శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీజీవితంలో శుభప్రాప్తికై ప్రారంభించబడినది " మహామంగళ హనుమత్ రక్షాహోమము "

>> Monday, February 25, 2019



పీఠంలో  మూల మూర్తుల ప్రతిష్ఠ జరిగి  ఈ మాఘ శుద్ధ  దశమి నాటికి 12 సంవత్సరాలయింది .హనుమత్ రక్షాయాగం ప్రారంభించి ఇప్పటికి 11 ఆవృతులుగా జరుపుకున్నాము. తాతగారు పీఠం నెలకొలిపి దాదాపు ఎనుబది సంవత్సరాలవుతుంది .ఆయన నామజపముతో అమ్మ కరుణకు పాత్రుడై  అక్షరమ్ముక్క లేని ఆయన కు భవిష్యత్తును సూచించగలిగే శక్తిని పొందాడు.  ఇక నేను అమ్మ కు ఏజన్మలోనో ఒక పుష్పం సమర్పించానేమో ఇప్పుడు  ఈ వారసత్వానికి అందుకుని అమ్మ పాదసేవాభాగ్యాన్ని పొందాను. ఆ ముగురమ్మల మూలపుటమ్మ   చిన్నారి ముద్దు మోమును నిరంతరం తిలకిస్తూ తరించేలా ఈజన్మను ప్రసాదించింది . నాకున్న రెండు ఎకరాల పొలంలోకి అమ్మవారి పీఠాన్ని తరలించి మందిర నిర్మాణం చేపట్టి ఫ్రతిష్ఠ  జరిపేలా చేసినది అమ్మ . ఎవరినీ  ... దేహీ అని అడిగి పొట్టపోసుకోవలసిన దుస్థితి లేకుండా ఒక ఉద్యోగం  ,నాలుగు మంచి మాటలు చెప్పగల బుధ్ది ,వాక్కును ఇఛ్చినది. తప్పును తప్పు అని  చెప్పగల ధైర్యాన్ని ప్రసాదించినది. చేసినది తప్పయితే ఒప్పుకోగల  నిర్భయత్వాన్ని అనుగ్రహించినది. కష్టాలలో  ,దిక్కుతోచని స్థితిలో  ఉన్నవాళ్లకు  భగవంతుని ఆశ్రయించి శరణాగతులవటమే తరించడానికి మార్గమని తెలిపిన మన ఋషులు,గురుపరంపర  అనేక సాధనా మార్గాలను లోకానికి అందించారు.  మనం కొత్తగా ఆలోచించవలసిన అవసరం లేదు .సంపూర్ణంగా ,శ్రేయస్కరమైన మార్గాలను వారందించారు. వాటిని మళ్ళీ ఈ తరం వాళ్లకు గుర్తుచేయటమే ఒక సాధనామార్గంగా నేను  ఎన్నుకున్నాను

            దానిలో భాగంగా  మొదలైన      హనుమత్ రక్షాయాగం ప్రారంభించిన నాటినుండి    భగవన్మార్గంలో  గురువై నడిపిస్తున్న హనుమత్ప్రభువు కృప అడుగడుగునా నిదర్శనంగా కనిపిస్తున్నది.  నాజీవితంలో నేను  మన ఋషిపరంపర చూపిన బాటలో  నడుస్తూ పొందిన సత్ఫలితాలను ,  ఎంతోమంది జీవితాలలో హనుమత్ రక్షాయాగా సాధనలో  ప్రయోగాత్మకంగా నిరూపణ గా  లభించటం చూస్తున్నాను.   ఇది స్వామి శక్తి  ,, ఆయాసాధకుల భక్తి కి నిదర్శనం.


ఇప్పటివరకు పీఠంలో  కార్యక్రమాలన్నీ సామూహికంగానే జరుగుతున్నాయి.

ఇప్పుడు వ్యక్తిగతంగా  వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నవారికోసం .... జాతకరీత్యా ,గోచార రీత్యా పలు ఇక్కట్లకు గురవుతున్నవారి కోసం  కష్టనష్టాలతో తల్లడిల్లుతున్నవారికోసం గ్రహదోషాలు నివారింపబడి వృత్తివ్యాపారాదులలో  ,విద్య ,ఉద్యోగ,వివాహ సంతానాది విషయాలలో శుభఫలితాలు ప్రాప్తించుటకు  ,చేపట్టిన కార్యక్రమములు  దిగ్విజయముగా సాగుటకును , అనారోగ్య నివారణ  గృహ ,గ్రహదోషాదుల నివారణ జరిగి ,భగవదనుగ్రహంతో వారి వారి సత్సంకల్పాలు  నెరవేరాలని కోరుతూ ఒక దివ్యమైన  పూజావిధికి శ్రీకారం చుట్టటం జరిగినది.  మా పురోహితవర్గం  పర్యవేక్షణలో శాస్త్రీయతలోపించకుండా  , వ్యాపారాత్మక ధోరణి ప్రవేశించకుండా  అటు పురోహితుల మంత్రబలం ,ఇటు స్వయముగా సాధకుల సాధనాబలం   కలసి  స్వామి అనుగ్రహం తో యజమాని యొక్క  ధర్మబధ్ధమైన  మనోభీష్టములు శీఘ్రంగా  నెరవేరేలా ...."మహామంగళ హనుమత్ రక్షా హోమము " అను   దివ్యమైన అర్చనా మార్గాన్ని ప్రారంభిస్తున్నాము.
ఈ హోమము  పీఠములో ప్రతి ఆదివారం జరుగుతుంది . మాఘ బహుళ పంచమి నాడు  మొదటి వారం  నాయొక్క కుమారుల అభ్యున్నతిని కోరుతూ  నేనే యజమానిగా  జరుపుకున్నాము. ఇక ప్రతి ఆదివారం  ఈ  కార్యక్రమం తమకోసం జరుపాలని    కోరిన వారికోసం   నిర్వహించబడుతుంది. .

ఈ  కార్యక్రమ విధి  విధానములు
----------------------------------
 సమయం   ఉదయం   8. 30  నుండి 11. 30  వరకు జరుగుతుంది
యజమాని సతీసమేతంగా వీలుకానప్పుడు ఒంటరిగానైనా జరుపుకొనవచ్చుఁ.
సూర్యోదయత్పూర్వమే  స్నానాదులు పూర్తిచేసుకుని సూర్యనమస్కారములు ,సంధ్యవార్చుకునే వారు  వారి విధివిధానంగా పూర్తిచేసుకోవాలి.
తప్పనిసరిగా మగవాళ్ళు పంచె కండువా ...ఆడువారు చీర  ధరించవలసినదే
ఇక చిన్నపిల్లలు వెంటవచ్చినా  పూజాసమయంలో  వారిని చూసుకోవడానికి ఎవరినైనా తీసుకురావాలి ..లేకుంటే పిల్లల అల్లరి వలన పూజలో యజమాని ఏకాగ్రత తప్పుతుంది.
 ప్రతి కుటుంబానికి ఒక పురోహితుడు ఉండి  మీచే పూజా హోమములు జరిపిస్తారు. .ఎంతమంది దంపతులు వస్తే అంతమంది పురోహితులను ఏర్పాటుచేయడం జరుగుతుంది.
ముందుగా సంకల్పం , గణపతి పూజ , గురు  పాదుకా వందనం  , నవగ్రహ మందిరంలో ప్రదక్షిణ , హనుమత్ప్రదక్షిణ ,గోమాత కు ప్రదక్షిణ చేయాలి.
ఆపై పార్థివలింగాన్ని నిర్మించుకుని శివాభిషేకం అర్చన, అమ్మవారికి కుంకుమార్చన ...శ్రీవేంకటేశ్వర స్వామివారికి అర్చన ,హారతి యజమానులచే  సమర్పించబడుతుంది.
పదినిమిషాలు  ధ్యానం
ఆపైన  హోమము  యజమానులచే  నిర్వహింపజేయుట జరుగుతుంది.
హోమము పూర్తయ్యాక  తీర్థ ప్రసాద వితరణ
10000 నామాలు వ్రాయుటకు అనువుగా శ్రీరామనామ లేఖనం పుస్తకమును ప్రసాదంగా ఇస్తారు.

మీరు  ఇంటివద్ద  నలభైరోజులపాటు  మీమీ సమయానుసారంగా రామనామ లేఖనం పూర్తిచేయాలి [దంపతులైతే ఇద్దరూ కలసి.]ఇందుకోసం ప్రత్యేక నియమములు ఏమి లేవు .
ఈ నలుబది రోజులు పీఠంలో మీ క్షేమమునకై ప్రార్ధన జరుగుతుంది.

 శనివారం రోజు మీగ్రామములోని హనుమదాలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలు.
 స్వామి అనుగ్రహంతో నలుబది దినములలో మీరు రామనామ లేఖనం పూర్తిచేసే సమయానికి మీ మీ సమస్యలు స్వామి అనుగ్రహంతో   నివారింపబడి  శుభకరమైన పరిష్కారములు లభిస్తాయి. ఇది మాజీవితంలో అనుభవపూర్వకంగా నిరూపించుకున్న సత్యం . మరెందరో భక్తులజీవితాలలో నిరూపింపబడగా మేము తెలుసుకున్న సత్యం.
మీ సమస్య పరిష్కరింపబడిన తరువాత  రామనామ లేఖన ప్రతులను మాకు అందజేయాలి.
మీకు వీలయితే పదిమంది ఆకొన్నవారి  ఆకలి  తీ ర్చ0డి  చాలు.

ఇందుకోసం  ఇప్పటి  ఖర్చుల ప్రకారం పూజకు ,యాగద్రవ్యాలకు ,పురోహితుల సంభావన  మొత్తం కలిపి  2116/-  రూపాయలుగా  నిర్ణయించబడినది .
పూజ జరిపించుకోదలచినవారు  సోమవారం నుండి శనివారం ఉదయం పదిగంటలలోపు మాకు తమపేర్లు మెయిల్ ,ఫోన్ ద్వారా తెలియజేసి  ECCOUNT  NO  తెలుసుకుని  దక్షిణను పంపవలసి ఉంటుంది . ఇక పూజానంతరం అమ్మవారి అన్నప్రసాదము ఉంటుంది .  పూజాసమయములో  అనారోగ్య సమస్యలున్నవారికి మాత్రమే  స్వల్పంగా పాలు పండ్లు ఇవ్వబడతాయి .  భక్తులైనా పురోహితులైనా   టిఫిన్ లు చేసి పూజ జరపటం  ఇక్కడ అంగీకరించలేము .
 ఇక స్వయముగా  ఇక్కడికి వచ్చుఁటకు అవకాశం లేనివారు  కోరితే వారితరఫున పురోహితులు ఇదే పద్ధతిన ఇక్కడ  నిర్వహించి ప్రసాదం  పంపుతారు.   అయితే మీరు అక్కడ చేయవలసిన విధివిధానాలను ఫోన్ లో తెలుపుతాము.

సంప్రదించవలసిన చిరునామా
దుర్గేశ్వర
ప్రధాన సేవకులు
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం   పోస్ట్   నూజండ్ల మండలం  గుంటూరు జిల్లా
9948235641 ..... durgeswara@gmail.com

  జైశ్రీరాం

హనుమత్ మహిమలు అన్న లేబిల్ పై నున్న సాధకుల అనుభవాలను  ఈ బ్లాగులో చూడవచ్చు






0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP