శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇతరులను మూర్ఖులు అని అవమానించటాన్ని కూడా ఒక ప్రత్యేకదినంగా పాటించే సంస్కృతి అది. మనకొద్దు

>> Monday, April 1, 2013

ఇతరులను ధూషించటం పాపంగా భావించే సంస్కృతి మనది. ప్రతివారినీ గౌరవించటమనే చక్కటి సాంప్రదాయాలుగల నాగరికతమనది.  

ఇక ఏప్రిల్ ఫూల్స్ అంటూ   ఇతరులను అవమానించటమేగాక  అదో ఘనకార్యంలా గుర్తుంచుకునేట్టు  ఒకరోజునే కేటాయించుకున్న సంస్కృతులు మనం పాటించవద్దు, మనపిల్లలకు నేర్పనూ వద్దు.

ఇంతకీ ఈ ఏప్రిల్ ఫూల్ అంటే ఏమిటి ?
కాలగణనం సరిగారాక ఎప్పటికప్పుడు మార్పులు  చేసుకుంటూ   ఏప్రిల్ నెలలో నూతన సంవత్సరాన్ని పాటిస్తూ దాన్ని కాదని జనవరిని నూతనసంవత్సర ప్రారంభంగా మార్చుకున్నారు. ఐతే అలవాటుగా ఏప్రిల్ నే సంవత్సరారంభంగా భావించే వారిని ఏప్రిల్ ఫూల్స్ అని అవమానించి అవహేలన  చేసేవారు పాశ్చాత్య దేశాలలో.

[అదీ సంగతి తాము అనుసరించినదే అందరూ అనుసరించాలని లేకుంటే వారిని అవమానించటానికైనా సిద్దపడే సమ్స్కృతి వారి. ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. మారదు.]

2 వ్యాఖ్యలు:

BHAARATIYAVAASI April 1, 2013 at 9:04 PM  

వారు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించి తమ మూర్ఖత్వాన్ని ప్రపంచానికి అంటించారు. తరవాత, కాలగమనం సరిగా రాక కాదు, ఎవరికి వారు తమ లెక్కలని ఒకరి మీద ఆధారపడకుండా తయారు చేసుకొన్నారు. సూర్యుని చుట్టూ ఒకసారి ప్రదక్షణం చేస్తే అది ఒక సంవత్సరం అవుతుంది. అయితే, గుడికి ద్వజస్థంభం ఉన్నట్లుగా సుర్యుని చుట్టూతిరిగి రావటానికి గుర్తించ తగ్గ ప్రదేశమేదీ లేదు. ఎవరి లెక్కలు వారివి. ఇంతకీ ఈ సంవత్సరాల లెక్కలకి సరైన ప్రాతిపాదిక ఎక్కడా లేదు. అందుకనే మన తెలివైన వారు కూడా తమ సంవత్సరాలని బీసీ అంటూ వెనుకకి లెక్క పెట్టుకోవలిసిన ఖర్మ పట్టింది.

KAPPAGANTU RADHAKRISHNA April 1, 2013 at 11:59 PM  

పాశ్చాత్య దేశాలవారు తాము నిర్ణయించినదే అసలైన సంవత్సరకాలమని తప్పులో కాలేశారు. ఎందుకంటే, వారి సంవత్సరం చివరలో ఒక నెల చలీకాలం, మళ్ళీ కోత్త సంవత్సరం మొదటి రెండు నెలలూ చలీకాలమే ఉంటుంది. కానీ ఏప్రిల్‌లో మొదలు పెట్టే కొత్త సంవత్సరం, ఎండాకాలంతో మొదలై చలీ కాలంతో ముగుస్తుంది. ఈ మాత్రం ఖచ్చితత్వం కూడా లేని పాశ్చాత్యులు, తమదే గొప్ప అనుకోవటం.... అది వారి మూర్ఖత్వానికే నిదర్శనం. అవునులే, మావి కేవలం 26 అక్షరాలే అని పైకి చెప్పి కనీసం 52 అక్షరాలు నేర్చుకొన్నా కూడా స్పష్టత లేని భాషవారు ఇంతకన్న ఏమి చెపుతారు....!!!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP