శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తల్లులూ ! సంవత్సరమంతా శుభాలకోసం రక్తసంబంధీకులను ఇలాగౌరవించిచూడండి.

>> Thursday, July 16, 2009


ప్రతి సంవత్సరం రక్త సంబంధీకులలో ఒకరికైనా క్రింది తిథులలో పిలిచి భోజనం పెట్టటం వలన ఆరోగ్యము ,ఉల్లాసము,ఆనందము,శుభాలు కలుగుతాయి.

౧. అన్నాచెల్లెళ్ళు ,అక్కాతమ్ముల్లు కలవారు చేయవలసినది . ఆడవాళ్ళు తమ అన్నలను ,తమ్ముల్లను దీపావళి వెళ్ళిన రెండవరోజు అంటే కార్తీక విదియ రోజున తమ ఇంటికి పిలచి భోజనం పెట్టాలి .దీనినే భగినీ హస్తభోజనమనే పండుగగా జరుపుకుంటారు. దానివలన శుభాలు ప్రాప్తిస్తాయి . ముత్తైదువులైన తమ సోదరికి సోదరులు పసుపుకుంకుమ నూతన వస్త్రాలు కానుకగాఇవ్వాలి. భర్తలేని స్త్రీలకు చీర జాకెట్టు పండ్లుమాత్రమే ఇవ్వాలి. అయితే సోదరినుండి ఎదురు కానుకగా ఏదీ స్వీకరించకూడదు ఆరోజు .అలా తీసుకుంటే అన్నాదమ్ముల్లకు శుభాలు కనిపించవు.

౨. వైశాఖ ద్వాదశి రోజున స్త్రీలు వారి మేనమామను పిలచి భోజనం పెట్టుట మంగళకరం గావుండును .మేనమామలు ఇచ్చే పసుపుకుంకాల ఫలితంగా వారి జీవితం లో సౌఖ్యాలు అనుభవిస్తారు. అయితే మేనమామ తిరిగి బట్టలు స్వీకరించరాదు.

౩.కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని చూచి కుటుంబము లోనివారు వారి తల్లిదండ్రుల పాదాలుతాకి నమస్కరించుకోవాలి ..వారు స్వర్గస్తులైయుంటే వారి ఫోటోలకు నమస్కరించు కోవాలి.

౪ శ్రీరామ నవమి మరునాడు దశమి రోజున భర్తలు వారి భార్యలకు బంగారు ఆభరణం గాని ,వెండి ఆభరణం గానీ తప్పనిసరిగా ఇవ్వాలి.వారి శక్తి కొలది మెట్టెలు గాని ,లేక బంగారు రూపు [సూత్రం లోకి] .శక్తి వున్నవారు ఆభరణాలు చేపించవచ్చు. వెండి కుంకుమ భరిణలలాంటివైనా సరే ఇవ్వవచ్చు. సంవత్సరమంతా డబ్బుకు లోటుండదు.

౫. ఆషాఢ మాసం లో [ఈనెలలో] స్త్రీలు భర్తలకు ఏ బుధవారమైనా సరే తలస్నానం చేపించి ముందుగా తాము తయారు చేసిన తీపిని తినిపించాలి.ఆసంవత్సరమంతా శుభాలకు తిరుగులేదు.

౬. శ్రావణ మాసం లో స్త్రీలు మంగళవారం గాని ,శుక్రవారం గాని తమ అక్కచెళ్ళెల్లకు పసుపుకుంకాలు సమర్పించుకుంటే సౌభాగ్యవతిగా వర్ధిల్లగలరు.

౭.వినాయక చవితిమరుసటినాడు వచ్చే పంచమి రోజున బావమరుదులకు రెండు నాణెములు బంగారము ,లేదా వెండివి ఇస్తే ఆసంవత్సర కాలములో రెండు చిక్కు సమస్యలు తీరి పోతాయి.

౮ .హనుమజ్జయంతి రోజున విద్యార్ధులు వారి ఉపాధ్యాయులకు పండ్లు సమర్పించి నమస్కరిస్తే ఆసంవత్సరం లో పరీక్షలలో విజయంలభిస్తుంది.

౯. స్త్రీలు జ్యేష్ట మాసం లో వేరే స్త్రీ [బంధువుకాదు] కి గురువారం రోజు పిలచి భోజనమిడితే ఆసంవత్సరములో శుభకార్యక్రమములు,దైవదర్శనములు గురు దర్శనములాంటి శుభాలు ప్రాప్తిస్తాయి.

౧౦ పాదరక్షలు గురువారం కొనటం చాలామంచిది అంటారు .





2 వ్యాఖ్యలు:

sirisha July 17, 2009 at 12:10 AM  

చల మంచి విసయలు చెపరు. నకు ఒక సన్దెహమ్ తిర్చంది.
నకు మంగలసుత్రం ఒకతి మధ్యలొ చిలికగ ఎర్పది చిన్న రన్ద్రమ్ పదింది. అది పెల్లి అయినకొత్తలొనె అయ్యింది. మా అమ్మతొ చెపితె శాపులొ అది పదెసి కొత్తది తిసుకుని వెసుకొ అంది. నకు మనసు ఒపక పదెల్లుగా అదె ధరించుతున్నను. పెల్లిలొ వెదమన్త్రలలొ కత్తింది తిసివెయలెక పొతున్న, కని ఇల విరిగిన మంగల సుత్రం అశుభమా? నెను దని ఎల మర్చుకొవలి? దయచెసి చెపంది.

madhavarao.pabbaraju July 18, 2009 at 11:57 PM  

శిరీషగారికి, నమస్కారములు.

చీలికబడిన, చిన్న చిల్లిబడిన మంగళసూత్రం మీరు గత పది సంవత్సరములనుంచి వాడుతున్నామన్నారు. మరి మీకు అప్పటనుంచి ఎటువంటి అశుభములు కలుగలేదుకదా? ఒకవేళ ఏమిజరుగలేదు అంటే, ఆ మంగళసూత్రం వలన ఎటువంటి నష్టం మీకు లేదు.ఎంతోమంది పెద్దల ఆశ్వీర్వాదములు మీకు వున్నట్లేగదా!! మంగళసూత్రం కంటే, మంగళకరమైన మనసు, హౄదయం కలిగివుండటం ముఖ్యం. సదా మీకు శుభములు కలగాలని కోరుకుంటూ,

భవదీయుడు,
మాధవరావు.

గమనిక:- మీరు టైపు చేసిన తెలుగులొ చాలా తప్పులు వున్నాయి. సరిచూడండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP