శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇప్పుడు గరుడుని ప్రదక్షణలు మొదలయ్యాయి

>> Thursday, January 1, 2009

కలియుగంలో వింతలు చోటుచేసుకుంటాయన్న ఆర్యుల మాటలు రోజురోజుకు నిజమౌతున్నాయి. ఇటీవలే ఓ భక్త వరహం సిద్ధాంతం గ్రామంలోని వెంకన్న ఆలయాన్ని రెండు రోజుల పాటు ప్రదక్షిణలు చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ గరుడుడు మరో వింతకు కారణమయ్యాడు.

అసలు విషయమేమిటంటే...? భక్తవరాహం లాగానే విష్ణుమూర్తి వాహనమైన గరుడుడు... హైదరాబాద్ నగరం కందికల్‌గేట్‌లోని చిత్రగుప్త స్వామి దేవాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంపై ప్రదక్షిణలు చేస్తున్నాడట. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఓ గరుడపక్షి అయ్యప్ప ఆలయంపై ప్రదక్షిణలు చేపట్టింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రజలు భారీ ఎత్తున అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేశారు. ప్రదక్షిణలు చేసి చేసి అయ్యప్ప స్వామి ముందు వాలిన గరుడకు ప్రజలు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం గరుడపక్షిని ఆకాశంలోకి వదిలినా అది మళ్లీ అయ్యప్ప స్వామి ఆలయం చుట్టే ప్రదక్షిణలు చేస్తోందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP