శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇలా చేస్తే ఎలావుంటుంది ? నూతన సంవత్సర వేడుక

>> Tuesday, December 30, 2008


ఏది మొదలు పెట్టినా దానిని భగవంతుని సన్నిధి లో ప్రారఁభించటం మనసాంప్రదాయము. ప్రారంభించిన ఏపనిలోనైనా భగవంతుని అనుగ్రహం కోరటం మన అలవాటు. కనుక మన ఆచారముకాక పోయినా ప్రపంచజనుల భావనలను గౌరవిస్తూ మనము కూడా ఈపండగను కూడా సంతోషముగా జరుపుకుంటున్నాము. అయితే మంచిని గ్రహించే మనము హంసలలా క్షీరనీర న్యాయాన్ని అనుసరించి చెడును వదలి వేయాలి. కనుక మంచిని కూడా మనసాంప్రదాయీకరించి ప్రపంచానికి ఆదర్శంగా వుండాలే కాని వేలంవెర్రిగా అనాచారాలనన్నింటిని గుడ్డిగా పాటించరాదు. మనదైన పద్దతిలో ఈ శుభప్రారంభాన్ని దైవ ప్రార్ధనలతో జరుపుకుందాము. మీ గోత్రనామాలు పంపితే ఆరోజు బ్రహ్మీ మహూర్తమునుండి శ్రీవేంకటేశ్వరస్వామి, రామలింగేశ్వర,దుర్గామాతలకు జరిగే ప్రత్యేక అభిషేకాలు పూజలు ,లోను పరివార దేవతలకు జరిగే అర్చనలలోనూ మీకొరకు ప్రార్ధన జరుగుతుంది. మీరు ఆలోచించి మేము సూచిస్తున్న ఈక్రింది సూచనలను కూడా పాటించగలరని మనవి.

***********************************************************************************************************************
పండగ అంటే అందరికీ సంతోషాన్ని కలిగించేదిగా వుండాలి. కనుక అర్ధరాత్రి కేకలతో ,మద్యసేవనాలతో పైశాచిక ఆనందాన్ని కోరుకుఁటూ సమాజానికి మీకుటుంబానికి బాధను కలిగించటం చేయకండి.
వెలిగే దీపాలను నోటితో ఆర్పటం దోషము కనుక ,వీలైతే నువ్వుల నూనె,ఆవునెతితో దీపాలు వెలిగించండి.
సామూహికంగా కొవ్వొత్తులను వెలిగించటం వలన పెద్దఎత్తున విషవాయువులు వెలువడతాయి .ఇది పరిశోధకులు తెలుపుతున్న సత్యం. కనుక ఆలవాటు మాని వేద్దాము.
గ్రీటింగ్ కార్డులు కొనేబదులు మన మిత్రులకు మెస్సెజ్ లగాను ఫోన్ లతో శుభాకాఁక్షలు తెలిపి ఆమిగిలిన డబ్బుతో ఆకలైన వారికి అన్నదానం చేయండి. ఈ అలవాటు మన పిల్లలకు కూడా నేర్పుదాము.
మన ఆచరణ చూసి ఏపండగైనా చేస్తే చూస్తే భారతీయులులా చేసి చూడాలని మిగతా ప్రపంచానికి తెలిసేలావుఁడాలి .
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

6 వ్యాఖ్యలు:

Anonymous December 30, 2008 at 6:31 AM  

chala bhaga chepparu....andharam alage chedham...ma nanna gari peru
subba raju gothram vasishta..

చిలమకూరు విజయమోహన్ December 30, 2008 at 6:57 AM  

చక్కటి ఆలోచన,అందరం అమలుపరుద్దాం.

నాగప్రసాద్ December 30, 2008 at 7:25 AM  

చాలా బాగా చెప్పారు. అందరం అలాగే చేసుకుందాం.

>>"వెలిగే దీపాలను నోటితో ఆర్పటం దోషము".
దీపాలను నోటితో ఆర్పటం దోషము అని చెప్పి, నా పుట్టిన రోజు నాడు చేతితో ఆర్పితే, మా ఫ్రెండ్సందరూ నాతో చెడుగుడు ఆడుకున్నారు. :))

durgeswara December 30, 2008 at 7:44 AM  

ప్రసాద్

మనసంస్కారాలనుంచి ,అనుకరణలప్రభావంవలన మనందూరం చెయ్యబడుతున్నాము. నీ స్నేహితులు కూడా అలా నిన్ను అర్ధంచేసుకోలేక అని వుండవచ్చు.కానీ వివరించి చెబితే వారికీ అర్ధమవుతుంది.మన ఆచారాల విలువ.

MURALI December 30, 2008 at 10:53 AM  

దుర్గేశ్వరగారు,
ఈ విధంగా మీరు చేస్తున్న సేవకి ధన్యవాదాలు.
పేరు: నామాల నాగమురళీధర్
గోత్రం: నాగులగోత్రం

నేస్తం December 30, 2008 at 7:21 PM  

చాలా బాగా చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP