సతీసమేతంగా భూమి పూజ చేసింది ఎవరు
>> Friday, September 25, 2020
…. ఏ గుడికి వెళ్లినా మోడీని సతీసమేతంగా వెళ్లమనండి, తిరుమలకూ రమ్మనండి, ఏ భార్యతో వెళ్తాడు..? ఇలాంటి దిగజారుడు బజారు వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని కాసేపు వదిలేయండి, తన లెవల్ అదే… ప్రధాని మోడీపై తన మంత్రి చేసే ఇలాంటి వ్యాఖ్యలు జగన్‌కు నచ్చుతున్నాయా లేదా అనేదీ వదిలేయండి… ఆ డిక్లరేషన్ వివాదమూ కాసేపు వదిలేయండి… గతంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి… ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువులు భక్తిగా వీక్షించిన అయోధ్య భూమిపూజ ఎవరైనా దంపతులతో జరగాలి గానీ, సతీరహితంగా ప్రధాని మోడీ చేయడం ఏమిటని..! నిజం ఏమిటి…? ధర్మవిరుద్ధంగా, హైందవ ఆచారవిరుద్ధంగా రామజన్మభూమి ట్రస్టు మోడీతో ఈ భూమిపూజ చేయించిందా..? ఇదెక్కడి పాలకదాస్యం..? అని మీకూ అనిపించిందా ఎప్పుడైనా…?
కాదు, ఆ భూమిపూజలో కూర్చున్న దంపతులు వేరు… వాళ్లు సలిల్ సింఘాల్, ఆయన భార్య మధు సింఘాల్… వారితోపాటు వాళ్ల కొడుకు మయాంక్ సింఘాల్ కూడా హాజరయ్యాడు… వీళ్లెవరు..? అయోధ్య ఉద్యమాన్ని మొదటి నుంచీ జాగ్రత్తగా నిర్మించిన మాజీ విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ సోదరుడు ఆయన… అయోధ్య కల సాకాారం అయ్యేందుకు ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ, ఆ కుటుంబంతోనే భూమిపూజ చేయించింది జన్మభూమి ట్రస్టు…
టీవీల్లో ఈ భూమిపూజ వీక్షించిన వాళ్ల దృష్టి ఎక్కువగా మోడీ మీద ఫోకస్ అయ్యింది కానీ… అక్కడ పూజ దగ్గర కూర్చున్నది… మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్, ప్రధాన పూజారి గంగాధర్ పాఠక్, నారద్ భట్టారాయ్, పండిట్ విశిష్టాచార్య… భూమిపూజ ఫోటోల్లోనూ సలిల్ సింఘాల్ దంపతులను చూడొచ్చు… అక్కడ ఉన్నవారిలో దంపతులు వాళ్ల
ముఖ్యమైన పూజా కార్యక్రమాల్లో దంపతులు పాల్గొనడం హైందవ ఆచారం… సతీరహితులు లేదా పతీరహితులు ముఖ్య యజమానిగా పూజలో కూర్చోరు… ముఖ్య యజమాని అంటే Main Host… అయోధ్య వంటి ఆలయ భూమిపూజను ఆచారాలకు విరుద్ధంగా జన్మభూమి ట్రస్టు ఎలా నిర్వహించగలదు..? అనేక మంది పీఠాధిపతులు, ధర్మప్రచారకులు పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని ధర్మవిరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు..? అసలు వాస్తవం ఇదీ…
నిజానికి మెయన్ స్ట్రీమ్ మీడియా కూడా మోడీయే భూమిపూజ చేశాడన్నట్టుగా కవర్ చేసింది… ఈ కార్యక్రమానికి సలిల్ సింఘాల్, మధు సింఘాల్ దంపతుల్నే కాదు, ఆ కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించింది ట్రస్టు… కరోనా కారణంగా కొందరే హాజరయ్యారు… సతీరహితంగా మోడీ ఒక్కడే భూమిపూజకు అర్హుడెలా అయ్యాడని ఎవరో అడిగితే విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ కోక్జే… ఈ వివరాలు వెల్లడించి, ప్రధాని మోడీ ముఖ్య అతిథి మాత్రమేనని బదులిచ్చాడు… అదీ అసలు వాస్తవం…
1 వ్యాఖ్యలు:
good answer.
Post a Comment