శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వరాహం ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నట్లు? దానికి పూజలు చేయటం ఎంతవరకు సబబు?

>> Thursday, January 1, 2009

ఈమధ్య కాలములో ఒక విచిత్రాన్ని మనమందరం చూస్తున్నాము.ఒక వరాహం ఆలయ ధ్వజస్థంభం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న విషయం అందరికి తెలిసినదే.కలియుగాన మానవులకు దైవ లీలలను గుర్తుచేసే ఇటువంటి సన్ని వేశాలు అప్పుడప్పుడు ఇలా హెచ్చరిస్తూనే ఉంటుంటాయి. సరే నాస్తికులను వదలి వేసినా ఆస్తికుల గుర్తిస్తున్నారు భగవంతుడున్నాడని. ఐతే శాస్త్రీయ విజ్ఞానాన్ని పక్కనబెట్టి ఆ వరాహాన్ని పూజిస్తున్న విషయమే నాకు మింగుడు పడని అంశముగా నున్నది. అసలు ఆజీవి ఆవిధముగా ఎందుకు ప్రవర్తిస్తున్నదో కొద్దిగా మన మహర్షులిచ్చిన శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆలోచిద్దాము.

అనేక జన్మలలో చేసిన పుణ్యఫలితముగా మానవ జన్మ కలుగుతుందని చెబుతాయి శాస్త్రాలు. ఇంత పవిత్రమయిన మానవజన్మనెత్తనా, సవ్యమయిన జీవిన విధానము గడపలేక పోయిన మానవుడు చేసిన దుష్కర్మల ప్రభావాన్ననుసరించి బాధాకరమయిన జీవితాన్నిగడిపేవారు మరలా మానవజన్మ లేక,రకరకాలైన జంతుజన్మలను ఎత్తవలసి వస్తున్నది. ఈ జీవితచక్రపరిభ్రమణములో విలవిల లాడుతున్నా అసలు సంగతి తెలీయనంత మాయ మనలనుకమ్మి మరికొంత చెడుఫలితాలకు లోనయి మరింకా నీచపు జన్మలను ఎత్తవలసి వస్తున్నది. ఐతే ఏ పుణ్యరాసి ఫలితమో ,లేక ఏమహాత్ముని అనుగ్రహమో ,లేక దైవ సంకల్పమో కాస్త ప్రసరించినప్పుడు,ప్రతి జీవికి పూర్వ జన్మజ్ఞానం కలుగుతుంది. [ఇది వున్నదా లేదా అని ప్రశ్నలు వద్దు ఎందు కంటే ,మనకు పుట్టినప్పటి నుంచి జరిగిన అన్ని విషయాలు గుర్తుండవు, కానీ ఒక్కొక్క సారి ఎవరన్నా గుర్తు చేస్తే మరచి పోయినవి కూడా గుర్తుకువస్తాయి. ఇదీ అలాగే] అలా పూర్వజన్మ జ్ఞానం అందరికీ అంతసులభముగా కలుగదు.దానికి పరమాత్మ అనుగ్రహము ఉంటేనే సాధ్యము. మనకు జడభరతుని ఉదంతము తెలుసు. అయన మొదటి జన్మలో తపోవృత్తి లోవుండి కూడా ఒక హరిణము మీద దయతో ,ప్రేమ కలిగి దాని సంరక్షణ విషయమై ఆలోచిస్తూ మరణించి ఫలితముగా జింకగా పుట్టవలసి వచ్చినది. పూర్వజన్మ జ్ఞానమున్నందున తనస్థితికి వగచిన విషయము ఆ కథలో మీరు చదివి ఉంటారు. అలాగే మహాశివభక్తుడయి,నిష్టతో శివ పూజచేసే ఒక మహారాజు ,విహారాదులలో మాత్రము విపరీత కామ,చంచల స్వభావాన్ననుసరించటాన్ని అతని భార్య ప్రశ్నిస్తుంది "శ్రీ గురు చరిత్ర"లో.అప్పుడా రాజు పూర్వజన్మలో కుక్కగావుండి తాను పొందిన అనుభవాలను చెప్పి " ఏమిచెయను రాణీ ఆవిధముగా శివరాత్రి పూజావిధాన్నాని చూసి మరణించిన నాకు ఈ మహారాజ యోగము ,అచంచలమైన శివభక్తి అబ్బాయి. కానీ నా పూర్వకుక్కజన్మ వాసనలవలన నా బుధ్ధి ఇలా ప్రవర్తిస్తున్నదని చెబుతాడు.

అలాగే మేము తొమ్మిదవ తరగతి లో ఉందగా చాలా సంచలనాన్ని కలిగించిన వార్తను చదివాము. శ్రీశైలమ్ ప్రాంతములో పద్మావతి అనే ఎనిమిదేళ్ల అమ్మాయి. పూర్వ జన్మ స్మృతి కలిగి తాను పూర్వజన్మలో తన తాతగారి భార్య[అమ్మమ్మ] నని తనపేరు శేషమ్మ అని,చెప్పటము నమ్మని వాల్లందరి కీ వారితో పూర్వజన్మలో తాను కొన్నిసంఘటలను చెప్పటమే కాక. తన తాతగారితో ప్రత్యేకముగా భార్య భర్తలుగా వున్నప్పుడు వారిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలను కూడా చెప్పటము తో అది నిజమని తేలినది.

అలాగే స్వాతి వారపత్రికలో చాలా రోజులక్రితం చూసాను. శ్రీలంకలో ఒక దంపతులు తమ పిల్లవానిని గతంలో బాంబుదాడి లో ఆదేశ అధ్యక్షులు ప్రేమదాస చంపబడిన స్థలానికి తీసుకువచ్చినప్పుడు వాడు పెద్దగా ఏడుస్తూ వణికి పోతూ తాను ప్రేమదాసనని నన్ను ఇలా చంపారని పెద్దగా ఏడుస్తూ చెప్పటం ఆదేశం లో సంచలాన్ని కలిగించింది. వాని పోలికలూ కూడా అచ్చం ఆ చంపబడ్ద అధ్యక్షుని లాగే వున్నాయి.[క్షమించాలి.ఆ అధ్యక్షుని పేరు ప్రేమదాస,లేక జయవర్ధనేనా అన్నది నేను మరచి పోయాను]
వలసినవారు స్వాతి పత్రిక వారిని సంప్రదిస్తే ఆఫోటో దొరకవచ్చు. ఇలా చాలా సంఘటనలు ప్రపంచవ్యాప్తముగా మనము చదువుతున్నాము కనుక పునర్జన్మ లేదు అనేది మొండివాదనే అవుతుంది.

ఇక విషయాని కొస్తాను. ప్రదక్షణలు చేస్తున్న వరాహం కానీ ,లేక మొన్న నెల్లూరు జిల్లాలో గుడిలో ప్రదక్షణలు చేస్తున్నా కోడేదూడ గానీ ,అవి పూర్వ జన్మ జ్ఞానము కలిగిన జీవులుగా చెప్పవచ్చు. వాటి స్థితికి అవి దు:ఖిస్తూ పరమాత్మ సేవతో తరించాలని భావించి ఉండవచ్చు. కనుక పూర్వజన్మలో అనుకున్న పనిని ఈ జన్మలో నైనా చేయాలని భావించి తమ బాధ తాము పడుతున్నాయి. ఐతే మనం ఇప్పుడు చేస్తున్నపని ఏమిటి్? వాటికి దైవత్వాన్ని ఆపాదించి వాటిని పూజించటం,శాస్త్రవిరుద్ధమైన పని. వాటిని దైవాంశగలవాటిగా పూజించటము ద్వారా మరొక దోషము మనము చేస్తున్నామని జనం గ్రహించాలని నాభావన.ఇంతకంటే పవిత్రమైన మానవజన్మను కామక్రోధ,లోభ,మోహాదులతో వృధాచేసుకుంటు న్నమనం జాగ్రత్త పడాలే తప్ప .వాటికి దైవత్వాల నాపాదించి ,మన తప్పులను సరి చేసుకునే అవకాశాన్నుంచి తప్పు కోకూడదు.

ఈ చిత్రాలన్నీ ఎలాజరుగుతాయో ,భవిష్య పురాణాదులు సూచిస్తే,తాతగారు కాలజ్ఞానము లో తేటతెల్లము చేసి వివరించారు. ఐనా సరే మనము పాఠాలు నేర్చుకోవటము లేదు. వారి మాటలు ఆచరణలో కి తెచ్చుకోవటము లేదు.

తమసోమా జ్యోతిర్గమయ
****************

6 వ్యాఖ్యలు:

Anil Dasari January 1, 2009 at 2:50 AM  

దాన్ని వరాహావతారంగా భావించి పూజిస్తున్నారేమో? అయినా అన్నిట్లోనూ దేవుడ్ని చూసే హిందూమతం ఆ పందిలోనూ అదే చూసిందనుకోవచ్చు కదా.

durgeswara January 1, 2009 at 3:27 AM  

అనుకోవచ్చు. కాని అది ప్రతిజీవిలో ఉన్న పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో పరమాణువంత అంశమాత్రమే కలిగినజీవి. దానిని కూడా పైన చెప్పినట్లుగా భగవదంశమేనని భావించాలంటే అది మాలాంటి సామాన్యభక్తులకు సాద్యంకాదు.అది"పై"స్థాయిలోనున్నవారికిమాత్రమే సాధ్యం.

Bolloju Baba January 1, 2009 at 5:27 AM  

good argument

durgeswara January 1, 2009 at 6:04 AM  

dhanyavaadamulu bollojubaabaagaaru

visalakshi January 1, 2009 at 8:44 AM  

ఆలోచిస్తే ముక్తి కోసం వరాహం ప్రదక్షిణలు చేసుంటుంది. ఇంకో వాదం కూడా ఉందండి .తెల్ల వరాహము కాబట్టి పరవాలేదు ,నల్ల వరాహం ఐతే ప్రదక్షిణలు చేయకూడదుట .

నాగప్రసాద్ January 1, 2009 at 11:31 AM  

హహహ, వేద గారు, జంతువుల్లో కూడా వర్ణ వివక్షను పాటిస్తున్నారా?.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP