అమ్మకు మీ తరపున వైభవంగా జరిగిన "సహస్ర కమాలార్చన" సేవ
>> Tuesday, March 16, 2010
కొత్తసంవత్సరం ప్రారంభమైన ఈరోజు అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకు పీఠములో "సహస్ర కమలార్చన" అత్యంత భక్తిశ్రద్దలతో నిరవహించబడినది. తెల్లవారుఝామున నాలుగుగంటలనుంచి అభిషేకాదులు పూర్తిచేసి ఆరుగంటలకల్లా చెరువులోకి వెళితే పదిగంటలయింది, వేయిపూలు కోసుకుని చెరువులోంచి బయటకు వచ్చేసరికి. అమ్మ ఎవరిచేత ఏసేవచేపించుకుంటుందో తెలియదు ,అనుకోకుండా శుక్రవారం అమ్మ వారికి ఒక చీరపంపిస్తాను మాతరపున ధరింపజేస్తారా అని హైదరాబాద్ నుంచి విజయజ్యోతిశ్రీనివాస్ గారి ధర్మపత్ని లక్ష్మీసుజాతగారు ఫోన్ చేసి అడగగానే అమ్మసంకల్పంగాభావించి సరేనమ్మా పంపమన్నాము .వారుపంపింన నూతనవస్త్రాలను అమ్మవారికి ధరింపజేసాము . శ్రీవేంకటేశ్వర స్వామివారికి పీఠం తరపున వస్త్రాలు సమర్పించాము.. పాపం ఏపండగైనా సరే ఏనాడూ నాకిది కావాలి,అని అడగని అమాయకస్వామి శివయ్య మాత్రం జలాభిషేకంతోనే సంతోషించి ఆనందపడిపోయాడు .. తదనంతరం భక్తులందరి గోత్రనామాలను అమ్మవారికి నివేదించి వారందరి తరపున అమ్మవారికి పాదపద్మాల కు సహస్రకమలాలతో అర్చన జరుపబడినది.. అమ్మ పాద పద్మాల శోభ కు మేము వెలవెల బోతిమే ! అని చిన్నబుచ్చుకున్నా ,ఏజన్మలో పుణ్యమో ఇలా తల్లిపదములు చేరే భాగ్యందక్కినదికదా ! అని కలువలు మురిసిపోయాయి. ఆపూలలతో కలిసిన మన భక్తిభావతరంగాలు కూడా అమ్మపాదాలనుచేరి మన వేదనలను తల్లికి తెలియజేసాయి . ఇలా అనుకోకుండా కార్యక్రమాలను నిర్ణయించి జరిపించడం అమ్మకొక క్రీడ . అసలు వేయి కలువలు సేకరించగలమా అనే అనుమానం కూడా మనసులో మెదిలి భయపెట్టినదిమధ్యలో . కలువలుబాగా పూసే కాలం కాదు ఇది. అంతపెద్ద చెరువుమీద బరువైన పడవను తిప్పుతూ మూడుగంటలసేపు మంచినీరుకూడా తాగలేదండి కల్లుతిరుగుతున్నాయని చెబుతూనే కలువలు సేకరించేందుకు గడవేస్తూ పడవను నడిపిన నూజండ్లకుచెందిన నా పూర్వ విద్యార్ధి చిరంజీవి నాగరాజు కు ఈకార్యక్రమం లో వచ్చే పుణ్యం లో సింహభాగం దక్కాలి. అమ్మవారికిప్రీతి పాత్రమైన ఈసేవ కోసం వెచ్చించిన సమయమే నిజంగా సద్వినియోగమైన సమయమనే విషయాన్ని నమ్మకం కలిగేలా నేను వివరిస్తూ వానికి సహాయ పడుతూ ఉండగా తొమ్మిదవతరగతి విద్యార్థులు చిరంజీవి గుణశేఖర్ ,శివాజీనాయక్ లు పూలు కోస్తూ గంపలకు పేర్చారు . మనం వేయిరూపాయలు వెచ్చించి పూలుకొనవచ్చు కానీ అవకాశమున్నప్పుడు మనం స్వంతగా శ్రమించి భగవంతునికి చేసే సేవకు సాటిరాదు మరేదీ. కనుకనే మనం చెమటోడ్చి సేవచేయాలి అది హనుమత్ స్వామి మనకు నేర్పుతున్న పాఠం అని వివరించింది నాగొంతు , మాపిల్లలకు ... కానీ ఆపాఠం నాలో నుండి నాకే ఎవరో బోధిస్తున్నట్లుగా అర్ధమయింది ఆక్షణాన . మీగోత్రనామాలతో అమ్మకు పూజచేస్తాను అని చెప్పగానే నమ్మి నాకు తమ గోత్రనామాలు పంపిన వారందరికీ నాబాధ్యతను నేను నెరవేర్చానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను .
చిత్రామాలికను ఇక్కడ చూడండి
http://picasaweb.google.com/durgeswara/Sahasrakamalarchana
5 వ్యాఖ్యలు:
మీరు అమ్మలగన్న యమ్మకు చేసిన సేవ పరిమిత సమయ పరిధి కలది. మీరు చేసిన పూజను గూర్చి వ్రాసిన విధానం అత్యంత ముదావహమైనది. అనమ్తమైన ఆనంద డోలికలలో మనసు ఊగులాడుతు అపరిమిత సమయం ఆ మధురానుభూతిలో తేలజేసేదిగా ఉంది.అది మీ కెలాగుందో కాని మాకు మాత్రం మీరు చెసిన కైంకర్యం చదివుతున్నంత సేపూ అక్కడ మేమే ఉన్నట్టూ; ఆ పూజ మేమే చేస్తున్నట్టూ; ఆ పరవసించే పూవులు మేమే అన్నట్టూ; ఒక అలౌకికానంద పారవ్శ్యంలో తేలిపోతున్నామంటే అతిశయోక్తి కాదండి.
పరమ నాస్తికులైనా సరే మీ కైంకర్యమ్ తెలుసుకొని; మీ దివ్యానుభూతిని మనసు పెట్టి ఆలో చిస్తే మాత్రం తప్పక ఆస్తికుడవడమే కాదు. ఆ పరమాత్మ సేవలో మునిగిపోతాడనేమాట ఖాయం.
ఆ పరమాత్మ; ఆ జగదంబ మీకు పరిపూర్ణ ఆయురారోగ్యాలనిచ్చి; మీ నిరంతర సేవలు స్వీకరిస్తూ; భక్త జనుల బాధలను పోకార్పుతూ; జగత్కల్యానప్రదంగా వర్ధిల్లాలని నా ఆకాఆంక్ష.
జై జగన్మాతా! జైహింద్.
ధన్యులం దుర్గేశ్వర గారూ
చాయాచిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. కలువపూలు కన్నుల పండుగ చేశాయి. మీ భక్తికి జోహార్లు.
మాస్టారు గారు, గురుదేవులు, చింతా వారి మాటే నా మాట కూడా. ఏదో తెలియని గగుర్పాటు. ఈ పూజకు ఫలితం తప్పక ఉంటుంది.
ఎన్నిజన్మల పుణ్యాల ఫలమో .... అటు అమ్మను సేవించుకునే అవకాశం . ఇటు మీవంటి సజ్జనుల సాంగత్యం లభించటం నాకు .
Post a Comment