శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ముహూర్త బలం

>> Friday, October 18, 2019

ముహూర్త బలం:
------------------------
ధవళేశ్వరం దగ్గర ఆనకట్టు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంజనీరు కాటన్ మహాశయుడు,
ఈయనకు కుడి భుజం వీరాస్వామి గారు.

కాటన్ గారు పని మొదలుపెట్టే ముందుగా
పొడుగ్గా పెద్ద పెద్ద తాటాకు పాకలేయించాడు. ఆఫీసు, పని వారికోసం.

శంకుస్థాపన చెయ్యాలంటాడు,
ముహూర్తం పెట్టించాలంటారు
వీరాస్వామి గారు.

అప్పటికి ఒకటే గోదావరి జిల్లా.

నూట ఏభయి మంది వేద పండితులు
ముహూర్త నిర్ణయం కోసం వచ్చి చేరేరు.

వీరిని పిలిచి సభ ఏర్పాటు చేసి
కాటన్ గారిని పిలిచారు వీరాస్వామి గారు.

వేద పండితులంతా ఏక కంఠంతో,
వందల సంవత్సరాలు ఉండవలసిన కట్టడం,
లక్షల ఎకరాలకి నీరిచ్చేది,
మీరనే “లిక్విడ్ గోల్డ్”,
మీరు మంచి మనసుతో చేస్తున్న సత్కార్యం, మొదలు పెట్టడానికి మంచి ముహూర్తం కావాలన్నారు.

నీటికి “లిక్విడ్ గోల్డ్” మాట కాటన్ గారన్నది.

దానికాయన, నాకు నమ్మకం లేదని అంటూ,
కొద్ది క్షణాలలో ఏమి జరగబోతున్నది చెప్పగలరా?
అని ప్రశ్నిస్తే, సభ నిశ్శబ్దమయిపోయింది.

ఒక చాకులాంటి యువకుడు, సభ చివరినుంచి లేచి,

కొన్ని క్షణాలలో మీపై విష ప్రయోగం జరుగుతుందని అన్నాడు.

కాటన్ దొర నవ్వి వెళ్ళిపోబోతూ చేయి పైకెత్తితే,
కొత్తగా వేసిన తాటాకుల లోని ఒక తేలు ఆయన చేతి వేలుపై పొడిచింది.

కాటన్ గారు ఒక్క సారి అరిచాడు బాధతో.

వెంటనే ముహూర్తానికి శంకు స్థాపన చేయడానికి ఒప్పుకున్నాడు.

ఒక్క సారిగా నూట ఏభై కంఠాలు ఉరిమాయి, వేద స్వస్తి పలికాయి ఆశీర్వదిస్తూ.

ఈయన నొప్పి మాయమైపోయింది.

పండితుల ప్రతిభకి వీరాస్వామి, కాటన్ గార్లు సంతోషించారు, ముహూర్తం నిర్ణయమయింది,

ఆ సమయానికి కాటన్ గారు
గోదావరి తల్లి పై ఆనకట్టకు, ధవళేశ్వరం దగ్గర
శంకుస్థాపన చేశారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP