దౌర్భాగ్యపుబుద్ధులకు దివ్యలోకాలెలా నచ్చుతాయి ?
>> Tuesday, August 28, 2012
స్వామీ ! ఈ జీవులనుద్దరించడానికి భువిపై అవతరించావు . తమ దర్శనభాగ్యం ప్రత్యక్షంగా పొంది ఈ జీవరాశి అంతా తరించినట్లే .అయినా జీవులన్నీ దుఃఖమయమైన ఈ జీవితాలను వదలలేకున్నాయి . మీరు అనుగ్రహించి వీటిని దరిచేర్చుకోరాదా ? ఈ జీవుల శోకమయమైన జీవితాలను చూడలేకున్నాను అని ప్రార్ధిస్తున్నాడు ఉద్దవుడు ఏకాంతంలో శ్రీ కృష్ణ పరమాత్మను.
సాధువు హృదయం సున్నితం. పరమభక్తుడైన ఉద్దవుని హృదయం జీవరాసులదుస్థితి పట్ల కరుణతో తల్లడిల్లుతున్నది ..
దానికి వాటి సాధన తోడవ్వాలి ఉద్దవా ! ఈ దుఃఖాలను దాటాలనే తీవ్రమైన కోరిక కావాలి అన్నారు శ్రీవారు.
తండ్రీ ! సాధనలన్నీ నీ కరుణ కలగటం కోసం మాత్రమే. నీవే తలచుకుంటే ఈ సాధనలెందుకు ,ప్రయత్నాలెందుకు ? కరుణాంతరంగుడవే ! నీవుతలచుకున్న వీటన్నిటినీ నీ నిజధామమునకు తీసుకెళ్ళొచ్చుకదా ? ఈ జీవులన్నింటికీ ముక్తి ప్రసాదించి నీవెంట తీసుకెళ్లటం నీకేమైనా భారమా ? వాపోతున్నాడు ఉద్దవుడు.
నాకూ తీసుకెళ్లాలనే ఉన్నదయ్యా ! కానీ ఈజీవులన్నీ అలా నావెంట రావటానికి ఒప్పుకోవు అన్నారు పరమాత్మ.
అదేమి ప్రభూ! తమ అనుగ్రహం కోసమే చరాచర జీవులనీ ఎదురుచూస్తుంటాయి .అలాంటప్పుడు మీరే రమ్మంటే ఎందుకాగుతాయి ? మీరే ఏదో వంక చూపాలని చెబుతున్నారు అన్నాడు ఉద్దవుడు.
అదేంకాదు నేను నిజమే చెబుతాను అన్నారు స్వామి
.
కావాలంటే నువ్వే అడిగిచూడు . జన్మలలో కెల్లా జంతుజన్మ అందులోనూ పంది జన్మ అత్యంత హేయమైనది కదా ! అదిగో ఆకనపడుతున్న పందిని అడిగిచూడు వైకుంఠానికి వస్తుందేమో అన్నాడు స్వామి చిరునవ్వులు నవ్వుతూ.
ఉద్దవుడు ఆ పంది దగ్గరకెళ్లాడు
ఓ వరాహమా ! నీ అదృష్టం పండింది. నీకు దివ్యలోకానికెల్లే అవకాశం చిక్కింది . నీవు వైకుంఠమునకు బయలుదేరు అన్నాడు.
అది నింపాదిగా ఎందుకు ? అనడిగింది
ఈ దుఃఖమయజీవితాన్ని వదలి సుఖం పొందటానికి అన్నాడాయన
నాకిక్కడ సుఖంగానే ఉందే ? అన్నదది
పిచ్చిమొద్దా !ప్రతిజీవి జరామరణ చక్రాలను దాటుకుని ఆదివ్యలోకానికెళ్ళడమే ముక్తి .అదే అసలైన సౌఖ్యం .అక్కడ చిక్కుతుంది అసలైన ఆనందం .వివరించాడు ఉద్దవుడు.
ఏమిటీ ! అక్కడ అంత సుఖంగా ఉంటుందా ?
ఆ ! సుఖమంటేనే అది అన్నాడాయన మరలా
మరక్కడ తినటానికి ఇప్పుడు నేనుతింటున్నంతరుచికరమైన "మలం" దొరుకుతుందా అక్కడ ? అడిగింది పంది.
ఛీ!ఛీ ! దరిద్రపుగొట్టు మొఖమా . ఇంతనీచపుగొట్టు తిండికాదు దివ్యమైన మధురమైన అమృతమే దొరుకుతుంది అన్నాడు ఉద్దవుడు
ఏమిటీ ! దీనికంటే రుచిగా ఉంటుందా అది ? అనుమానంగా అడిగింది పంది.
ఛీ! మళ్ళి అదేమాట .అది దివ్యమైన రుచి భూమిపై దొరకదు అన్నాడాయన
పందికి వళ్లు మండిపోయింది. నువ్వొట్టి అబద్దాలకోరువి. దీనికంటే రుచికరమైన పదార్ధం ఇంకెక్కడా ఉండదు . నీవైకుంఠమూ వద్దు గియ్ కుంఠమూ వద్దు వెళ్లు ... మోసగాడా ! అని ఈసడించుకుని తృప్తిగా మలాన్ని భుజించటంలో నిమగ్నమైనది అది.
ఉద్దవునికి నోటమాటరాలేదు పాపం !

0 వ్యాఖ్యలు:
Post a Comment