అందరివీ రిక్త హస్తాలే !
>> Sunday, March 28, 2010
ఒకనాడు ఒక రాజుగారు తన సభ నుద్దేశించి ఇలా అన్నాడు" ఈ రోజు మీకు చిన్న సమస్య ఇస్తాను దీనిని పరిష్కరించినవారికి లక్షరూపాయలు. " అన్నాడు. వెంటనే సభలో నుంచి ఒక పెద్దపండితులవారు లేచి ,నిలబడి మహాప్రభో ! ధనం అవసరం నాకు ఎక్కువగా ఉన్నది. అమ్మాయి పెండ్లిచేయాలి కాబట్టి ఆ అవకాశాన్ని ముందు నాకే ఇప్పించండి అన్నాడు. ఇతర పండితులంతా ఇతను చాలా తెలివైనవాడుగనుక బహుమతి అతనికే దక్కుతుందని తీర్మానించుకుని వేడుకచూస్తున్నారు.
అయితే నేను వేసే ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు రాజు. అలాగేనన్నాడు పండితుడు. ప్రశ్నవేస్తానన్నాడేగాని ఏమడగాలో తోచలేదు రాజుకు. ఆయన ఆలోచిస్తుండగానే అగలేని పండితుడు అసహనం తో " మహాప్రభో ! నా లక్షరూపాయలు నాకిప్పించండి అంటూ రెండూచేతులూ యాచకునిలా ముందుకు చాచాడు. ఆచేతులు చూసిన రాజుగారికి మెరుపులా ఒక ఆలోచనవచ్చింది. "అ ఇదిగో అడుగుతున్నాను .మనదేహం లో ఎక్కడచూసినా రోమాలున్నయికదా ! మరి నీ అరచేతిలోలేవెందుకని ? అని అడిగాడు. పండితుడు చాలాగట్టివాడు. పైగా లక్షరూపాయలమీద ఆశ. ఒక్క క్షణం ఆలోచించి మహా ప్రభో ! ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు . నేనెప్పుడు దానాలు తీసుకునే వాణ్నిగనుక అలా దానాలు తీసుకుని తీసుకుని నా అరచేతులలో వెంట్రుకలు లేకుండాపోయాయి అన్నాడు. చప్పట్లు మార్మోగాయి .
కానీ రాజుగారు అంతటితో ఆగకుండా "బాగానే ఉంది మరి నాచేతిలో వెంట్రుకలు లేవెందుకని అని అడిగాడు. అందరూ సమాధానం కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.పండితుడేమీ సామాన్యుడుకాడు , అయ్యా !మీకు దానాలుచేసే అలవాటువల్ల, దానాలు చేసీ చేసీ దానివలన మీ అరచేతిలో వెంట్రుకలు లేకుండాపోయాయి అన్నాడు
పరిపాలించేవాల్లేమైనా చిన్నవాల్లా ? కాబట్టి రాజుగారు కూడా ఏమాత్రం తగ్గకుండా , దానాలు చేసీ్చేసీ నాకు,దానాలు తీసుకుని ,తీసుకుని నీకు అరచేతులలో రోమాలు లేవు సరే ! మరి ఈసభలో ఇంతమంది ఉన్నారు వీరందరికీ లేవు కదా ఎందుకని ?అన్నాడు రాజు.
అప్పుడు పండితుడు మహాప్రభో ! దానాలు తీసుకుని తీసుకుని నాకు లేకుండాపోయాయి. దానాలు చేసీచేసీ
మీకు లేకుండాపోయాయి .మనిద్దరినీ చూసి అదీ ఇదీ ఏదీ చేయలేకపోతున్నామే అని, చేతులు నలుపుకుని నలుపుకుని వీళ్లందరికీ అరచేతులలో రోమాలు లేకుండాపోయాయి అని అన్నాడట.
6 వ్యాఖ్యలు:
చాలా సంవత్సరాల క్రితం నేను దీనిని చదివాను. మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదములు.
హి హి హి. బావుంది
:-)
బావుంది.
chala bagumdi good one
చాలా బావుంది.
Post a Comment