హనుమత్ రక్షాయగం పూర్ణాహుతి
>> Tuesday, June 8, 2010
భక్తజనపాలకుడు, భవిష్యద్రహ్మ హనుమంతులవారిని భక్తజన రక్షణ చేయాలని కోరుతూ నలభై రొజులపాటు సాగిన హనుమ రక్షాయాగం పూర్ణాహుతి తో ముగిసింది . హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం నుంచి రుద్రసూక్త ప్రకారంగా అభిషేకములు, అర్చనలు నిర్వహించారు దీక్షాధారులు . ఆ తరువాత భక్తులందరి తరపున హోమము నిర్వహించటం జరిగింది . గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున ఆహుతులివ్వటం జరిగింది. చెన్నైనుంచి హోమంలో పాల్గొనేందుకువచ్చిన మన బ్లాగ్ లోక మితృలు నాగప్రసాద్ ,సునీల్ వైద్యభూషణ్ లు ప్రధాన భూమిక వహిస్తూ యాగ నిర్వహణలో పాల్గొన్నారు. నలభైరోజులపాటు దీక్షలో ఉన్న బాల బ్రహ్మ చారులు తమ తల్లిదండ్రులతో కలసి యాగమ్ లో పాల్గొని స్వామిని అర్చించారు.
4 వ్యాఖ్యలు:
శుభం
అందరికి ఆ అదృష్టం ఉండదు లెండి. ఎవరో నాగప్రసాదు లాంటి మంచివాళ్ళకు తప్ప . సంవత్సరం రోజులు వేచి చుసినా ఈ సారి కూడా ఆ స్వామి నన్ను పూర్ణాహుతి కి ఉండకుండా తరిమేసారు. వచ్చే హనుమజ్జయంతి పుర్ణాహుతికైనా నన్ను రప్పించుకునేలా ప్రార్ధించడం వినా ఎం చెయ్యగలను చెప్పండి .
ఐతే ఒకటి, ఎన్నడులేనిది ఆ రోజు మా పూలవాడు నాకు బిల్వపత్రాలు ఇచ్చాడు పూలతో పాటు. బిల్వపత్రాలతో శివాంశసంభూతుడైన ఆ స్వామికి పూజ చెయ్యగలిగాను. ఈ సారికి ఇలా కరుణించాడు స్వామి.
వచ్చే హనుమజ్జయంతి కోసం ఎదురుచూస్తూ ఉంటాము.
అందరి తరఫున తమరు చేసిన పూర్ణాహుతి యాగం బాగా జరిగి నందులకు చాలా సంతోషం.మీ ఏకాగ్రతకి మీతో సహకరించి కృషిచేసిన శిష్యులకు అందరికి హృదయ పూర్వక ధన్య వాదములు.
sai raam
poorna hutiki prakruti kooda sahakarichinatlundi
Post a Comment