శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దైవ దర్శనానికి ఇలావెల్లటమంటే దరిద్రాన్ని కొనితెచ్చుకోవటమే .

>> Saturday, July 18, 2009




ఈమధ్యకాలం లో దైవదర్శనమునకు వెళ్ళే పెద్దలవల్ల సామాన్యభక్తులకు కలుగుతున్న ఇబ్బందులు వార్తలలో ప్రముఖముగా చోటు చేసుకుంటున్నాయి.దైవదర్శనానికెల్లే భక్తులు పాటించవలసిన విధులు వుల్లంఘించి వాల్లు ఇతరులకు ఇబ్బంది కలిగించి తమ శ్రేయస్సును తామే చెరుపుకుంటున్నవారవుతున్నారు. దోషపరిహార్ధం ఆలయము లో దైవదర్శనానికని వెళ్ళి అక్కడ తాము చేసే దోషాలమూలం గా ఇతరుల దోషాలను తలకెత్తుకుంటున్నారన్నా విషయం గమనించుకోవటంలేదు .


దైవాన్ని దర్శించటానికి వెల్లేవాళ్ళు ఎంతో వినయ విధేయ తలతో ,నిగర్వంగా వెల్లాలి ఆలయానికి. అక్కడ ఎంత శ్రమతో దైవదర్శనం చేసుకుంటే అంత కర్మ క్షయమయ్యి శుభాలు ప్రాప్తిస్తాయి. కానీ ఈమధ్యకాలం,లో తమ అధికారం .డబ్బు ,హోదా పలుకుబడులను ఉపయోగించి వక్రమార్గం లో దైవదర్శనాని కెల్లటం గొప్పగా భావించి ,ఆమార్గాలకై ప్రయత్నిస్తున్నారు. కాని దానివలన ఫలితాలు తారుమారుగా వస్తాయనే విషయం గ్రహించటం లేదు. .

యాచనకై మనింటి కొచ్చినవాడు వద్దికగా అమ్మా! అయ్యా !అని గుమ్మం ముందునుంచి వచ్చి యాచిస్తే అతనికి ఏదో ఒకటి దక్కుతుంది . అంతేగాని వాడు అడ్డదారి లో గోడదూకి వచ్చి నాకు వాల్లుతెలుసు ,వీల్లు తెలుసు ధర్మం త్వరగా చేయండి అని అంటే యజమానికి వళ్ళుమండుద్ది . దాంతో నాలుగు తగిలించే అవకాశం కూడా వుంది.భగవంతుని దగ్గరకు వెళ్ళటమంటే ఆయన దగ్గరకు యాచనకు వెళ్ళె స్తాయి మనది. మరక్కడ సాటివారిని నెట్టుకునో సాటివారి వరుసను బలవంతం గా ఆక్రమించో ముందు ఆయన దగ్గరకెళ్ళీనా సర్వాంతర్యామి అయిన ఆయనకు తెలియదా ? మహామాయకు అధినాయకుడైన ఆయనను మనం మోసం చేయగలమా? అది ఆయన ఆగ్రహానికి కారణం కావచ్చు కదా?

ఈమధ్య విజయవాడ దుర్గగుడికి మన డిజీపీ గారు వచ్చిన సందర్భంగా భక్తులకు కలిగిన ఇబ్బంది దానికి కారణమైన వారికి దోషం గా సంక్రమిస్తుంది. భక్తులను ఖైదీల్లాగా క్యూలైన్లకు తాళం వేసి నిలబెట్టారట. అందులో వున్న భక్తులు ఎంతగా బాధపడి ఈ అధికారాన్ని శపించివుంటారో తెలుసా ? అందులో వున్న సాధకులు,పరమభక్తులకు కలిగిన బాధ ఎలాంటి దుష్ఫలితాలు కలిగిస్తుందో కదా! క్రింద వుద్యోగస్తులు చేసినా ఆ తప్పుకు పై అధికారిదే బాధ్యత .భక్త జన రక్షణకై అవతరించిన ఆ పరాశక్తి ముందు భక్తులకు జరిగిన అపచారానికి ఆతల్లి ఎంత ఆగ్రహిస్తుందో కదా ?
ఒకవేళ పదిమందికి సంబంధించిన బాధ్యతలను నిర్వహించవలసిన వ్యక్తి కదా వాల్ల సమయము విలువైనది అనుకుంటే అప్పుడు ప్రత్యేకదర్శన మార్గాఅలున్నాయి కనుక వాని ద్వారా వీలైనంత త్వరగా ఇతరులకు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్ళాలి . అంతేగాని పుణ్యక్షేత్రమేదో మన ఇష్టారాజ్యమని భావించటం ,అక్కడి అధికారులు కూడా భక్తుల సేవకు కాకుండా ఈ అధికారానికి సేవలందించే దుస్థితి ఆలయాలలో నెలకొనివుంది .సరే ! ఇదెవరో నిరోధించేదాకా ఎదురు చూడటం తప్ప భక్తజనులకు సరి చేసుకోవాలనే ఆసక్తి లేదు. . వీళ్ల సంగతి అలావున్నా భక్తి కలిగి వున్న అధికారులు నాయకమ్మణ్యులు తమ క్షేమము కోసమైనా ఈ చర్యలవల్ల జరిగే అనర్ధాలు తమకు ముప్పుగా పరిణమించకుండా చూసుకోవాల్సివుంది.

2 వ్యాఖ్యలు:

నీహారిక July 18, 2009 at 4:13 AM  

మీరు పెట్టిన వెంకటేశ్వరస్వామి ఫోటో చాలా బాగుంది.వారిని చూడడానికి ఇక్కడికి రావాలనిపిస్తుంది.మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటున్నాయి.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ July 18, 2009 at 9:41 PM  

చాలా మంచి విషయం చెప్పారు గురువు గారూ.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP