శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమంతుని ఉపాసన లోప్రత్యేకతేమిటి ?

>> Monday, March 16, 2009


హనుమంతుని ఉపాసన లోప్రత్యేకతేమిటి
--------------------------

బ్రహ్మయే స్వయంగా హనుమంతుని సర్వదేవాంశ సంభూతునిగా సర్వదేవమయునిగా చెప్పి అతనిని పూజించుటచే దేవతలందరూ పూజించినట్లేయనుచు,రాక్షస నివారణకై గ్రామగ్రామములందు హనుమదాలయములు ఏర్పడునని పలికెను.

నామ మహిమ:- బుద్ధి,బలము,కీర్తి,ధైర్యము,నిర్భయత్వము,అరోగత,జాఢ్యములు తొలగుట,వాక్పటుత్వము ,మున్నగునవన్నియు హనుమన్నామస్మరణము వలన కలుగును.
శుభాశుభములన్నింటియందున పవిత్రమగు హనుమన్నామమును భక్తి తత్పరులై పండ్రెండు మారులు తలచిన కార్య సిద్ధియగునని పరాశర మహర్షి చెప్పారు.

హనుమ వాగ్దానము.
-----------

శ్లో// ఐహికేషు చ కార్యేషు -మహాపత్సు చ సర్వదా

నైవ యోజ్యో రామ మంత్ర: కేవల్కం మోక్షసాధక:

ఐహిక సమనుప్రాప్తే మాం స్మరే ద్రామ సేవకం//

అని హనుమంతుడు తానుగా రామ రహస్యోపనిషత్ లో చెప్పి యున్నాడు.వరమెట్లున్ననుఐహికజీవితము ముందు చూచుకొనవలెను కదాయని కలియుగమున కష్టకాలమున ప్రతివారూ కార్యసాధనకోరుకుందురు అట్టివి తననాశ్రయించినచో తానే నెరవేర్తునని హనుమంతుడే చెప్పుకున్నాడు.ఆయన అనుగ్రహమునకు పాత్రులగుటకు ప్రయత్నముచేయుటయే మనవంతు.

ఐహిక ఆముష్మిక విషయాలలో శుభప్రాప్తికి హనుమంతుని ఆశ్రయించటముచాలా తెలివైన పని. ఆయన ధ్యానం సకల ప్రమాదాలనుండి నిస్సంశయంగా కాపాడుతుంది మనలను.

2 వ్యాఖ్యలు:

పరిమళం March 16, 2009 at 8:41 PM  

ధన్యవాదాలండీ !

మనోహర్ చెనికల March 16, 2009 at 11:13 PM  

బుద్ధిర్బలం యశోధైర్యం, .....

నిజం చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP