ఒక్కొక్క దోహా ఒక్కొక్క కార్యాన్ని సాధిస్తుంది
>> Tuesday, March 17, 2009
హనుమాన్ చాలీసాలో రహస్యాలు.
మహాభక్తుడైన గోస్వామి తులసీదాస్ గారి తపోఫలం గా మానవజాతికందిన చాలీసా లో చాలా రహస్యాలు దాగున్నాయి. ఇందులో ప్రతి దోహా ఒక సంపుటీ కరణ మంత్రము అనవచ్చు. నిష్టతో జపిస్తే ఒక్కొక్కదోహా ఒకప్రత్యేక కార్యములను సాధించి పెట్టటము ,అనుభవపూర్వకంగా, ప్రయోగాత్మకంగానూ చూసి నిరూపించుకున్నాము.ఈమేలు అందరికీ కలిగేందుకై ఆరహస్యాలను మీకు అందజేసుకుంటున్నాము.
1. శ్రీగురుచరణ రజ నిజమన ముకుర సుధారీ
వరుణౌ రఘువర విమల జోయశదాయక ఫలచారీ
[ మనో మాలిన్యలను తొలగించి ,బుద్ధిని పరిశుద్ధ మార్గం లో నడపటానికి ఈచరణాలను పదే పదే పఠించాలి.]
2. బుద్ధి హీన తనుజానికై సుమిరౌ పవన కుమార్
బలబుద్ధి విద్యాదేహు మొహి హరహు కలేశవికార్
[ ఈశ్లోకం లోని ఈచరణాన్ని పదే పదే ధ్యానించటమ్ వలన ,మనస్సు ఏకాగ్రత పెరుగుతుంది.విశేషించి చదువులో వెనుక బడ్డ పిల్లలకు చలా చక్కని ఫలితాలనిస్తుంది. మేము మాపాఠశాలలో ప్రయోగాత్మకంగా చేసి చూశాము.అద్భుత ఫలితాలను.]
3. జయహనుమాన...అనేమొదటి దోహానుండి విద్యావానగుణీఅతి చాతుర అనేదోహావరకు హనుమంతుని పొగుడుతున్నాయి కనుక ఈదోహాలమననం పొగిడితే పెరిగే ఆస్వామికి మనలను ఇష్టులను చేస్తాయి
4. సూక్ష్మరూపధరి సియహిదిఖావా,వికటరూపధరి లంక జరావా
భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే
{ ఈ దోహా ను జపించటము వలనా అణిమాది సిద్దులు ప్రాప్తిస్తాయని పెద్దల మాట]
5. లాయ సంజీవన లఖన జియాయే...... వద్దనుండి యమకుబేర ....దోహావరకు మిత్రత్వాలను వృద్ది చేసి మనకు గౌరవాభిమానాలను తెచ్చి పెడుతుంది.
6. తుమ్హరె మంత్ర విభీషణమానా లంకేశ్వరభయె సబజగజానా
-యుగసహస్రయోజనపరభానూ,లీల్యోత్సాహి మధురఫలజానూ
[ఈ దోహాను పఠించటము వలన అధికార ప్రాప్తి ప్రమోషన్లు రావటము ,వాటికున్న అడ్డంకులు తొలగటము జరుగుతాయి]
7.ప్రభుముద్రికా మేలి ముఖమాహి
జలధిలాంఘిగయె అసురజనాహి
దుర్గమ కాజ జగతకెజేతె సుగమ అనుగ్రహ తుమహరె తేతె.
[ చాలా కష్ట సాధ్యమయిన కార్యక్రమముల సాధనలో ఈ దోహా శక్తివంతముగా ఫలితమిస్తుంది.]
8.రామదుఆరే తుమరఖవారే హోతవ ఆజ్ఞ బినుపైఠారే
సబసుఖలహఇ తుమ్హారీ శరణా శరణా తుమరక్షక కాహూకోడరణా
[భయాలను తీర్చి,రామాను గ్రహాన్ని కలుగజేస్తుందీ దోహా]
9.ఆపన తేజ సంమ్హారో ఆపై తీనోలోక హాంకతె కాంపై
భూతపిశాచ నికటినహి ఆ వై మహావీర జబనామ సునావై.
[ భూత ప్రేతాది దుష్టశక్తులను అవిపెట్టే బాధలను ధ్వంసము చేస్తుందీ దోహా]
10. నాసై రోగ హరై సబపీరా-జపతనిరంతర హనుమత వీరా
[రోగాలనుండి రక్షించటములో నూ రోగాలను తగ్గించటము లోనూ ఈదోహా సంజీవనిలా పనిచేస్తుంది]
11.సబపర రామ తప్పస్వీరాజా...వద్దనుండి అష్ట సిద్ది నవనిధికేదాతా
[ తాపసుల తపస్సులకు సిద్ధినిస్తుంది]
12. తుమహరె భజన రామకొభావై జన్మజన్మకె దు:ఖబిసరావై
అంతకాల రఘుపతి పురజాయీ ,జహాజన్మి హరి భక్తకహాయీ
[ఈదోహా వలన జన్మ జన్మల చెడుకర్మలు నశించి రామ సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.]
13ఔరదేవతా చిత్తనధరయీ...............
[ఈదోహా పఠనము సంకటాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తుంది.]
14. జైజైజై హనుమాన గోసాయీ .కృపాకరో గురుదేవకి నాయీ
{ ఈదోహాను స్మరిస్తుంటే హనుమంతులవారే గురు స్థానములో కూర్చుని మనలను దరిచేరుస్తారు.]
15. జోయహ పఢై హనుమాన చాలీసా నుండి ఫలశ్రుతి లోని పవన తనయ సంకట హరణ వరకు సీతారాములనుహృదయాన నిలుపుకున్న హనుమంతుని కృప మనమీదెప్పుడూ ప్రసరింపజేస్తూ వుంటూంది.]
0 వ్యాఖ్యలు:
Post a Comment