శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అయోధ్యలో పేలుడు ను నిరోధించిన హనుమత్ శక్తి

>> Friday, June 16, 2023

1998లో జరిగిన ఈ యదార్థ సంఘటన అయోధ్యలో నాటి పరిస్తితుల దృష్ట్యా ఏ వార్తాపత్రికలోగానీ, వార్తా చానెల్‌లోగానీ ఇంతవరకు చూపబడలేదు..

ఈ సంఘటన జియో సినిమాలో ఉన్న ఇన్‌స్పెక్టర్ అవినాష్ సిరీస్‌లో చాలా వివరంగా చిత్రీకరించారు...

1998 లో అయోధ్యకు దాదాపు 20 కిలోల R D X (విస్ఫోటక పదార్థం) వస్తోందని ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి..వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)ని మోహరించారు. చాలా వరకు R D X ని పోలీసులు సమయానికి గుర్తించారు..రికవర్ చేశారు ..అదృష్టవశాత్తు అయోధ్యలో ఎటువంటి పేలుడు సంభవించలేదు.

ఈ మొత్తం బాం రికవరీలో ఒక అద్భుతం చోటు చేసుకుంది..
ఒక te₹₹orist bb0mb డిస్పోజల్ స్క్వాడ్‌గా మారువేషంలో అయోధ్యలోని పురాతన హనుమాన్ గడి ఆలయంలోకి ప్రవేశించి, వాటర్ కూలర్లో బాం ను పెట్టి టైమర్‌ను అమర్చాడు.. పోలీసులకు చివరి గంటలో దొరికిపోయాడు..అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను బాం ను హనుమాన్ గఢీ లో అమర్చానని చెప్పాడుగానీ ఎక్కడ అనేది చెప్పలేదు..అతను బాం ను సెట్ చేసిన టైమ్ కు ఇంకా ఒక్క నిమిషం మాత్రమే ఉంది..

ఈ గందరగోళంలో అప్పటికే  ఆలయం లోపల ఉన్న ఇన్‌స్పెక్టర్ అవినాష్ మిశ్రా నేతృత్వంలో మొత్తం పోలీసులు బాం కోసం వెతికారు. వారు ఆలయంలోని ప్రతి మూలలో వెతికారు కానీ  బాంబ్ లాంటిదేమీ కనిపించలేదు..

అప్పుడు ఇన్స్పెక్టర్ అవినాష్ గుడి ప్రాంగణం లోపల వాటర్ కూలర్ దగ్గర ఒక చిన్న కోతి కూర్చుని రెండు వైర్లు చేతిలో పెట్టుకుని ఆడుకుంటూ నోట్లో పెట్టుకొని నమలడం గమనించాడు.. 
ఆ వాటర్ కూలర్లో బాం అమర్చబడిందని అనుమానించిన పోలీసులు ఆ కోతి దృష్టిని వైర్‌ల నుండి మరల్చడానికి కోతి వైపు అరటిపండ్లను విసిరారు..
అరటిపండ్లను కోతి వైపు విసిరిన వెంటనే అది తీగలను విడిచిపెట్టి అరటిపండ్లను కూడా  తీసుకోకుండానే వెళ్లిపోయింది..
వెంటనే, b0mb డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించారు.. వాటర్ కూలర్ ను తెరవగానే లోపల ఉన్న  టైమర్-సెట్ b0mb కనుగొనబడింది..
వెంటనే బాం డిస్పోజల్ చేసే నిపుణుడు ఉద్విగ్నంగా అరిచాడు "సార్, ఈ బాంబ్ ఇప్పటికే డిఫ్యూజ్ చేయబడింది. చూడండి, టైమర్ సరిగ్గా 3 సెకన్లలో బాం పేలుతుందనగా ఆగిపోయింది. ఆ చిన్న కోతి వైర్లు కత్తిరించి మమ్మల్ని రక్షించిందని ఆనందంగా చెప్పాడు "
ఇన్స్పెక్టర్ అవినాష్ ఆ కోతి కోసం వెతికాడు అప్పటికే అది హనుమాన్ఘడి  దేవాలయ శిఖరంపై ఉన్న శిఖర కాషాయ ద్వజాన్ని విజయచిహ్నంగా తీవ్ర ఆవేశంతో ఊపుతూ కనిపించింది..
ఇన్స్పెక్టర్ అవినాష్ రెండు చేతులూ పైకెత్తి మమ్మల్నీ..ప్రభు రామచంద్రుడి జన్మభూమిని కాపాడడానికి వచ్చిన సాక్షాత్ హనుమంతుడివే అంటూ హనుమాన్ చాలీసా పఠించారు.. 
ఇది ఖచ్చితంగా భక్త హనుమాన్ ప్రపంచానికి నేరుగా ఇచ్చిన సందేశం..అయోధ్య నా ప్రభు భగవాన్ శ్రీరామునికి చెందినదని అయోధ్యకు మానవమాత్రుడు పరిష్కరించలేని ఇబ్బంది వచ్చినప్పుడు స్వయంగా తానే స్వయంగా ఒక కోతి రూపంలో వచ్చి అయోధ్యను కాపాడుతానని ప్రకటించాడు..

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP