శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ప్రవాస భారతీయ యువకుల్లారా ! ఆపదలు బాపే హనుమద్రక్షలను అందుకుని ధరించండి.

>> Monday, June 1, 2009


ఈసంవత్సరాన అకారణ విరోధాలు ,విపత్తులు పెరుగుతాయని శాస్త్రాలు హెచ్చరించిఉన్నాయి. వీటి దుష్ఫలితాలను ముందుగా వూహించే సర్వత్రా రక్షణ కలిగించగల హనుమత్ రక్షాయాగానికి "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం " సంకల్పం చేసి నది. భక్తజనుల రక్షణార్ధమై ఉగాదినుండి -మే 20 వరకు 54 రోజులు యాగము నిర్వహించి అక్కడ పూజలో వుంచిన రక్షలను అడిగినవారికందరకు పంపటము జరిగినది. దేశవిదేశాలలోనుండి ఎందరో భక్తులు ఈ యాగములో చాలీసా పారాయణము చేయుటద్వారా పాల్గొని సర్వరక్షకుడు,రాక్షసాంతకుడైన హనుమంతుని రక్షణ పొందారు.
ప్రపంచములో రోజురోజుకు పెరుగుతున్న దౌర్జన్య కరసంఘటనలు రాక్షస మనస్తత్వముతో కూడుకున్నవై అమాయకులెందరో బలవుతున్నారు.

భక్తజనుల రక్షణార్ధము ఈ యాగమును మరొక ఆవర్తి చేయటము ,గోత్రనామాలు పంపిన వారి కొరకు పూజించిన రక్షలను పంపటము చేయాలని శ్రీపీఠ సేవకులు ఆలోచనలో నున్నారు. ప్రస్తుతము అమెరికాలోనూ ,ఆస్ట్రేలియాలోనూ జరుగుతున్న దుర్ఘటనలను దృష్టిలో నుంచుకుని అక్కడనుండి అడిగినవారందరకూ స్వామి రక్షలు పంపాలని నిర్ణయించుకున్నాము. పీఠము జనకళ్యాణము కొరకు కార్యక్రమాలు చేపడుతున్నది. వీటి కొరకు ఎవరూ డబ్బులు పంపవలసిన పనిలేదు. కాకుంటే విదేశాలకు పోస్టలి ఖర్చులు భరించే స్థితి మాకులేనందున ఎక్కువమందికి అందే అడ్రస్ లు ఇస్తే అక్కడకు పంపటానికయ్యే పోస్టల్ ఖర్చు పంపగలిగితే ఎంతమందికైనా రక్షలు పంపటానికి ప్రయత్నిస్తాము.అయితే ఇవిధరించాలంటే ఖచ్చితముగా పాటించవలసిన నియమములు కొన్నున్నాయి.
ఇవి సాధారణముగా పాటించగల నియమాలే.
౧. నలభైరోజులు పాటు హనుమాన్ చాలీసా పారాయణము చేయాలి.
౨.ఈకాలములో మధ్యమాంసాదులు ముట్టరాదు.
౩ జీవిత భాగస్వామిని తప్ప మిగతావారిని అక్కచెల్లెల్లుగా ,అన్నదమ్ములుగా భావించి వ్యవహరించాలి.
స్వామి నిష్ఠాగరిస్ఠుడు .అధర్మ నాశకుడు ,గుర్తుంచుకోండి.
౪.బయటకు వెళ్ళేప్పుడు తప్పనిసరిగా స్వామి చాలీసా మననము చెస్తూ వెళ్ళాలి.
౫. ధార్మిక ప్రవృత్తి కలిగి అందరినీ స్వామి స్వరూపంగా భావించి గౌరవించాలి.

ఈరక్షలను ధరించుటద్వారా మీకు హాని చేద్దామనుకున్న వారిలో సహితము భీతి,పరివర్తన కలిగి మీపట్ల మిత్రత్వము వహిస్తారు. ఇతరులకు హానిచేయాలనే రాక్షస తత్వాన్ని ,రాక్షసాంతకుడైన పవనకుమారుడు నిర్మూలిస్తాడు.మీరు నియమముగా వున్నంత కాలము ఈ రక్షలు శక్తివంతములై మిమ్ము రక్షిస్తుంటాయి.
మీ గోత్రనామాలు పంపితే మీ కొరకు ఇక్కడ పూజ జరుగుతుంది . దీనికొరకు మీరేమీ పంపనక్కరలేదు . నలభైరోజుల అనంతరము మీరున్నచోట సామూహికముగా హనుమత్ చాలీసా హోమము చేసుకునే విధానము సూచించటము జరుగుతుంది .కోరినవారి పేర ఇక్కడ ని్ర్వహించటము జరుగుతుంది.

*॑ విజ్ఞప్తి.
ఈసమాచారాన్ని తెలిసినవారందరూ ,అవసరమగు వారందరకూ తెలిసేట్లుగా ప్రయత్నించ ప్రార్ధన.ఇది హనుమత్ సేవా కార్యక్రమముగా భావించ మని మనవి.

బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరాణాద్భవేత్
contact
durgeswara@gmail.com
9948235641


5 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar June 2, 2009 at 1:41 AM  

మీరు మరీనండీ! సమస్యకూ సమాధానానికీ అన్నిటికీ నమ్మకం ప్రధానమంటే ఎట్లా? పూజలూపునస్కారాలూ, తాయెత్తులూతంత్రాలతో దాడులు ఆగుతాయంటారా?

durgeswara June 2, 2009 at 2:23 AM  

కొన్ని దుర్ఘటనలు ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియనంత మాత్రాన అజరిగేసమయానికి అవిజరగక మానవు. కొన్ని ఉన్నత సంకల్పాలద్వారా చెడు ఆపవచ్చు అనేది మనకు తెలియనంత మాత్రాన నిజం కాకపోదు. అన్నీ మనజానాబెత్తల కొలతలకే అందవు. మానవుడు మేధావినని భావించుకోవచ్చు కాని వాని మేధస్సును అపహాస్యం చేస్తూ జరిగేవి జరుగుతూనే వున్నాయి. ఫరవాలేదు .సత్ప్రవర్తన కలిగి దైవాన్ని ఆశ్రయించటమ్ తప్పనిసరిగా చెడు తొలగించి శుభాన్ని కలగజేస్తోంది అని పెద్దలు ఆచరించి చూపిన సత్యమైనా మాట.అది మేము నడుస్తున్న బాట. ఏమో ఎవరికి తెలుసు కత్తి మహేషగారికే ఇది అనుభవపూర్వకంగా తెలిసే సమయమొస్తుందని. కాదు అనటానికి ఆధారాల్లేవు.ఎందుకంటే ఇంతకంటే ధర్మాన్ని విమర్శించినవారి చరిత్రలో చాలా చమత్కారాలు కనపడుతున్నాయి మరి.

Kathi Mahesh Kumar June 2, 2009 at 2:39 AM  

ప్రార్ధించడమే మనం చెయ్యగలిగిన మానవ ప్రయత్నం అనుకుంటే మాత్రం ఆ ప్రార్థన ఇట్టిబూటకం. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో అది ఫలాయనవాదం అనిపించుకుంటుంది.

durgeswara June 2, 2009 at 2:46 AM  
This comment has been removed by the author.
durgeswara June 2, 2009 at 2:56 AM  

శస్త్రచికిత్స అవసరమైనప్పుడు కొందరు ఆపరేషన్ చేస్తూ
వుండాలి మరికొందరు ఆక్సిజన్ ఎక్కిస్తూవుండాలి.అలావద్దుఅనకూడదు.ఎవరిపనివాళ్లుచేయాలి.లోకానికి ఎవరినుంచి మేలుజరిగినా అభిలషణీయమేకదా? మీ ప్రయత్నం మీరుకానివ్వండి.శుభం
వట్టిమాటలకంటె ఏదోవొక ప్రయత్నం మంచిదేకదా?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP