శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివాలయం లో అపచారానికి ఇప్పుడు పడ్డ శిక్ష ... చూసైనా బుద్ది తెచ్చుకోవడం చేస్తారా

>> Monday, April 5, 2021

మంగళూరు లోని స్థానిక శివాలయం లోకి వెళ్లి #నవాజ్ #అబ్దుల్_రహీం, #అబ్దుల్_తౌఫీక్ మూత్ర విసర్జన చేశారు, హుండీ లో కాండోమ్ లు వేశారు. ఇక్కడి దేవుడిని #కొరగజ్జ  స్వామి అని పిలుస్తుంటారు. శివుడి అవతారంగా భావిస్తారు. ఇలాంటి సంఘటనలు ఈ ఒక్క చోటే కాకుండా ఊళ్లో చాలా చోట్ల జరిగాయి. జనం ఫిర్యాదులు కూడా ఇచ్చారు.
కానీ పోలీసులు మాత్రం నేరస్తులు ఎవరు అనేది కనిపెట్టలేక పోయారు. దీంతో విసిగిపోయిన భక్తులు నేరుగా #కొరగజ్జ స్వామినే వేడుకున్నారు - స్వామీ ఈ ఇలా తప్పుడు కార్యం చేసినవారు ఎక్కడున్నా పట్టుకుని వారిని శిక్షించు అని. 

ఓ మూడు నాలుగు రోజులు గడిచే సరికి వారిలో ఇద్దరు శాంతి మతస్తులు గుడిలోకి వచ్చి - క్షమాపణ చెప్పి స్వామి క్షమించేలా చేయమంటూ పూజారిని వేడుకోవడం మొదలు పెట్టారు. పూజారి గారు వీళ్లు  మళ్లీ  నన్ను ఆటపట్టిస్తున్నారు అనుకుని ఊరుకున్నారు.

కానీ జరిగింది అది కాదు. వాళ్లు  చాలా సీరియస్ గా క్షమాపణ కోరారు. ఎందుకంటే ఆ హుండీలో కాండోమ్ వేసిన నవాజ్ అనే ప్రధాన నిందితుడు అప్పటి నుంచీ ముందు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తరువాత రక్తం కక్కుకోవడం మొదలు పెట్టాడు, విరేచనాలు అయ్యాయి, చివరికి ఇంట్లో గోడకి తల  బాదుకుని చనిపోయాడు. చనిపోయే ముందు #కోరగజ్జ స్వామి మన మీద ఆగ్రహించాడు అని చెప్పి మరీ తుది శ్వాస విడిచాడు.

మొత్తం ముగ్గురు నిందితులలో ఇప్పుడు మిగిలిన ఇద్దరూ - అబ్దుల్ రహీం, అబ్దుల్ తౌఫీక్ అనే వారు జీవించి ఉన్నారు. కానీ అబ్దుల్ రహీం కూడా అనారోగ్యంగా వున్నాడు, మొదటి వ్యక్తికి  లాగే రక్తం కక్కుకోవడం, విరేచనాలు కావడం జరుగుతోంది. ఇప్పుడు వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నారు. ఇవన్నీ రెండు రోజుల క్రితం దేవుడి సమక్షంలో జరిగిన జాతరలో ఒప్పుకుని క్షమాపణ కోరారు.
ఇప్పుడు పోలీసులు వాళ్లని  కస్టడీ లోకి తీసుకున్నారు. వాళ్లిద్దరూ తమ తప్పును పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు. వారిద్దరూ బాగా భయ విహ్వలులు అయిపోయారు.  మంగళూరు పోలీసు కమీషనర్ విలేకరులతో మాట్లాడుతూ - ఇది చాలా విచిత్రమైన కేసని, వాళ్లు  చెప్పింది నిజమా కాదా తేల్చుకునేందుకు సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

ముగ్గురిలో ఒకడు చనిపోయాడు. ఇద్దరు ఉన్నారు. 

మరి కొరగజ్జ  స్వామి కరుణిస్తాడా? ఆయనే త్వరలో సమాధానం చెప్తారు.
Video Link : https://twitter.com/i/status/1377573969402851330

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP