నీకు గుర్తున్నా !గుర్తు లేకున్నా ! మేలే చేస్తుంది.
>> Saturday, May 2, 2009
అయ్యవారు ప్రతిరోజూ ఆలయం లో సత్సంగము చేస్తున్నారు. పురాణాదులనుండి ధర్మ సూక్ష్మాలను వివరిస్తున్నారు చక్కగా.ప్రతిరోజూవింటున్నా మనసుకేమీ ఎక్కని ,ఈ కార్యక్రమమంటె అంతగా ఆసక్తి లేని వెంకటరెడ్డిగారికి ఆవలింతలు వస్తున్నాయేతప్ప ఏమీ ఆసక్తి కలగటం లేదు. అందుకని ఒక రోజు బయటపడి అడిగేశాడు.
ఏమి స్వామీ ! మీరురోజూచెప్పటమేగాని నాకు ఒక్కముక్కా గుర్తుండటం లేదు.ఎందుకొచ్చిన దండగమారిపని ఇది.చెప్పిన మీకు విన్ననాకు ఏమీ ఉపయోగమున్నదనుకోను అన్నాడు.
అయ్యవారు చిన్నగా నవ్వాడు.
"లేదు రెడ్డీ! తప్పనిసరిగా ఉపయోగమే"
"ఎలా మీరు చెప్పేది నాకు ఒక్కముక్కా గుర్తుండనప్పుడు నాకేమి ఉపయోగము"?
అయ్యవారు అడుగుతున్నాడు
నిన్న మీ ఇంట్లో ఏమి కూర చేసారు?
"చారు"
మొన్న?
దోసకాయ కూర
అటు మొన్న?
"గుర్తు లేదు."
అంతకు ముందు రోజు?
అబ్బే అసలు గుర్తు లేదు.
ఆముందురోజు ?
"నాకు ఆసలు గుర్తుకు రావటము లేదు"
ఇంకాముందు ?
అబ్బే !గుర్తుండే సమస్యే లేదు. జవాబిచ్చాడు వెంకటరెడ్డి.
అయ్యవారు వివరిస్తున్నాడు"రెడ్డీ నీకు ఇంట్లో తిన్నకూరే గుర్తు లేదు.అంతమాత్రాన తిన్న కూర వృధాఅయినట్లా ? కాదుకదా .నీకు గుర్తున్నా గుర్తు లేకున్నా ఆ ఆహారం నీ శరీరానికెలా మేలు చేసినదో !అలానే గుర్తున్నా గుర్తు లేకున్నా ఈ భగవద్విషయాలు,కథల శ్రవణము నీకు మేలే చేస్తుంది,వృధాకాదు .
చేతులు జోడించాడు శ్రోత.
3 వ్యాఖ్యలు:
Excellent story.
చాలా చక్కని విషయం చెప్పారు.
బాగుందండి
Post a Comment