థాశ్రమంలో ఉండి చేసే సాధన కోటలోపలుండి పోరాడటం వంటిది ".

>> Monday, March 29, 2010

శాస్త్రాదులలో చెప్పబడిన సన్యాసి లక్షణాలేమిటి ? ఇప్పుడు కలి లో చూస్తున్న లక్షణాలేమిటో చూద్దాం.

గురుచరిత్రలో శ్రీగురుడు తన గృహస్థు శిష్యులకు చేసిన బోధలో విషయాలు చూడండి.

ఉపనయాది సంస్కారాలతో బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తిగా గురువును సేవించాలి .అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావమ్తుడు కావాలి. చివరకు గురువునకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి .అతుతరువాత గురువు అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్తవయస్కుడయ్యాక ,అతనికి సర్వస్వము అప్పగిమ్చి భార్యతోగూడ అరణ్యానికి వెళ్ళి గ్రామ్యవిషయాలు వదలి వానప్రస్థం గదపాలి. భార్య అనుమతితో సన్యసించాలి.

ఇక సన్యాసికి జపము,భిక్షాటనము, ,ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు. వాహనము లెక్కరాదు. మంచము తాకరాదు. పగలు నిద్రిమ్చరాదు. నిరంతరము ఆత్మద్రష్టయై ఉందాలి. వెదురు,సొరకాయ,చెక్క,మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారియై పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్ధాటన చేస్తూ మూడుపగళ్లు మించి ఏగ్రామం లోనూ నివశించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరం లో శక్తిలేకుంటే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మాహాక్షేత్రం లో నివశించాలి.
ఇది యత్యాశ్రమంలో నిబంధన
ఇక క్షణికావేశం లో సన్యాసం స్వీకరిస్తే వాసనా క్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రం హెచ్చరిస్తున్నది.
దైవమార్గాన పయనించదలచినవానికి అర్హతానుసార మార్గం ఎన్నుకోవటం తగియున్నది. గృహస్థాశ్రమం లో్ సాధన వలన గొప్ప ఉపయోగమేమిటంటే సాధకుని పతనావస్థకు చేర్చే కామాదులనుంచి రక్షణ లభిస్తుంది. అందువలనేనేమో మన మహర్షులు అడవులలో ఆశ్రమాలలో సపత్నీసమేతంగా నివాసంఉండేవారు.
అందుకే రామకృష్ణపరమహంస ఇలా అంటారు."సన్యాసాశ్రమంలో ఉండి సాధనచేయటం కోటవెలుపలకొచ్చి పోరాడటం వంటిదైతే ,గృహస్థాశ్రమంలో ఉండి చేసే సాధన కోటలోపలుండి పోరాడటం వంటిది ". మనకు కనపడుతున్న ప్రత్యక్షప్రమాణాలు చూస్తుంటే సాధకులు పెద్దల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటం వలన తెచ్చుకున్న ముప్పు అని అర్ధమవుతున్నది. అవును మరి ఇది కలి కాలం . జిహ్వచాపల్యం ,అంగచాపల్యం తో మానవులను పతితులను చేస్తానని ప్రతినపూని వున్నాడు కలిపురుషుడు. నిరంతరం డాలు తో దెబ్బలు కాచుకు కూర్చున్న ఎంతటి యోధునకైనా ఏకాస్త ఆదమరపు వచ్చినా చాలు ....................తల తెగిపడుతుంది ..

{కాషాయం ఫాన్సీ డ్రస్ కాదు .ఎవరుబడితే వాల్లు ధరించడానికి . అది పదునైన కత్తి మొనపై నడుస్తూ విన్యాసాలుచేసే సాధకుల యూనిఫాం }



5 వ్యాఖ్యలు:

Anonymous March 29, 2010 at 6:33 PM  

Do you mean sanyasam is 'fighting' or 'struggling' from both in&out? :))

Those who renounced evrything have no need to 'fight' for anything. They just want salvation i.e. end of this cyclic births & deaths.

Anonymous March 29, 2010 at 10:20 PM  

what they fight with is "desire"(not lust) and disillusionment etc..
manaku teleeni vishayaalapai kaasta telusukonnaake comment cheyadam mancidi.

శ్రీవాసుకి March 30, 2010 at 1:05 AM  

దుర్గేశ్వర్ గారు మీ బ్లాగ్ బాగుంది. ఆధ్యాత్మిక, లౌకిక విషయాలను బాగా వ్రాస్తున్నారు. ఈరోజు తీరిక చేసుకొని చాలా వరకు టపాలు చదవగలిగాను. ముందు మరిన్ని విషయాలతో మాకు మంచి టపాలు అందించగలరని ఆశిస్తూ....శ్రీవాసుకి

Anonymous March 30, 2010 at 1:25 AM  

I don't agree with you.

Overcoming desires is for starters, a sanyaasi's only desire is mukti, he won't FIGHT for it... though he works for it. I mean 'fight' is a not right word to be used with Sanyasi, though R.K.Paramahamsa is quoted - in my opinion.
Anonymous2, అన్నీ తెలిసుకుంటేనే కామెంట్ చేయాలా? ఇక్కడ అలాంటి నిభంధనలున్నాయని నాకు తెలియదు, ఐతే ఈ అజ్ఞానిని క్షమించలేరూ?
మీకు అంతా తెలుసా? నాకు ఏమీ తెలియదని కూడా మీకు తెలుసా?! సన్యాసం చేసి, తెలుసుకుని కామెంట్ రాస్తున్నారా? అన్నీ తెలిసాక ఇక్కడ కామెంట్ చేయాల్సిన అవసరం వుంటుందంటారా?
(ఐ.పి అడ్రస్ తో పాడె కడతామని ఇక్కడ కొందరు ఆకు రౌడీలు బెదరిస్తున్నారు , దయచేసి నా ఆన్లైన్ పాడె కట్టకండి అనానిమస్ గారు. ఏదో బుద్ధి గడ్డితిని కామెంటాను, ఇంత మహాపరాధము చేస్తున్నానని తెలియదు :(( )
You may be really great, I don't know.

durgeswara March 30, 2010 at 2:09 AM  

మితృలందరికీ నమస్కారం.

నాకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అంతగా లేకపోవటం వలన ఇంగ్లీష్ లో వున్న కామెంట్లలో అంతరార్ధం సరిగా అవగహన్ కావటం లేదు. కానీ ఏదో ఆవేశపూరిత వాతావరణం నెలకొందని అనుమానం.

ఇది మన ధర్మం పట్ల ,సంస్కృతి పట్ల అవగాహన కల్పించే చర్చలను ఆహ్వానిస్తూ నడపబడుతున్న బ్లాగు. అంతామనమే .అందరూ మనవారే . అవగాహన అమ్దరికీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. దయచేసి ఒకరి అనుమానాలను మరొకరం నివృత్తి చేసుకుందాం . ప్రపంచాన గౌరవింపబడుతున్న మన సమ్స్కృతిని కొనసాగేలా ప్రయత్నాలుచేద్దాం అన్నిచోట్లా. దయచేసి నావిన్నపం మన్నించాలి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP