శరన్నవరాత్రి పూజలకు మీ గోత్రనామాలు పంపండి
>> Tuesday, October 13, 2020
జగన్మాత చరణకమల స్మరణపూర్వక నమస్కృతులు . పీఠంలో ఈ నెల 17 అనగా ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలై 25 వతేది దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవములు జరుపబడుతున్నవి. లోకములో సంభవిస్తున్న పెను ఉపద్రవములు ఉపశమించి అందరకూ శ్రేయస్సు కలగాలని ఆజగన్మాతను వేడుకుంటూ అమ్మ ఆరాధనలు జరుపబడతాయి. ప్రతి సంవత్సరం వలెనే ఈ సంవత్సరం మీకు మీకుటుంబానికి అమ్మవారి అనుగ్రహం కలగాలని సదా ఆతల్లి కరుణ మీపై వర్షించాలని మీతరఫున కూడా అర్చనలు నివేదనలు జరుపబడతాయి. . ఇందుకొరకు మీగోత్రనామాలను పంపగలరు. ఇందుకొరకు ఎటువంటి రుసుములు పంపవలసిన అవసరం లేదు. కానీ మీ నివాసములోనే మీ మీ శక్త్యానుసారము అమ్మవారి నామ ,స్తోత్ర జపములు కొనసాగించి ఆఁకొన్న జీవులకు మీ కు చేతనయినంతగా ఆహారం ఇవ్వండి .చాలు. అదే మీరు చెల్లించవలసిన దక్షిణ .
గోత్రనామాలు పంపవలసిన చిరునామా
durgeswara@gmail.com
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం ...నూజండ్ల మండలం గుంటూరు జిల్లా
0 వ్యాఖ్యలు:
Post a Comment