శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆస్తమా రోగులకు ఈమందు బాగా పనిచేస్తున్నదట ........

>> Friday, January 2, 2009

ఆస్తమా రోగులకు కాస్తంత ఊరట కలిగించే వార్తే ఇది. అదేంటంటే... ఫంగల్ ఇన్‌ఫెక్షన్ నివారణ మందుతో ఆస్తమా వ్యాధికి కూడా ఉపశమనం లభిస్తుందని మాంచెస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా "సివియర్ ఆస్తమా విత్ ఫంగల్ సెన్సిటైజేషన్ (సాఫ్స్)"తో బాధపడేవారికి ఈ యాంటీ ఫంగల్ మందు బాగా పనిచేస్తున్నాయని వారంటున్నారు.

ఈ విషయమై మాంచెస్టర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డేవిడ్ డెన్నింగ్ మాట్లాడుతూ... అసలు చాలామందికి ఫంగల్ ఎలర్జీల వల్లనే ఆస్తమా వస్తుందని, అందుకే ఈ మందులు బాగా పని చేస్తున్నాయని చెప్పారు. తమ పరిశోధనల్లో భాగంగా ఏడు రకాల ఫంగల్ ఎలర్జీలకు గురై ఆస్తమా వ్యాధిగ్రస్తులైన 58 మందిని ఎంపిక చేసి, రోజుకు రెండుసార్లు ఇట్రాకానజోల్-200 ఎంజీ మాత్రలను ఇచ్చామని ఆయన వివరించారు.

దీంతో 62 శాతం మంది రోగుల్లో ఆస్తమా బాగా తగ్గిపోవడమే గాకుండా... ఆస్తమా వల్ల వచ్చే జలుబు, ఉదయంపూట సంభవించే శ్వాసకోస సమస్యలు కూడా ఆగిపోయాయని డేవిడ్ వెల్లడించారు. ఇకపోతే, పై రోగుల్లో 11 మంది మాత్రం యాంటీ ఫంగల్ మందుల వల్ల ప్రతికూల ప్రభావం కనిపిస్తోందంటూ మధ్యలోనే వాటిని తీసుకోవడం మానేశారని ఆయన తెలిపారు.

అయితే నాలుగు నెలలు గడిచేసరికి వీరికి మళ్లీ ఆస్తమా మొదలైందని డేవిడ్ చెప్పారు. కాగా, ఇట్రాకానజోల్ మందు అన్ని సందర్భాల్లోనూ, అందరికీ ఉపయోగపడక పోవచ్చుగానీ, కొంతమందికి మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు.

కాబట్టి, ఆస్తమాతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్న వ్యాధిగ్రస్తులు ఇట్రాకానజోల్ మందును ఓసారి ప్రయత్నించి చూడగలరు. అయితే ముందుగా వైద్యుల పర్యేవేక్షణలో కొన్ని రోజులపాటు దీనిని వాడి.. తగ్గుముఖం పడుతున్నట్లయితే కొనసాగించటం, లేదంటే ఆ మందుకు స్వస్తి చెప్పటం మాత్రం మరచిపోవద్దు.[వెబ్ దునియా నుండి ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP